ETV Bharat / sports

వింటేజ్ పంత్​ ఈజ్​ బ్యాక్​ - ధోనీ హెలికాప్టర్ షాట్​తో విమర్శకులకు పంచ్​ - IPL 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 25, 2024, 9:38 AM IST

Rishabh Pant Delhi Capitals
Rishabh Pant Delhi Capitals

Rishabh Pant Delhi Capitals : తన ఆటతీరును విమర్మించిన వారికి బ్యాట్​తో ఆన్సర్ చెప్పాడు దిల్లీ క్యాపిటల్స్ సారధి రిషభ్ పంత్. 43 బంతుల్లో 88 పరుగులు చేసి అందరి చేత ఇప్పుడు ప్రశంసలు పొందుతున్నాడు. గుజరాత్​ టైటాన్స్​, దిల్లీ క్యాపిటల్స్ మధ్య బుధవారం (ఏప్రిల్ 24న) జరిగిన మ్యాచ్​ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు మీ కోసం.

Rishabh Pant Delhi Capitals : ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్​ టైటాన్స్​తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు బౌలర్లపై విరుచుకుపడ్డాడు దిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా పోటా పోటీగా జరిగిన ఈ పోరులో హాఫ్ సెంచరీ అయ్యే వరకూ 4 సిక్సులు, 4 ఫోర్లు బాదిన రిషభ్ ఆ తర్వాత ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు.

వన్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన అక్షర్ పటేల్ 43 బంతుల్లో 66 (5 ఫోర్లు, 4 సిక్సులు) పరుగులు బాదితే కెప్టెన్ కమ్ వికెట్ కీపర్ అయిన పంత్ అవే 43 బంతుల్లో 88 (5ఫోర్లు, 8సిక్సులు) పరుగులు చేశాడు. ఐపీఎల్ 2024లో జరిగిన 40వ మ్యాచ్‌లో వీరోచిత ఫామ్​ కనబరిచిన పంత్​ను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడిన మ్యాచ్‌లో కాస్త ఇబ్బందిపడ్డ రిషబ్ ఈ గేమ్‌తో కసి తీర్చుకున్నాడు.గుజరాత్ బౌలర్లు విసురుతున్న స్లో బౌలింగ్ ను ధీటుగా ఎదుర్కొంటూ, ప్రతి బంతిని బౌండరీకి తరలించాడు. 16వ ఓవర్లో ధోనీ హెలికాప్టర్ షాట్ కూడా ఆడేసి సౌరవ్ గంగూలీని సైతం ఔరా అనిపించాడు. అదే ఓవర్​లో మరో ట్రేడ్ మార్క్ షాట్ ఆడాడు. ఆఫ్ స్టంప్‌కు వెలుపలగా వస్తున్న స్లో బాల్​ను హిట్ చేసి బౌండరీకి తరలించాడు.

ఈ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి పంత్ చక్కటి ఫామ్‌లో కనిపిస్తున్నాడు. రోడ్ యాక్సిడెంట్ కారణంగా 18 నెలల పాటు విరామంలో ఉన్న పంత్, ఆరెంజ్ క్యాప్ టేబుల్‌లో నాలుగో స్థానంలో నిలిచాడు. సంజూ శాంసన్ తర్వాత వికెట్ కీపర్‌గా అత్యంత వేగవంతమైన 300 పరుగులు పూర్తి చేసిన వికెట్ కీపర్ స్థానం దక్కించుకున్నాడు.

సన్​రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మంచి బ్యాటింగ్ పిచ్ మీద కూడా 35 బంతుల్లో 44 పరుగులు మాత్రమే చేశాడు పంత్. 267 పరుగుల లక్ష్య చేధనలో దిల్లీ 199 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్​లో పంత్ రాణించలేకపోయాడంటూ విమర్శలు వినిపించాయి.

వాటన్నిటికీ బదులిస్తూ గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 43 బంతుల్లో 88 పరుగులు చేశాడు. డెత్ ఓవర్లలోనూ అక్సర్ పటేల్‌తో కలిసి ధాటిగా ఆడి 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ ఒక్క మ్యాచ్‌లో పంత్ 8 సిక్సులు ఆడి దిల్లీ 20 ఓవర్లలో 224 పరుగులు చేయడంలో కీలకమయ్యాడు.

అంపైర్​తో పంత్ గొడవ - మండిపడ్డ మాజీ క్రికెటర్ - IPL 2024 LSG VS DC

కోహ్లీ, పంత్​ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​ - టీ20 ప్రపంచకప్‌ జట్టు ఇదే! - T20 World Cup 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.