ETV Bharat / spiritual

మేడారం భక్తులకు గుడ్​న్యూస్​ - అరచేతిలో 'జాతర' సమాచారం! - యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారా?

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 21, 2024, 1:36 PM IST

My Medaram App: వనదేవతల దర్శనానికి మేడారం వెళ్తున్నారా? అయితే మీకో గుడ్​న్యూస్​. మేడారంలో జాతరకు సంబంధించిన సమస్త సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రభుత్వం ఓ యాప్​ను రూపొందించింది. అదే MY Medaram యాప్​. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

My Medaram App
My Medaram App

How to Download My Medaram App: తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నేటినుంచి మొదలుకానుంది. ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు మేడారంలో ఈ జాతర అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ సాయంత్రం గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు చేరుకోనున్నారు. రేపు సమ్మక్క చేరుకుంటుంది. నెలరోజుల ముందు నుంచే వనదేవతలకు భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నాలుగు రోజుల్లో మరింత ఎక్కువమంది అమ్మవార్లను దర్శించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఉపయోగకరంగా ఉండేలా ప్రభుత్వం "మై మేడారం" యాప్ ను రూపొందించింది. ఈ యాప్​కు సంబంధించిన వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

మై మేడారం యాప్​ వివరాలు: "మై మేడారం" యాప్​ బహుళ ప్రయోజనరకంగా ఉంది. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే చాలు ఆఫ్​లైన్​లో కూడా మేడారం సమాచారం మొత్తం మన చేతిలో ఉంటుంది. జాతరకు వచ్చే భక్తులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సగటు భక్తుడి దైనందిన అవసరాల సమాచారాన్ని ఈ యాప్​లో పొందుపరిచారు. అలాగే భాషాపరమైన ఇబ్బందులు తలెత్తకూడదని దీనిని తెలుగుతోపాటు ఇంగ్లీష్‌లోనూ రూపొందించారు. 'మై మేడారం' యాప్‌కు తోడు 'టీఎస్‌ఆర్టీసీ మేడారం జాతర', 'మేడారం పోలీస్‌ 2024' యాప్‌లను సైతం అందుబాటులో ఉంచారు. ఆర్టీసీ, పోలీసు సేవల సమాచారం ఆ యాప్‌లలో సమగ్రంగా ఉంటుంది.

వారెవ్వా!! మేడారం వనదేవతల కథను ఎంతబాగా చెప్పారో - ఈపాటలు వింటే గూస్​బంప్స్ గ్యారంటీ

యాప్​ను ఎలా డౌన్​లోడ్​ చేసుకోవాలి..?

  • గూగుల్​ ప్లేస్టోర్​లోకి వెళ్లి My Medaram యాప్​ను ఇన్​స్టాల్​ చేసుకోవాలి.
  • యాప్​ను ఓపెన్​ చేసిన అనంతరం మేడారం జాతరకు సంబంధించిన పూర్తి సమాచారం అందులో ఉంటుంది.
  • నాలుగు రోజుల పాటు జరిగే జాతర వివరాలు అందులో ఉంటాయి.
  • తర్వాత స్క్రీన్​ను కిందకు స్క్రోల్​ చేస్తే సౌకర్యాలు కనిపిస్తాయి.
  • సౌకర్యాలు సెక్షన్​లో నీరు, ఆరోగ్యం, పార్కింగ్​, టాయిలెట్స్​, స్నాన ఘాట్​లు అనే ఆప్షన్లు ఉంటాయి.
  • ఆరోగ్యం ఆప్షన్​పై క్లిక్ చేస్తే వైద్య సేవలు ఎక్కడెక్కడ ఉన్నాయో అందులో చూపిస్తుంది.
  • పార్కింగ్ ఆప్షన్ లోకి వెళ్తే వాహనాలు నిలుపిపే స్థలం చూపిస్తుంది.
  • టాయిలెట్ల ఆప్షన్ క్లిక్ చేస్తే పరిశుభ్రత పారిశుద్ధ్యం వివరాలు తెలుస్తాయి.
  • ఇక స్నాన ఘట్టాలు ఆప్షన్ లోకి వెళితే స్నానమాచరించే ప్రదేశాలు ఇందులో కనిపిస్తాయి.

అదే విధంగా ఇందులో తప్పిపోయిన వ్యక్తుల వివరాలు అప్లోడ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. అగ్నిమాపక అధికారుల పేర్లు వారి ఫోన్ నెంబర్లు ఇందులో నమోదు చేశారు. అంతేకాకుండా మేడారం జాతరలో వాలంటీర్​గా సేవలందించేందుకు ఈ యాప్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు.

జాతరకు 6 వేల స్పెషల్ బస్సులు..: ఇకపోతే మేడారం జాతర కోసం టీఎస్​ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. మేడారంలో తాత్కాలిక బస్టాండ్‌ను ఏర్పాటు చేశారు. ఇక జాతరకు వెళ్లలేని భక్తుల కోసం TSRTC కార్గో సేవల ద్వారా ప్రసాదాన్ని ఇంటికే డెలివరీ చేస్తున్నారు.

ఆదివాసీ జాతరకు ఘనంగా ఏర్పాట్లు - వన దేవతల చెంత, సౌకర్యాలకు ఈసారి నో చింత

వనమంతా జనమయ్యే వేళాయే - నేటి నుంచి మేడారం మహా జాతర షురూ

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఎలా వెళ్లాలో తెలుసా? - ఇదిగో రూట్ మ్యాప్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.