ETV Bharat / sports

పంజాబ్​ అదుర్స్ - టైటాన్ ఖాతాలో మరో ఓటమి - GT vs PBKS IPL 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 4, 2024, 10:58 PM IST

Updated : Apr 5, 2024, 7:55 AM IST

GT vs PBKS IPL 2024: 2024 ఐపీఎల్​లో గుజరాత్ టైటాన్స్- పంజాబ్ కింగ్స్ జట్లు గురువారం తలపడ్డాయి. ఈ మ్యాచ్​కు అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియం వేదికైంది. మరి ఈ మ్యాచ్​లో ఎవరు గెలిచారంటే?

GT vs PBKS IPL
GT vs PBKS IPL

GT vs PBKS IPL 2024 : అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్- పంజాబ్ కింగ్స్ జట్లు మధ్య జరిగిన పోరులో పంజాబ్ విజయం సాధించింది. 3 వికెట్ల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌ను ఓడించింది. శశాంక్‌ సింగ్‌ (61*) తన సంచలన బ్యాటింగ్‌తో పంజాబ్ టీమ్​కు కీలక ఇన్నింగ్స్ అందించాడు.ఇక ఇంపాక్ట్‌ ప్లేయర్‌ అశుతోష్‌ శర్మ (31) కూడా ప్రత్యర్థుల బంతులు ఎదుర్కొని జట్టు విజయంలో భాగమయ్యాడు. స్పిన్నర్‌ నూర్‌ అహ్మద్‌ (2/32) ఆకట్టుకున్నాడు. అయితే నాలుగు మ్యాచ్‌లే ఆడిన టైటాన్స్‌కు ఇది రెండో ఓటమి.

మ్యాచ్ సాగిందిలా :
ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం ఛేదనలో పంజాబ్​కు రెండో ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. శిఖర్ ధావన్ (1) స్వల్ప స్కోరుకే పెలివియన్ చేరాడు. మరో ఓపెనర్ జాని బెయిర్​స్టో (22 పరుగులు), ప్రభ్​సిమ్రన్ సింగ్ (35 పరుగులు) రాణించారు. ప్రస్తుతం క్రీజులో ఉన్న శశాంక్ సింగ్ (50 పరుగులు), అశుతోష్ శర్మ (16) పోరాడున్నారు.

అంతకుముందు కెప్టెన్ శుభ్​మన్ గిల్ (89*) భారీ ఇన్నింగ్స్​తో అదరగొట్టాడు. వన్​డౌన్​లో వచ్చిన కేన్ విలియమ్సన్​ (26 పరుగులు), సాయి సుదర్శన్ (33 పరుగులు, 19 బంతుల్లో), రాహుల్ తెవాటియా (23 పరుగులు) రాణించారు. వృద్ధిమాన్ సాహ (11 పరుగులు) ఈ మ్యాచ్​లో విఫలమయ్యాడు. ఇక పంజాబ్ బౌలర్లలో కగిలో రబాడా 2, హర్షల్ పటేల్, హర్​ప్రీత్ బ్రార్ తలో వికెట్ దక్కించుకున్నారు.

స్కోర్లు

  • గుజరాత్- 199/4 (20 ఓవర్లు)
  • పంజాబ్- 169/6 (17.4 ఓవర్లు)

పంజాబ్ కింగ్స్ (తుది జట్టు) : శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, జితేష్ శర్మ (వికెట్ కీపర్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్, శశాంక్ సింగ్, సికందర్ రజా, అర్ష్‌దీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ.

గుజరాత్ టైటాన్స్ (తుది జట్టు) : శుభ్​మన్​ గిల్(కెప్టెన్), కేన్ విలియమ్సన్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), సాయి సుదర్శన్, విజయ్ శంకర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, దర్శన్ నల్కండే

సన్​రైజర్స్ 'తగ్గేదేలే'- బాలయ్య, పవన్ కల్యాణ్ మేనరిజంతో కెమెరాకు ఫోజులు - Sunrisers Hyderabad Ipl 2024

అదే మా మైనస్​ - అందుకే ఓడిపోయాం! : పంత్ - IPL 2024 DC vs KKR

Last Updated :Apr 5, 2024, 7:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.