ETV Bharat / spiritual

ఆ రాశి వారు అందరితో జాగ్రత్తగా మాట్లాడాలి- లేకుంటే వివాదాలు ఖాయం! - Daily Horoscope In Telugu

author img

By ETV Bharat Telugu Team

Published : May 11, 2024, 5:20 AM IST

Horoscope Today May 11th 2024 : మే​ 11న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope
Daily Horoscope (ETV Bharat)

Horoscope Today May 11th 2024 : మే​ 11న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఏదైనా కొత్త పని ప్రారంభించడానికి ఈ రోజు మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్ధికంగా బలపడుతారు. ఉద్యోగులు గట్టి పోటీని ఎదుర్కొంటారు. అయినా మీ ప్రతిభతో ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తారు. సన్నిహితులతో జాగ్రత్తగా మాట్లాడండి. లేకుంటే వివాదాలు రావచ్చు. ప్రయాణ సూచన ఉంది. గణపతి ప్రార్ధన చేస్తే విఘ్నాలు దూరమవుతాయి.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు తారాబలం అనుకూలంగా లేదు. ముఖ్యమైన వ్యవహారాల్లో సమష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. నూతన అవకాశాల కోసం అన్వేషించండి. చేసే పనిలో, తీసుకునే నిర్ణయాలలో స్పష్టత ఉండాలి. స్థిరాస్తి రంగం వారు ముఖ్యమైన దరఖాస్తులపై మీద సంతకాలు గానీ, కొత్త ప్రాజెక్టులు చేపట్టడం చేయకండి. ఉద్యోగులు సహోద్యోగులతో స్నేహితులతో అర్ధవంతమైన చర్చలు చేస్తే మేలు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

మిథునం (Gemini) : మిధున రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉండబోతోంది. అన్ని రంగాల వారికి సర్వత్రా అనుకూలత ఉంటుంది. బంధుమిత్రులతో విందువినోదాల్లో పాల్గొంటారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఖర్చులు ఆదాయాన్ని మించకుండా జాగ్రత్త పడండి. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగస్తులు ఈ రోజు ప్రతిభావంతంగా పనిచేసి ఎన్నో అద్భుతాలు సాధిస్తారు. పై అధికారుల నుంచి ప్రశంసలు, బహుమతులు అందుకుంటారు. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉండదు. అనవసర ఆందోళనలు మానసిక అశాంతికి కారణమవుతాయి. బంధువర్గంతో కలహాలతో విసుగు చెందుతారు. ఆర్ధిక సమస్యలు పెరుగుతాయి. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మేలు. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ముఖ్యమైన పనులు వాయిదా వేయండి. వీలైనంత వరకు చర్చలకు, వాదనలకు దూరంగా ఉండండి. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. శని స్తోత్రం చదువుకుంటే ప్రతికూల ఫలితాల నుంచి బయట పడవచ్చు.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు గ్రహ సంచారం అద్భుతంగా ఉంది. స్నేహితులు స్వచ్ఛందంగా మీకు సహాయం చేయడానికి ముందుకొస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళతారు. సరదాగా సంతోషంగా ఈ రోజంతా గడుపుతారు. సంపద శక్తి ఏమిటో మీరు ఈ రోజు తెలుసుకుంటారు. సమయాన్ని వృథా చేయకండి. ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపారులకు పలు మార్గాల ద్వారా ధనప్రవాహం ఉంటుంది. చెబుతున్నాయి. హనుమాన్ చాలీసా పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం, ఉద్యోగం ఏ రంగంలోని వారికైనా సర్వత్రా విజయమే! వృత్తిపరమైన అభివృద్ధి, పదోన్నతి ద్వారా ఆదాయం వృద్ది చెందుతుంది. ఉద్యోగులు ప్రమోషన్లు పొందుతారు. అన్ని విషయాల్లో తారాబలం చాలా అనుకూలంగా ఉంది. పిత్రార్జితం వారసత్వంగా పొందుతారు. గృహంలో శాంతి, సౌఖ్యం నెలకొంటాయి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. వ్యాపారస్తులు మంచి లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు తమ సహోద్యోగుల సహకారం ఉంటుంది. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో తీర్ధ యాత్రలకు వెళతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. తగిన విశ్రాంతి అవసరం. విదేశాల నుంచి అందిన శుభవార్త మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. ఆదిత్య హృదయం పఠిస్తే మేలు జరుగుతుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు గ్రహ సంచారం అనుకూలంగా లేనందున అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. శాంతియుతంగా ఉండి, ప్రశాంతంగా రోజును మొదలుపెట్టండి. కొత్త ప్రణాళికలు వాయిదా వెయ్యండి. ఆర్థిక సంక్షోభం ఉండవచ్చు కాబట్టి ఖర్చులు వాయిదా వెయ్యండి. నూతన ఆదాయ వనరుల కోసం ప్రయత్నించండి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేస్తే మంచిది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. వ్యాపారులు వ్యాపార వృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బ్యాంకు రుణాలు వంటి ముఖ్యమైన పనులు అనుకూలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. గతంలో వాయిదా పడిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు అదృష్ట దాయకంగా ఉంటుంది. ఈ రోజంతా వినోదంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంఘంలో పేరున్న గొప్ప వ్యక్తులను కలుసుకుంటారు. వృత్తిలో, ఉద్యోగాల్లో సహోద్యోగుల నుంచి మంచి సహకారం అందుతుంది. వ్యాపారులకు వ్యాపారంలో పురోగతి ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు సాధిస్తారు. అనేక రకాలుగా ధనాదాయం ఉంటుంది. శ్రీ దుర్గాదేవి ధ్యానం శుభప్రదం.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారవేత్తలు, వృత్తి నిపుణులు, అందరికీ ఈ రోజు చేసే పనుల్లో పురోగతి ఉంటుంది. ఆకస్మిక ధనాదాయం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు, వృత్తిపరమైన జీవితంలో అంతటా ఆనందమే! ఉద్యోగులకు పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనుకోని ప్రయాణం ఉండవచ్చు. రకరకాల అభిరుచులున్న వ్యక్తులతో కలిసి పని చేయాల్సి రావచ్చు. వీలైనంత వరకు అందరితో కలిసిమెలిసి ఉంటే కార్యజయం ఉంటుంది. ఎదుటివారి బలహీనతను మీ బలంగా మార్చుకోగల మీ ప్రతిభతో ఎదురుచూడని విజయాన్ని సొంతం చేసుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. తగిన విశ్రాంతి అవసరం. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మేలు. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉండవచ్చు. శివాష్టకం పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి నిపుణులు, స్థిరాస్తి రంగం వారు నూతన ప్రాజెక్టులను చేపడతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో స్థిరత్వం లోపిస్తుంది. ఉద్యోగస్తుల తోటి ఉద్యోగుల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు. అయినప్పటికీ మీప్రతిభతో మీదే పై చేయి అవుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్ధిక వ్యహారాల్లో జాగ్రత్త అవసరం. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ఆంజనేయస్వామి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.