ETV Bharat / sports

వరుస విజయాలతో ఆర్సీబీలో జోష్​ - ఇక ఆ సెంటిమెంట్ వర్కౌటైతే ఫైనల్​కే! - IPL 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 13, 2024, 12:11 PM IST

IPL 2024 RCB Playoffs : ఫస్ట్​ ఆఫ్​లో పేలవ ప్రదర్శనతో వరుస ఓటములను అందుకున్న ఆర్సీబీ సెకండాఫ్‌లో అదిరే ప్రదర్శన చేస్తోంది. ప్లే ఆఫ్స్​లోకి అడుగుపెట్టేలా ఉంది. ఈ నేపథ్యంలో ఆ సెంటిమెంట్ రిపీట్​ అయితే కచ్చితంగా బెంగళూరు ఫైనల్​కు అర్హత సాధిస్తుందని అంతా అశిస్తున్నారు. పూర్తి వివరాలు స్టోరీలో.

The Associated Press
The Associated Press (The Associated Press)

IPL 2024 RCB Playoffs : ఐపీఎల్ 2024 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు ప్రదర్శన ఊహించని విధంగా సాగుతోంది. ఫస్ట్​ ఆఫ్​లో పేలవ ప్రదర్శనతో వరుస ఓటములను అందుకున్న ఆ జట్టు సెకండాఫ్‌లో అదిరే ప్రదర్శన చేస్తోంది. మొదటి 8 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం మాత్రమే సాధించిన ఆ జట్టు తర్వాతి ఐదు మ్యాచుల్లో మాత్రం ఐదింటిలో గెలిచింది. తద్వారా ప్లే ఆఫ్స్ ఆశలను సజీవం చేసుకుంది.

చివరిగా ఆదివారం దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 47 పరుగుల తేడాతో భారీ రన్​రేట్​తో గెలిచి ప్లే ఆఫ్స్​ రేసులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఓ సెంటిమెంట్ ప్రచారంలోకి వచ్చింది. అదేంటంటే ఆర్సీబీ వరుస విజయాలు సాధించిన ప్రతీసారి ప్లే ఆఫ్స్ చేరడం లేదా ఫైనల్ చేరుతుంది. 2011 సీజన్‌లో బెంగళూరు జట్టు వరుసగా 7 మ్యాచుల్లో గెలిచి ఫైనల్ చేరింది. కానీ టైటిల్ పోరులో మాత్రం ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 2009 సీజన్‌లోనూ వరుసగా 5 మ్యాచ్‌లు గెలిచి ఫైనల్​కు అర్హత సాధించింది. కానీ అప్పుడు కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2016లోనూ ఐదు మ్యాచులు వరుసగా గెలిచి ఫైనల్​కు వెళ్లింది. అయితే అక్కడ కూడా ఓడిపోయింది. అందుకే ప్రస్తుతం సీజన్​లో వరుసగా ఐదు మ్యాచులు గెలిచిన నేపథ్యంలో ఈ సారి కూడా ఆర్సీబీ ఫైనల్​ వెళ్తుందని అంతా ఆశిస్తున్నారు.

ఇక 2010, 2021లోనూ వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. అందుకే ఇదే సెంటిమెంట్ కొనసాగితే ఈసారి కూడా ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్​తో పాటు ఫైనల్ చేరుతుందని ఆ జట్టు అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

కాగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ తదుపరి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో పోటీపడనుంది. ఈ పోరులో చెన్నైను కనీసం 18 పరుగుల తేడాతో ఓడించడం లేదంటే మెరుగైన రన్‌రేట్ సాధిస్తే ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉంటుంది. ఇక ఆదివారం దిల్లీ క్యాపిటల్స్​పై సాధించిన విజయంతో భెంగళూరు పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు దిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయి తన ప్లే ఆఫ్స్​ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

అంపైర్​పై కోహ్లీ మళ్లీ ఫైర్​ - ఈ సారి ఏం జరిగిందంటే? - IPL 2024

అభిమానులెవరూ ఊహించనిది - ప్లే ఆఫ్స్ ఆశల పల్లకిలో ఆర్సీబీ - IPL 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.