ETV Bharat / sports

ధోనీ టు రైనా - ఐపీఎల్​లో సిక్సర్ల వీరులు వీరే!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 19, 2024, 6:04 PM IST

Cricketers With Most Sixes In IPL : మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ సీజన్ మొదలు కానుంది. ఇప్పటికే దీనికోసం అటు ప్లేయర్లతో పాటు ఇటు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఐపీఎల్ సీజన్స్​లో అత్యధిక సిక్సర్లు బాదిన స్టార్స్ ఎవరో ఓ లుక్కేద్దామా ?

Cricketers With Most Sixes In IPL
Cricketers With Most Sixes In IPL

Cricketers With Most Sixes In IPL : మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతీ బ్యాటర్​ బాల్​ను బౌండరీ దాటించేందుకు ఎంతో ఉవ్విళ్లూరుతుంటాడు. తన బ్లాస్టింగ్ సిక్స్​ర్​తో అభిమానుల చేత వావ్​ అనిపించుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. కొన్ని సార్లు స్టేడియం దాటి ఆ బంతి వెళ్లిన సందర్భాలు కూడా మనం ఎన్నో చూసుంటాం. అయితే ఐపీఎల్​లో ఇప్పటివరకు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్లు ఉన్నారు. వారెవరంటే ?

క్రిస్ గేల్ (వెస్టిండీస్):
ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల లిస్ట్​లో తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్. ఇప్పటి వరకు మూడు ఫ్రాంచైజీల తరఫున ఆడిన ఈ స్టార్ క్రికెటర్, 142 మ్యాచ్‌ల్లో 357 సిక్సర్లు బాదాడు.

రోహిత్ శర్మ(ముంబయి ఇండియన్స్):
తన కెప్టెన్సీలో ముంబయి ఇండియన్స్‌ను రికార్డు స్థాయిలో 5 ఐపీఎల్ టైటిల్స్ గెలుచుకుంది. రోహిత్ శర్మ ఈ టీ20 లీగ్‌లో ఇప్పటివరకు 257 సిక్సర్లు కొట్టాడు.

ఏబీ డివిలియర్స్(రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు):
సౌతాఫ్రికకు చెందిన ఈ స్టార్ క్రికెటర్ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడాడు. ఇక ఈయన పేరిట ఈ టోర్నీలో 251 సిక్సర్లు ఉన్నాయి.

ఎంఎస్ ధోని (చెన్నై సూపర్ కింగ్స్):
తన ధనాధన సిక్సర్లతో ప్రత్యర్థులను హడలెత్తిస్తుంటాడు స్టార్ క్రికెటర్ ధోనీ. ఈయన ఇప్పటి వరకు ఐపీఎల్​లో 239 సిక్సర్లు కొట్టాడు.

విరాట్ కోహ్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు):
రన్నింగ్ మెషిన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 234 సిక్సర్లు బాదాడు. అంతే కాకుండా కోహ్లీ ఆడిన 223 మ్యాచ్‌ల్లో 6624 పరుగులు చేశాడు.

డేవిడ్ వార్నర్ (దిల్లీ క్యాపిటల్స్):
ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 226 సిక్సర్లు కొట్టాడు. ఇతడు ఈ లిస్ట్​లో నాలుగో స్థానంలో ఉన్నాడు.

కిరిన్ పొలార్డ్(ముంబయి ఇండియన్స్):
ముంబయి ఇండియన్స్ జట్టు ఆల్ రౌండర్ కిరిన్ పొలార్డ్ 223 సిక్సర్లతో ఈ లిస్ట్​లో ఐదో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో ముంబయి తరఫున పొలార్డ్ ఇప్పటి వరకు 189 మ్యాచ్‌ల్లో 16 అర్థ సెంచరీలు కూడా చేశాడు.

సురేశ్ రైనా(చెన్నై సూపర్ కింగ్స్):
చిన్న తలగా పేరొందిన చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ సురేశ్ రైనా ఇప్పటి వరకు ఆడిన మ్యాచుల్లో 203 సిక్సర్లు బాదాడు. ఐపీఎల్‌లో రైనా ఒక సెంచరీ,39 హాఫ్ సెంచరీలు సాధించాడు.

షేన్ వాట్సన్(చెన్నై సూపర్ కింగ్స్):
చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ ఇప్పటి వరకు ఈ లీగ్​లో 190 సిక్సర్లు కొట్టాడు.

ఆండ్రూస్​ రసెల్ (కోల్​కతా నైట్​ రైడర్స్):
కోల్​కతా జట్టుకు చెందిన ఈ జమైకా ఆల్ రౌండర్ ఐపీఎల్​లో ఇప్పటివరకు 193 సిక్సర్లు బాదాడు.

రాజకీయాల్లో క్రికెటర్ల మార్క్- MP టూ PM వరకు- అక్కడా కూడా ఈ స్టార్లదే హవా!

వీళ్లంతా టాప్​ క్లాస్ క్రికెటర్లు- అయినా ఐపీఎల్​కు నో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.