ETV Bharat / sports

ఒకేసారి నలుగురు స్టార్ ప్లేయర్స్​ సెంచరీ టెస్ట్​ - క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 8:50 AM IST

100 Test Matches Players : క్రికెట్ హిస్టరీలో రేర్ మూమెంట్ వచ్చింది. బహుశ ఇదే తొలిసారి అని కూడా అనొచ్చు. ఎందుకంటే క్రికెట్‌లో ఒక్క రోజు వ్యవధిలో నలుగురు స్టార్‌ క్రికెటర్లు తమ సెంచరీ టెస్ట్ ఆడబోతున్నారు. ఆ వివరాలు.

ఒకేసారి నలుగురు స్టార్ ప్లేయర్స్​ సెంచరీ టెస్ట్​ - క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి!
ఒకేసారి నలుగురు స్టార్ ప్లేయర్స్​ సెంచరీ టెస్ట్​ - క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి!

100 Test Matches Players : టెస్టు క్రికెట్‌ హిస్టరీలో 2024 మార్చి నెల ప్రత్యేకంగా నిలవనుంది. ఎందుకంటే క్రికెట్‌లో ఒక్క రోజు వ్యవధిలో నలుగురు స్టార్‌ క్రికెటర్లు సెంచరీలు కొట్టబోతున్నారు. అదేనండీ సెంచరీ టెస్ట్ ఆడబోతున్నారు. మార్చి 7, 8 తేదీలలో భారత స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు ఇంగ్లాండ్ మిడిలార్డర్‌ బ్యాటర్‌ జానీ బెయిర్‌ స్టో మార్చి 7న ధర్మశాల వేదికగా జరగబోయే ఐదో టెస్టులో వందో టెస్టు ఆడనుండగా - వీరిద్దరితో పాటు న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా మధ్య మార్చి 8 నుంచి జరగనున్న రెండో టెస్టులో కివీస్‌ స్టార్‌ బ్యాటర్ కేన్‌ విలియమ్సన్‌ - దిగ్గజ పేసర్‌ టిమ్‌ సౌథీలు తమ వందో టెస్టు బరిలో దిగనున్నారు.

అయితే ఈ రికార్డుకు సంబంధించిన సరైన సమాచారం లేదు. ఒక రోజు వ్యవధిలో నలుగురు స్టార్‌ క్రికెటర్లు వందో టెస్ట్‌ మ్యాచ్‌ ఆడటం క్రికెట్‌ చరిత్రలో బహుశా ఇదే తొలిసారి. ఇలాంటి సందర్భం రావడం అరుదు కాదు అసాధ్యమనే చెప్పాలి. మరో విషయమేమిటంటే కొద్ది రోజుల క్రితమే ఫిబ్రవరి 15న ఇంగ్లాండ్​కు చెందిన మరో ప్లేయర్​ వందో టెస్ట్‌ మైలురాయిని అందుకున్నాడు. పైగా ఈ మ్యాచ్​లో సెంచరీ కూడా బాదాడు. ఇంగ్లీష్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ టీమ్​ ఇండియాతో జరిగిన మూడో టెస్ట్​లో ఈ సూపర్ మార్క్​ను టచ్​ చేశాడు.

Ravichandran Ashwin 100th Test : ఇకపోతే తాజా విషయంలోకి వస్తే అశ్విన్‌ తన వందో టెస్టు ఆడటం ద్వారా ఈ ఫార్మాట్‌లో ఈ మార్క్​ను టచ్​ చేసిన 14వ భారత ప్లేయర్​గా నిలవనున్నాడు. ఇప్పటివరకు అతడు కెరీర్‌లో 99 టెస్టులు ఆడి 507 వికెట్లు తీశాడు. 3,309 పరుగులను ఖాతాలో వేసుకున్నాడు. ఐదు సెంచరీలు కూడా చేశాడు. ఇంకా ఐదు వికెట్ల ఘనత 35 సార్లు, 8 సార్లు పది వికెట్ల ప్రదర్శన ఉండటం విశేషం. ఇక బెయిర్‌ స్టో విషయానికొస్తే 99 టెస్టులలో 5,974 రన్స్ సాధించాజు. ఇందులో 12 సెంచరీలు కూడా ఉన్నాయి.

న్యూజిలాండ్‌ మాజీ సారథి కేన్‌ విలియమ్సన్‌ 2010లో టీమ్​ఇండియాతో జరిగిన టెస్టు సిరీస్‌తో అరంగేట్రం చేశాడు. తన 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 99 టెస్టులు ఆడిన ఇతడు 174 ఇన్నింగ్స్‌లలో 8,675 రన్స్ చేశాడు. ఇందులో 32 సెంచరీలు ఉండటం విశేషం. 30 వికెట్లు కూడా తీశాడు. ఇక టిమ్‌ సౌథీ 2008లో టెస్టు అరంగేట్రం చేశాడు. 99 టెస్టులలో 378 వికెట్లు తీశాడు. 2072 వికెట్లు కూడా తీశాడు. 6 హాఫ్ సెంచరీలూ ఉన్నాయి. కాగా, న్యూజిలాండ్‌ - ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్​ మార్చి 8 నుంచి క్రిస్ట్‌చర్చ్‌ వేదికగా ప్రారంభం కానుంది. తొలి టెస్టులో కివీస్‌ దారుణ పరాభవం చెందింది. దీంతో ఈ రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను ఎలాగైనా కాపాడుకోవాలని న్యూజిలాండ్‌ గట్టి పట్టుదలతో ఉంది.

  • రవిచంద్రన్​ అశ్విన్‌ - 99 టెస్ట్‌ల్లో 3309 రన్స్​, 5 సెంచరీలు, 507 వికెట్లు
  • జానీ బెయిర్‌స్టో - 99 టెస్ట్‌ల్లో 5974 రన్స్, 12 సెంచరీలు
  • కేన్‌ విలియమ్సన్‌ - 99 టెస్ట్‌ల్లో 8675 రన్స్, 32 సెంచరీలు, 30 వికెట్లు
  • టిమ్‌ సౌథీ - 99 టెస్ట్‌ల్లో 2072 రన్స్, 6 హాఫ్‌ సెంచరీలు, 378 వికెట్లు

కాగా, టెస్టుల్లో ఇప్పటివరకు మొత్తంగా 75 మంది 100 టెస్ట్​ మ్యాచుల మార్క్​ను టచ్ చేశారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​ తరఫున 15 మంది, టీమ్​ ఇండియా తరఫున 13, వెస్టిండీస్‌ 9, సౌతాఫ్రికా 8, శ్రీలంక 6, పాకిస్థాన్ 5, న్యూజిలాండ్‌ 4 - 100 టెస్ట్​ల ఫీట్​ను తాకారు.

100వ టెస్ట్ : అతడు ఉంటే కెప్టెన్‌కు భరోసా - ప్రత్యర్థులకు హెచ్చరిక!

కెరీర్లో మచ్చలేని బౌలర్లు- ఒక్క వైడ్​బాల్ వేయలేదు మరి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.