ETV Bharat / politics

నిజామాబాద్, జహీరాబాద్‌ ఎంపీ స్థానాల్లో బీసీ మంత్రం - ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీల వ్యూహం

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 17, 2024, 12:30 PM IST

Lok Sabha BC MP Candidate In Nizamabad : నిజామాబాద్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ స్థానాల్లో మూడు ప్రధాన పార్టీలు బీసీ మంత్రం జపిస్తున్నాయి. జహీరాబాద్ స్థానానికి బీజేపీ , కాంగ్రెస్, బీఆర్ఎస్ బీసీ అభ్యర్థిని బరిలో దించితే నిజామాబాద్‌లోనూ బీజేపీ, బీఆర్ఎస్​లు బీసీ వ్యక్తులకే టికెట్లు ఇచ్చాయి. కాంగ్రెస్ సైతం అదే వర్గానికి చెందిన అభ్యర్థిని పోటీలో నిలపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Nizamabad Lok Sabha Candidates
Lok Sabha BC MP Candidates In Nizamabad

నిజామాబాద్, జహీరాబాద్‌ ఎంపీ స్థానాల్లో బీసీ మంత్రం - ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు పార్టీల వ్యూహాలు

Lok Sabha BC MP Candidate In Nizamabad : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయం కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్​ఎస్ అనుసరిస్తున్న వ్యూహప్రతివ్యూహాలతో ఆసక్తికరంగా మారుతోంది. కొన్నిజిల్లాలో బీసీల ఓట్లు ఎక్కువగా ఉండటంతో వాళ్లను తమవైపుకు తిప్పుకోవడానికి బీసీ అభ్యర్థులను ఎన్నికల బరిలో దింపుతున్నారు. నిజామాబాద్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో దాదాపు 55 నుంచి 60 శాతం బీసీల ఓట్లు ఉంటాయి.

ఆయా వర్గాల ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవటానికి రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే జహీరాబాద్ లోక్‌సభ పరిధిలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్​లు ఒకే సామాజిక వర్గానికి చెందిన బీబీ పాటిల్‌, సురేష్‌ షెట్కార్​లను బరిలోకి దింపాయి. ఈ వర్గం ఓట్లు నారాయణ్‌ఖేడ్‌లో అత్యధికంగా, జహీరాబాద్, జుక్కల్ కలిపి లక్షకు పైగా ఉన్నట్లు లెక్కలేస్తున్నాయి.

తెలంగాణలో 17 ఎంపీ, 1 ఎమ్మెల్యే స్థానానికి మోగిన ఎన్నికల నగారా - పోలింగ్‌ ఎప్పుడంటే?

Nizamabad MP Candidate 2024 : బీసీ సామాజికవర్గం ఉప కులాల్లో బలమైన ఓటు బ్యాంకు ఉన్న గాలి అనిల్‌ కుమార్‌ను బీఆర్ఎస్ రంగంలోకి దింపింది. ఈ సామాజిక వర్గం ఓట్లు ఎల్లారెడ్డి, బాన్సువాడ, కామారెడ్డిలో కలిపి లక్ష దాటనుందని అంచనా వేస్తోంది. బీబీ పాటిల్‌ వరుసగా రెండు సార్లు బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచారు. ఇటీవల బీజేపీలో చేరి టికెట్‌ దక్కించుకున్నారు. సురేష్‌ షెట్కార్‌ ఈ ప్రాంతంలో సీనియర్‌ నాయకుడిగా గతంలో ఇక్కడి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నుంచి వచ్చిన గాలి అనిల్‌ను బీఆర్ఎస్ బరిలో నిలిపింది.

నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో త్రిముఖ పోటీ : నిజామాబాద్ బీజేపీ సిట్టింగ్‌ స్థానం కావడంతో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. జహీరాబాద్ మాదిరిగా ఇక్కడ కూడా బీజేపీకి పోటీగా బీఆర్ఎస్ అదే సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దించింది. బీజేపీ నుంచి సిట్టింగ్‌ ఎంపీ అయిన ధర్మపురి అర్వింద్‌కు పోటీగా అదే వర్గానికి చెందిన బాజిరెడ్డి గోవర్ధన్​ను పోటీలో దింపారు. ఇద్దరు బీసీ అభ్యర్థులు కావడంతో కాంగ్రెస్‌ సైతం బీసీని ప్రకటించక తప్పని పరిస్థితి ఎదురైంది. అందుకే కచ్చితంగా మొదటి జాబితాలో పేరు ఖాయమనుకున్న ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి పేరు ప్రకటన చివరి నిమిషంలో నిలిపేశారు. దీంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు టికెట్‌ దక్కుతుందని ప్రచారం సాగుతోంది.

బీఆర్​ఎస్​, కాంగ్రెస్‌ మధ్య తెలంగాణ నలిగిపోయింది : ప్రధాని మోదీ

బీఎస్పీకి రాజీనామా చేసిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్ - భవిష్యత్తులో బీఆర్​ఎస్​తో కలిసి నడుస్తానని వెల్లడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.