ETV Bharat / spiritual

ఆ రాశి వారికి ఈరోజు జలగండం!- జాగ్రత్త!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 9, 2024, 5:04 AM IST

Horoscope Today February 9th 2024 In Telugu
Horoscope Today February 9th 2024 In Telugu

Horoscope Today February 9th 2024 In Telugu :ఫిబ్రవరి 9న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today February 9th 2024 : ఫిబ్రవరి 9న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : ఈ రోజు మీరు చాలా ఆనందంగా ఉంటారు. ముఖ్యమైన చర్చలు ఫలవంతం అవుతాయి. ఇంటి అలంకరణ గురించి ఆలోచన చేస్తారు. మీ అమ్మవారి తరపువారి నుంచి మీకు కలిసివచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం కారణంగా అధిక ఒత్తిడికి లోనవుతారు. మీ పై ఉద్యోగుల నుంచి ప్రశంసలు పొందుతారు. ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహరాల్లో మీరు దూర ప్రయాణం చేయవలసి వస్తుంది. అది కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త.

.

వృషభం (Taurus) : ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలుంటాయి. వ్యాపారులు తమ వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి కొత్త పనులను చేపడతారు. అంతేగాక, వారు భవిష్యత్తు గురించి కూడా ప్రణాళిక చేస్తారు. విదేశాలకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. దైవ దర్శనం చేసుకోవడం ద్వారా మీరు మీ ఆధ్యాత్మికతను పెంపొందించుకుంటారు.

.

మిథునం (Gemini) : నెగిటివ్​ ఆలోచనలు చేయవద్దు. మీరు కొత్త ప్రాజెక్ట్​లను ప్రస్తుతానికి వాయిదా వేయడమే మంచిది. ఈ రోజు మీకు కొంత ప్రతికూలంగా ఉంది. మీ చుట్టాలపై అనవసరంగా కోపం ప్రదర్శించవద్దు. మీ ఖర్చులపై నియంత్రణ పాటించండి. ఒత్తిడి అధిగమించేందుకు యోగా చెయ్యడం మంచిది.

.

కర్కాటకం (Cancer) : ఈ రోజు మీరు చాలా ఆనందంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఈ రోజు మీరు మానసిక ఉల్లాసంగా ఉంటారు. మీరు ఫ్రెండ్స్​, కుటుంబ సభ్యులతో ట్రిఫ్​ వెళ్లేందుకు ఇదే మంచి సమయం. మీరు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని మంచి గుర్తింపు సాధిస్తారు.

.

సింహం (Leo) : ఈరోజు మీరుఅధికంగా ఆందోళన చెందుతారు. అది మిమ్మల్ని కొంత ఇబ్బందికి గురిచేస్తుంది. ఏదో ఒక కారణం వలన, మీరు పనిచేసేక్రమంలో కొన్ని అడ్డంకులు ఎదుర్కోవచ్చు. మీ వృత్తిలో సహోద్యోగుల నుండి సహకారం తగినంత లభించక పోవచ్చు. మీ పై అధికారులతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి.

.

కన్య (Virgo) : ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పిల్లలు, ప్రియమైన వారి గురించి ఆలోచించి మానసికంగా చాలా ఆందోళన చెందుతుంటారు. దానివల్ల మీ అరోగ్యమే పాడవుతుంది అని గుర్తుంచుకోండి. ఖర్చులు పెరుగుతాయి. పనికిరాని ఆలోచనలతో సమయం వృథా చేయకండి. మీ మానసిక ఒత్తిడి దూరం కావడానికి ఇంతకంటే మంచి మందు లేదు. ప్రశాంతంగా ఉండండి.

.

తుల (Libra) : మానసికంగా విపరీతమైన ఒత్తిడి వుంటుంది. ఏదో ఒక విషయంలో ఎక్కువగా ఆలోచిస్తుంటారు. మీరు రోజూ యోగా చేయడం మంచిది. జలాశయాలకు దూరంగా వుండండి. స్విమింగ్ తరగతులకు ఈ రోజు శెలవు పెట్టండి. ఈ రోజు దూర ప్రయాణాలు చేయకండి ఎందుకంటే ఫలితం వుండదు. ఆస్తి, కుటుంబ వారసత్వం మొదలైన వ్యవహారాలపై జాగ్రత్త వహించండి.

.

వృశ్చికం (Scorpio) : ఈరోజు మీకు ఆనందకరంగా ఉంటుంది. మీ సంతోషం మరింత అధికమవుతుంది. ఫలితంగా మీరు అన్ని రకాల శుభకరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ స్నేహితులతో కోల్పోయిన అనుబంధాన్ని పునరుద్ధరించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తారు. ఇది మీకు వస్తు లాభాలను కూడా ఇస్తుంది. మీరు కొత్త వ్యాపారాలను మొదలు పెట్టే సూచనలు కనిపిస్తున్నాాయి.

.

ధనుస్సు (Sagittarius) : మీ రోజు మీమ్మల్ని ఓ సమస్య ఇబ్బంది పెడుతుంది. మిమ్మల్ని అయోమయానికి గురి చేస్తుంది. కనుక ప్రతిపనీ దానంతట అదే జరిగిపోతుందని అనుకోవద్దు. మీరు అంతగా బెంబేలిత్తిపోవాల్సిన అవసరం లేదు. ఏది జరిగితే అదే జరగనివ్వండి. విదేశాలలో ఉన్న మిత్రుల నుంచి సమాచారం అందుకుంటారు. అది మీకు అదృష్టాన్ని, ప్రేరణని ఇచ్చే వార్త అవుతుంది.

.

మకరం (Capricorn) : ఈ రోజు ఆధ్యాత్మిక సంబంధమైన కార్యకలాపాలలో గడుపుతారు. పరపతి పెరుగుతుంది. ప్రమోషన్ లభించే సూచనలున్నాయి. స్నేహితులు, బంధువులతో సంతోషంగా ఉంటారు. గృహంలో శాంతి సౌఖ్యాలు ఉంటాయి. చిన్న ప్రమాదం జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త

.

కుంభం (Aquarius) : ఈరోజు మీరు మానసికంగా, శారీరకంగా బలహీనంగా, బద్దకంగా ఉంటారు. మీ కుటుంబ సభ్యులతో వాదనకు దిగే అవకాశాలున్నాయి. మీరు మీ ఖర్చులను, కోపాన్ని, మాటలను అదుపులో పెట్టుకోవాలి. రాబోతున్న అల్లకల్లోలం గురించి అప్రమత్తంగా ఉండండి.

.

మీనం (Pisces) : ఈ రోజు ఇంటి పనులు, ఆఫీసు పనులతో సతమతమవుతారు. ఇంటి మరమ్మతులు చేయించే పనిలో బిజీగా ఉంటారు. ఆ ఖర్చు చాలా అధికంగా ఉంటుంది. మీరు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం, ప్రశంసలు లభిస్తాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.