ETV Bharat / spiritual

ఆ రాశివారికి ప్రమోషన్​ వచ్చే ఛాన్స్​! చేపట్టిన పనులన్నీ సక్సెస్​!! - Horoscope Today April 13th 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 13, 2024, 5:02 AM IST

Horoscope Today April 13th 2024
Horoscope Today April 13th 2024

Horoscope Today April 13th 2024 : ఏప్రిల్​ 13న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today April 13th 2024 : ఏప్రిల్​ 13న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంది. ఈ రోజు అదృష్టం నేరుగా మీ తలుపు తడుతుంది. ఒక గొప్ప సువర్ణావకాశం మీకోసం ఎదురు చూస్తోంది. అవకాశాలను అందిపుచ్చుకొని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. మీ ప్రయత్నాలకు తగిన ఫలితం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంది. కొన్ని ముఖ్యమైన విషయాల్లో స్థిరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరముంది. పరిస్థితులు మీకు అనుకూలంగా మార్చుకోవడంలో విజయం సాధిస్తారు. గతంలోని కొన్ని చేదు జ్ఞాపకాలకు స్వస్తి పలుకుతారు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. శివారాధనతో మెరుగైన ఫలితాలను సాధించవచ్చు.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా మీ చర్యలు ఉంటాయి కాబట్టి ముఖ్యులతో ఆచి తూచి వ్యవహరించండి. ఇతరులు మీ గురించి చెడుగా మాట్లాడుకునే అవకాశం ఇవ్వొద్దు. సాధ్యమైనంత వరకు ఒంటరిగా ప్రశాంతంగా ఉండండి. ప్రియమైన వారి కోసం డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు. మానసిక ప్రశాంతత కోసం ఆంజనేయస్వామి ఆరాధన చేయండి

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికి మీ కృషి, కఠిన శ్రమ కారణంగా చక్కని ఫలితాలు పొందుతారు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. ఆదాయం సంతృప్తిగా ఉంటుంది. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. శనిస్తోత్రం పఠిస్తే సమస్యలు తొలగుతాయి

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండడం అవసరం. పనిభారం వలన తీవ్ర ఒత్తిడి ఉంటుంది. పనులు సకాలంలో పూర్తికాక రోజంతా చికాకుగా ఉంటుంది. కుటుంబసభ్యులతో వాదనలు, ఘర్షణలు జరుగుతాయి. మౌనం వహిస్తే మేలు. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సందర్శన చేస్తే మేలు.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు అదృష్ట యోగం ఉంది. స్నేహితులు, బంధువులు ద్వారా లాభం పొందుతారు. బంధాలు ధృఢపడతాయి. కొన్ని విషయాలు ఆందోళన కలిగించవచ్చు. అయితే దైవబలం మిమ్మల్ని రక్షిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్ధిక లాభం ఉంది. మరిన్ని శుభ ఫలితాల కోసం శివారాధన చేయండి.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు శుభప్రదమైన రోజు. ఈ రోజు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. కోర్టు బయట పరిష్కారం కారణంగా న్యాయపరమైన వివాదాలకు త్వరగా ముగింపు లభించవచ్చు. ఆరోగ్యం బాగుటుంది. ఆర్ధిక ప్రయోజనాలు పొందుతారు. సొంత నిర్ణయాలు సాహసోపేతంగా తీసుకుంటారు. లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం మేలు చేస్తుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఈ రోజంతా మీరు తీరిక లేకుండా ఉంటారు. విపరీతంగా పని చేసి అలసటకు గురవుతారు. అయితే ఈ పనిలోనే మీకు సంతోషం ఉంది. ఇంకా పూర్తి కాని పనులను గురించి ఆలోచించి ఒత్తిడికి గురవుతారు. మీ ప్రతిపాదనలకు అందరి ఆమోదం లభిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆదాయం పెరగడం సంతృప్తిని ఇస్తుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఇన్ని రోజులు మీ మనసులో దాచుకున్న విషయాలు వెల్లడయ్యే సమయం వచ్చింది. మీ జీవిత భాగస్వామితో అనుబంధం ధృడపడుతుంది. ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి. నూతన వస్త్ర లాభం. విందు వినోదాలలో పాల్గొంటారు. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఖర్చులు పెరుగుతాయి. ఖర్చులు తగ్గించుకోవాలన్న మీ ధోరణి కారణంగా సమాజంలో మీ ప్రతిష్ఠకు భంగం కలగవచ్చు. మీ నుంచి ప్రయోజనం ఆశిస్తున్న వారిని సంతృప్తి పరచలేక పోతారు. అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి. మెరుగైన ఫలితాల కోసం హనుమాన్ చాలీసా పఠించండి

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. వ్యాపారులకు, వృత్తినిపుణులకు లాభదాయకమైన రోజు. ఉద్యోగస్థులు పదోన్నతి పొందే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చేపట్టిన పనులు మంచి ఫలితాలు ఇస్తాయి. పై అధికారుల ప్రశంసలు పొందుతారు. విందువినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. దుర్గా ధ్యానం శుభఫలితాలను ఇస్తుంది

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. పని ఒత్తిడితో అలసటకు గురవుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. విందు వినోదాలతో కాలక్షేపం చేస్తారు. రచన, వ్యాసాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆదాయం బాగుటుంది. ఆంజనేయ దండకం చదివితే సత్ఫలితాలు ఉంటాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.