ETV Bharat / sports

విజృంభించిన మయాంక్‌- చెలరేగిన డికాక్‌, పూరన్‌- ఆర్సీబీపై లఖ్‌నవూ విజయం - RCB vs LSG IPL 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 2, 2024, 11:00 PM IST

Updated : Apr 3, 2024, 6:27 AM IST

RCB vs LSG IPL 2024: 2024 ఐపీఎల్​లో లఖ్​నవూ సూపర్ జెయింట్స్ రెండో విజయం నమోదు చేసింది. మంగళవారం చిన్నస్వామి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో లఖ్​నవూ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది.

RCB vs LSG IPL 2024
RCB vs LSG IPL 2024

RCB vs LSG IPL 2024: 2024 ఐపీఎల్​లో లఖ్​నవూ సూపర్ జెయింట్స్ రెండో విజయం నమోదు చేసింది. మంగళవారం చిన్నస్వామి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో లఖ్​నవూ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. 182 పరుగుల లక్ష్యా ఛేదనలో ఆర్సీబీ 153 పరుగులకే ఆలౌటైంది. మహిపాల్ లొమ్రోర్ (33 పరుగులు) రాణించగా, విరాట్ కోహ్లీ (22), రజత్ పాటిదార్ (29) ఫర్వాలేదనిపించారు. లఖ్​నవూ బౌలర్లలో మయంక్ యాదవ్ 3, నవీనుల్ హక్ 2, మణిమరన్ సిద్ధార్థ్ , యశ్ ఠాకూర్, మార్కస్ స్టాయినిస్ తలో వికెట్ దక్కించుకున్నారు.

182 పరుగుల ఛేదనను ఆర్సీబీ ఘనంగానే ఆరంభించింది. తొలుత ఓపెనర్లు విరాట్ కోహ్లీ (22 పరుగులు), ఫాఫ్ డూప్లెసిస్ (19 పరుగులు) దూకుడుగానే ఆడారు. వీరి దెబ్బకు 4 ఓవర్లలో బెంగళూరు 40 పరుగులు సాధించింది. కానీ, 5వ ఓవర్లో అరంగేట్ర బౌలర్ సిద్ధార్థ్ చక్కని బంతితో విరాట్​ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత ఓవర్లో డూప్లెసిస్ రనౌట్ అయ్యాడు.

ఆ వెంటనే స్టార్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్​వెల్ (0)ను లఖ్​నవూ స్పీడ్ గన్ మయంక్ యాదవ్ వెనక్కిపంపాడు. ఆ తర్వాత ఆర్సీబీ వరుసగా గ్లెన్ మ్యాక్స్​వెల్ (0), కామెరూన్ గ్రీన్ (9) వికెట్లు కోల్పోయింది. దీంతో తొలి 9 ఓవర్లకే నాలుగు కీలక వికెట్లు పారేసుకున్న ఆర్సీబీ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో అనూజ్ రావత్ (11), రజత్ పాటిదార్ (29) ఆదుకునే ప్రయత్నం చేసినా, ఈ జోడీని స్టాయినిస్ విడగొట్టాడు. చివర్లో ఇంపాక్ట్ ప్లేయర్ మహిపాల్ లొమ్రోర్ మెరుపులు మెరిపించినా అది ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది. ఇక ఈ సీజన్​లో ఇప్పటివరకూ నాలుగు మ్యాచ్​లు ఆడిన ఆర్సీబీ ఒకదాంట్లో నెగ్గి, మూడో పరాజయం మూటగట్టుకుంది.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన లఖ్​నవూ మంచి స్కోర్ సాధించింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (81 పరుగులు 56 బంతుల్లో) అదరగొట్టాడు. కెప్టెన్ రాహుల్ (20 పరుగులు), దేవదత్ పడిక్కల్ (6), మార్కస్ స్టాయినిస్ (24) విఫలమయ్యారు. చివర్లో నికోలస్ పూరన్ (40 పరుగులు, 21 బంతుల్లో 1x4, 5x6) మెరుపులు మెరిపించాడు. దీంతో లఖ్​నవూ స్కోర్ 180 దాటింది. ఆర్సీబీ బౌలర్లలో మ్యాక్స్​వెల్ 2, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్, టోప్లె తలో వికెట్ దక్కించుకున్నారు.

ఈ పేసర్లు మయ స్పీడు- బంతి విసిరితే 150+kmph పక్కా!- IPLలో టాప్ 5 ఫాస్టెస్ట్ బాల్స్ - Fastest Ball In IPL

విరాట్, పరాగ్ పరుగులు సేమ్- క్యాప్ మాత్రం రియాన్​కే- ఎందుకో తెలుసా? - 2024 IPL Orange Cap

Last Updated :Apr 3, 2024, 6:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.