ETV Bharat / sports

టీమ్ఇండియాపై బజ్​బాల్ పనిచేయదు గురూ- దూకుడుగా ఆడడం భారత్​కు కొత్తేం కాదు

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 18, 2024, 8:55 PM IST

India Bazzball Cricket: ఇంగ్లాండ్ జట్టు టెస్టు ఫార్మాట్​లో 'బజ్​బాల్'​ వ్యూహంతో బరిలోకి దిగడం అలవాటుగా చేసుకుంది. అలా బజ్​బాల్ వ్యూహాన్నీ మైదానంలో అమలు చేసి మిశ్రమ ఫలితాలు సాధిస్తుంది. అయితే ఈ బజ్​బాల్ ఆట భారత్​కు మాత్రం కొత్త కాదు. అదెలా అంటారా?

India Bazzball Cricket
India Bazzball Cricket

India Bazzball Cricket: ఇంగ్లాండ్ జట్టు టెస్టు మ్యాచ్ ఆడుతుందంటే చాలు ఎక్కువగా వినిపించే పదం 'బజ్​బాల్'. దూకుడుగా ఆడటమే ఈ 'బజ్​బాల్' కాన్సెప్ట్. అంతకుమించి ఇందులో మరొకటి లేదు. టెస్టు మ్యాచే కదా 5 రోజులు నెమ్మదిగా ఆడొచ్చన్న ఆలోచన ఉండదు. వన్డే, టీ20 ఫార్మాట్​లోలాగే ఈ బజ్​బాల్​లో ధనాధన్ మెరుపులు ఉంటాయి. న్యూజిలాండ్ మాజీ ప్లేయర్ బ్రెండన్ మెక్​కల్లమ్ ఇంగ్లాండ్​కు కోచ్​గా వెళ్లిన తర్వాత ఇంగ్లీష్ జట్టు బజ్​బాల్ వ్యూహం ప్రారంభించింది. అయితే క్రికెట్​లో ఫార్మాట్​తో సంబంధం లేకుండా వేగంగా పరుగులు సాధించడం మెక్​కల్లమ్ స్ట్రైల్. అలా మెక్​కల్లమ్​కు బజ్​ అనే పేరు వచ్చింది. ఇక అతడు ఇంగ్లాండ్​కు కోచ్​గా నియమితుడయ్యాక ఈ పదాన్ని మరింత ప్రచారంలోకి తీసుకొచ్చాడు.

ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ బజ్​బాల్​ పేరుతో టెస్టుల్లో ప్రత్యర్థులపై ఎదురు దాడికి దిగుతోంది. అయితే ఒక్కోసారి ఈ వ్యూహం బెడిసికొడుతోంది. దీని వల్ల ఇంగ్లాండ్ కొన్ని పరాజయాలను కూడా చవిచూసింది. అయినప్పటికీ ఇంగ్లీష్ జట్టు ఇదే వ్యూహాన్ని ఫాలో అవుతూ ప్రపంచ క్రికెట్​లో బజ్​బాల్​ తమకే సొంతం అని ఇంగ్లాండ్​ భావిస్తోంది. కానీ, వాళ్ల కంటే ముందే దశాబ్దాల కిందటే భారత్ టెస్టుల్లో బజ్​బాల్ ఆట ప్రారంభించింది. గతంలోనే కొంతమంది టీమ్ఇండియా బ్యాటర్లు బజ్​బాల్ తరహాలో కొంతమంది పరుగులు చేశారు. మరి వారెవరంటే?

  1. వీరేంద్ర సెహ్వాగ్: భారత్ తరఫున ఇన్నింగ్స్​ ప్రారంభించే సెహ్వాగ్ తొలి బంతి నుంచే హిట్టింగ్ చేస్తాడు. బంతిని బౌండరీ దాటించడమే లక్ష్యాంగా బరిలోకి దిగే సెహ్వాగ్ ఫార్మాట్​తో సంబంధం లేకుండా బౌలర్లపై విరుచుకుపడతాడు. హాఫ్ సెంచరీ అయినా, సెంచరీనైనా బౌండరీతోనే పూర్తి చేసుకునేవాడు. అలా భారత క్రికెట్ చరిత్రలో హిట్టింగ్​కు కేర్​ ఆఫ్ అడ్రస్​గా పేరు తెచ్చుకున్నాడు సెహ్వాగ్.
  2. కపిల్ దేవ్: జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పడు బ్యాట్​తో రెచ్చిపోయి జట్టుకు విజయాన్ని అందిచడమే లక్ష్యాంగా పెట్టుకుంటాడు కపిల్ దేవ్.​ అనేక టెస్టుల్లో బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ పరుగులు సాధించేవాడు. అలా టీమ్ఇండియా సాధించిన అనేక విజయాల్లో కపిల్ దేవ్ కీలక పాత్ర పోషించి, భీకరమై బ్యాటర్ అని ప్రపంచానికి తనను తాను చాటి చెప్పుకున్నాడు.
  3. క్రిస్ శ్రీకాంత్: భారత దిగ్గజ ఆటగాళ్లలో కృష్ణమాచారి శ్రీకాంత్ ఒకడు. తన దూకుడైన ఆట తీరుతో బ్యాటర్​గా, కెప్టెన్​గా టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడు.
  4. సయ్యద్ ముస్తక్ అలీ: విదేశీ గడ్డపై టెస్టుల్లో సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్​ సయ్యద్ ముస్తక్ అలీ. ముస్తాక్ అలీకి బ్యాటింగ్ తీరుకు అప్పట్లోనే అటాకింగ్ బ్యాటర్ అని పేరొందాడు. ఎదురుగా వస్తున్న బంతిని బౌండరీ లైన్​ దాటించమే తన లక్ష్యంగా పెట్టుకునేవాడు అలీ.

ఇలా కొన్నేళ్ల కిందటే టీమ్ఇండియా బ్యాటర్లు టెస్టుల్లో దూకుడుగా ఆడి పరుగులు సాధించేవారు. ఇక ఈతరం క్రికెటర్లలో టెస్టుల్లో రిషభ్ పంత్, యశస్వి జైశ్వాల్, ఇషాన్ కిషన్ కూడా అలా వేగంగా ఆడుతూ భారీ స్కోర్లు చేస్తున్నారు. కాగా, తాజాగా రాజ్​కోట్​ టెస్టులో యంగ్ బ్యాటర్ జైశ్వాల్ దూకుడుగా ఆడి డబుల్ సెంచరీ నమోదు చేయగా, ఇంగ్లాండ్ మరోసారి బజ్​బాల్ వ్యూహంతో పరాజయం పాలైంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రాజ్​కోట్​లో భారత్ గ్రాండ్ విక్టరీ- 434 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చిత్తు

యశస్వి డబుల్ సెంచరీ: రైనాను గుర్తుచేసిన సర్ఫరాజ్- వీడియో వైరల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.