ETV Bharat / sports

అంపైర్​తో పంత్ గొడవ - మండిపడ్డ మాజీ క్రికెటర్ - IPL 2024 LSG VS DC

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 13, 2024, 11:27 AM IST

Updated : Apr 13, 2024, 11:51 AM IST

అంపైర్​తో పంత్ గొడవ - మండిపడ్డ మాజీ క్రికెటర్
అంపైర్​తో పంత్ గొడవ - మండిపడ్డ మాజీ క్రికెటర్

IPL 2024 Delhi Capitals Pant : లఖ్​నవూతో జరిగిన మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్​ రిషభ్ పంత్ అంపైర్​తో గొడవపడ్డాడు. దీనిపై మాజీ క్రికెటర్ కూడా స్పందించాడు. అసలేం జరిగిందంటే?

IPL 2024 Delhi Capitals Pant : ఐపీఎల్ అంటే రికార్డులు, రివార్డులు ఎలా అయితే కామన్‌గా కనిపిస్తాయో.. వాగ్వాదాలు, వివాదాలు కూడా. రీసెంట్‌గా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో పంత్ ఫీల్డ్ అంపైర్‌తో గొడవపడ్డాడు. అసలు ఆ గొడవకు దిగడమే తప్పని కచ్చితంగా పంత్‌కు జరిమానా విధించాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ విమర్శలకు దిగుతూ రిషబ్ పంత్‌ను ఆడిపోసుకున్నాడు. ఆట మధ్యలో పంత్ ఫ్రస్ట్రేషన్‌కు గురవుతూ సుదీర్ఘమైన వాదన పెట్టుకున్నాడనేది గిల్ క్రిస్ట్ అభిప్రాయం. ఈ ఘటన లఖ్‌నవూ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో చోటు చేసుకుంది.

లఖ్‌నవూ బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌కు దిల్లీ క్యాపిటల్స్ బౌలర్ ఇషాంత్ శర్మ వేసిన బంతిని ఫీల్డ్ అంపైర్ వైడ్‌గా ప్రకటించాడు. అప్పుడు పంత్​ రివ్యూ కోసం టీ సైన్ చూపించే విధంగా చేశాడు. దీంతో పంత్ రివ్యూ కోరుతున్నట్లుగానే భావించిన ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. అక్కడే అసలు కన్ఫ్యూజన్ మొదలైంది. ఆ సమయంలో చాలాసేపటి వరకూ పంత్ అంపైర్లతో వాదనకు దిగాడు.

అయితే రివ్యూ కోరకుండానే అంప్లైర్లు రివ్యూ ఇచ్చారని పంత్ వాదనకు దిగినట్లు కామెంటేటర్లు అన్నారు. ఆ తర్వాత మళ్లీ కామెంటేటర్లు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. వైడ్ కోసం కోరిన రివ్యూలో స్నికో మీటర్ ఉపయోగించడం పంత్ అసంతృప్తికి కారణమైందని, ఆ విషయంపై వాదనకు దిగాడని కామెంటేటర్లు చెప్పుకొచ్చారు.

ఈ వివాదంపై గిల్ క్రిస్ట్ మండిపడ్డాడు. అంపైర్ - ప్లేయర్ మధ్య సంభాషణ అనేది సింపుల్ గా ఉండాలని పేర్కొన్నాడు. "నాకు తెలిసి ఇది చాలా సింపుల్ విషయం. రిషబ్ పంత్ ఎంతసేపు కంప్లైంట్ చేస్తున్నాడనేది విషయం కాదు. అతనే కాదు మరే ప్లేయర్ కంప్లైంట్ చేయడానికి వచ్చినా సరే. ఆ విషయం అయిపోయింది. తర్వాత పనిచూడండి అని అంపైర్లు చెప్పాలి. అప్పటికీ ఇంకా వాదిస్తూ ఉంటే అప్పుడూ అతనికి జరిమానా విధించాల్సి ఉంటుంది" అని అభిప్రాయపడ్డాడు.

కాగా, శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. పంత్ మరోసారి బ్యాట్ తో చెలరేగి 24 బంతుల్లో 41 పరుగులు బాదాడు. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. హ్యాట్రిక్ ఓటమి తర్వాత జట్టు అందుకున్న ఘన విజయాన్ని దిల్లీ అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

చరిత్ర సృష్టించిన పంత్​ - తొలి బ్యాటర్​గా రికార్డు - IPL 2024 LSG VS DC

కోహ్లీకి మరో అరుదైన గౌరవం - అక్కడ మైనపు విగ్రహం ఏర్పాటు - Virat Kohli statue

Last Updated :Apr 13, 2024, 11:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.