ETV Bharat / sports

అండర్​-19తో క్రికెట్​లోకి ఎంట్రీ- ఒక్క రోహిత్ తప్ప అందరూ రిటైర్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 9, 2024, 4:12 PM IST

Updated : Feb 9, 2024, 5:24 PM IST

Under 19 World Cup Rohit Sharma : క్రికెట్ చరిత్రలో ఎంతోమంది ప్లేయర్లు వచ్చారు, వెళ్లారు. అండర్-19 నుంచే చాలామంది క్రికెట్ పిచ్​ల మీద తమ ప్రతాపం, ప్రతిభ చూపించారు. అయితే చాలా తక్కువ మంది మాత్రం ఎక్కువ కాలం క్రికెట్ల్​లో మెరిశారు. అలా అరుదైన రికార్డును రోహిత్ శర్మ కూడా సాధించాడు. ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం.

Under 19 World Cup Rohit Sharma
Under 19 World Cup Rohit Sharma

Under 19 World Cup Rohit Sharma : టీమ్ఇండియా కెప్టెన్‌, రికార్డుల రారాజు రోహిత్‌శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే క్రికెట్‌లో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న హిట్​మ్యాన్ తన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. అండర్‌-19 క్రికెట్‌ ద్వారా అంతర్జాతీయ కెరీర్‌ ఆరంభించిన రోహిత్ క్రికెట్​లో అన్ని ఫార్మాట్లలోనూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా ఎన్నో రికార్డులను బ్రేక్‌ చేశాడు. ఇలా అండర్-19 నుంచి క్రికెట్​లోకి అడుగుపెట్టిన ప్లేయర్లు పోలిస్తే రోహిత్ శర్మ ప్రత్యేకతను చాటుకున్నాడు.

అయితే రోహిత్​తో పాటు అండర్​-19 నుంచి క్రికెట్​లోకి అడుగు పెట్టిన ప్లేయర్లు ఎవరూ ఇప్పుడు ఆడటం లేదు. అందరూ క్రికెట్​కు వీడ్కోలు చెప్పేశారు. ప్రస్తుతం రోహిత్​ శర్మ ఒక్కరే ఫామ్​లో ఉన్నారు. ఒకప్పుడు ఆయా దేశాల్లో స్టార్‌ ఇమేజ్‌ సొంతం చేసుకున్న ప్లేయర్లు ఎప్పుడో మైదానం వీడగా, రోహిత్‌ శర్మ మాత్రం నిలకడైన ఆట తీరుతో ఇంకా కొనసాగడటం విశేషంగా చెప్పొచ్చు. ఈ సందర్భంగా రోహిత్​తో పాటు అండర్‌-19 క్రికెట్‌ ఆడి, రిటైర్మెంట్‌ తీసుకున్న క్రీడాకారులు ఎవరెవరో ఓసారి చూద్దాం.

ఇమాద్‌ వసీమ్ : రోహిత్‌ శర్మతో పాటు అండర్‌-19లో గుర్తింపు తెచ్చుకున్న పాకిస్థాన్‌ బ్యాటర్ ఇమాద్‌ వసీం. గత ఏడాదే ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 2023 నవంబర్‌ 24న అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్ పలికినట్లు తెలిపాడు. 55 వన్డేలు, 66 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇమాద్‌ వసీమ్ అండర్‌-19 టోర్నీలో మెరుపులు మెరిపించాడు. కేవలం 34 ఏళ్ల వయసులో ఆటకు గుడ్‌బై చెప్పడం ఇమాద్‌ వసీం అభిమానులను నిరాశపరిచింది.

తిసారా పెరీరా : శ్రీలంక మాజీ క్రికెటర్‌ తిసారా పెరీరా కూడా రోహిత్‌ సహచరుడే. ఇద్దరూ ఒకేసారి అండర్‌-19లో తమ దేశాలకు ప్రాతినిధ్యం వహించాడు. 2021లో రిటైర్మెంట్‌ తీసుకున్న పెరీరా, శ్రీలంక తరపున ఆడిన మ్యాచ్‌ల్లో జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. పరిమిత ఓవర్ల ఫార్మట్లలో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అలానే 2014లో టీ20 వరల్డ్‌ కప్‌ గెలుచుకున్న శ్రీలంక జట్టులో సభ్యుడు.

సునీల్ నరైన్ : వెస్టిండీస్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన సునీల్‌ నరైన్‌ కూడా గత ఏడాదే రిటైర్మెంట్ పలికాడు. 2011లో అంతర్జాతీయ కెరీర్‌ ప్రారంభించిన సునీల్‌ నరైన్‌ కేవలం 12 ఏళ్లు మాత్రమే ఆటను కొనసాగించాడు. ఎంతో భవిష్యత్‌ ఉన్నప్పటికీ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ తీసుకున్నాడు నరేన్‌.

మొయిన్ అలీ : ఇంగ్లాండ్‌ ఆటగాడు మొయిన్ అలీ కూడా రోహిత్‌ శర్మతో పాటే అండర్‌-19 ఆడాడు. గత ఏడాది టెస్ట్ మ్యాచ్​లకు వీడ్కోలు చెప్పాడు మొయిన్‌ అలీ. 2014లో ఇంగ్లాండ్ టెస్ట్ జట్టులోకి ప్రవేశించిన మొయిన్‌ అలీ 2023లో రిటైర్మెంట్‌ తీసుకున్నాడు.

డేవిడ్ వార్నర్ : ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ డేవిడ్ వార్నర్ కూడా వన్డేలు, టెస్టు మ్యాచ్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అనుభవం లేకుండానే ఆస్ట్రేలియా జట్టులో చోటు సంపాదించిన డేవిడ్‌ వార్నర్‌ బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా అభిమానుల్లో చెరగని ముద్రవేశాడు.

పరాస్‌ ఖడ్కా : నేపాల్‌ క్రికెటర్‌ పరాస్‌ ఖడ్కా కూడా అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ తీసుకున్నాడు. రోహిత్‌ శర్మతో పాటు అండర్‌ 19 క్రికెట్‌లో ఆడాడు. 2021 ఆగస్టు 3న ఆటకు విరామం చెప్పాడు.

కీరన్ పొలార్డ్ : పొలార్డ్ వెస్టిండీస్ తరపున 123 వన్డేలు, 101 టీ20లు ఆడాడు. వన్డేల్లో 2706 పరుగులతో పాటు 55 వికెట్లు తీశాడు. ఇందులో 3 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20ల్లో 1569 పరుగులతోపాటు 42 వికెట్లు పడగొట్టాడు పొలార్డ్. 2022 ఏప్రిల్‌ 20న అన్ని ఫార్మట్ల క్రికెట్​ను ఆడటం మానేశాడు.

డీన్ ఎల్గర్ : దక్షిణాఫ్రికా క్రికెటర్‌ డీన్ ఎల్గర్ ఈ మధ్యే క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ తీసుకున్నాడు. 2006లో శ్రీలంకలో జరిగిన అండర్‌-19 టోర్నీలో దక్షిణాఫ్రికా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు డీన్‌ ఎల్గర్‌. దక్షిణాఫ్రికా టెస్టు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన డీన్‌ ఎల్గర్‌ ఇటీవల భారత్‌లో జరిగిన సిరీస్‌లో తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రకటించాడు.

ఆరోన్ ఫించ్ : ఆస్ట్రేలియ మాజీ కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ గతేడాది మార్చి 13న అన్నిరకాల క్రికెట్‌ ఫార్మట్లకు వీడ్కోలు పలికాడు. రోహిత్‌ శర్మతోపాటే అండర్‌ -19 ఆడిన ఫించ్‌, క్రికెట్‌లో విధ్వంసకర ఆటకు ప్రతిరూపంగా నిలిచాడు. పేరుకు తగ్గట్టుగా తన బ్యాటింగ్‌తో బౌలర్లకు చుక్కలు చూపించేవాడు. ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు.

U-19 వ‌ర‌ల్డ్​ క‌ప్​- భారత్​ ఖాతాలో ఐదు టైటిళ్లు- టీమ్​ఇండియా సక్సెస్​ఫుల్ జర్నీ మీకు తెలుసా?

పదేళ్ల ఎదురుచూపులు- 72ఏళ్ల కిందట భారత్​కు ఫస్ట్ విక్టరీ- గుడ్ మొమెరీ!

Last Updated :Feb 9, 2024, 5:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.