Does Workout Equals To Standing : ఆహారపు అలవాట్లతో పాటు ఎక్కువ సేపు కూర్చుని ఉండటం వల్ల శరీరంలోని అంతర్గత అవయవాల చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. అయితే, వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడి శక్తి పెరగుతుంది. అలాగే కొవ్వు తగ్గుతుంది. కానీ ప్రతి రోజూ వ్యాయామం చేయడం అందరికీ కుదరక పోవచ్చు. రోజూ కొంత సమయాన్ని వర్కవుట్ కోసం కేటాయించి క్రమం తప్పకుండా చేసే వారు కూడా కొన్ని సార్లు సమయం లేకనో వీలు కాకనే స్కిప్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు వర్కవుట్కు బదులుగా మీరు రోజంతా నిలబడి ఉంటే సరిపోతుందట. నమ్మలేకపోతున్నారా! మీరు రోజంగా నిలబడి ఉండటం, మీరు చేసే వ్యాయామంతో సమానమైన ఫలితాలను కలిగిస్తుందట.
ఎక్కువ సేపు నిలబడి ఉండటం శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా పోరాడటంలో సహాయపడుతుందట. ప్రముఖ వైద్యులు ఫ్రాన్సిస్కో లోపెజ్-జిమెనెజ్, 1000 మందికి పైగా ఎంచుకుని వారిపై అధ్యయనం చేశారట. దీని ప్రకారం నిలబడి ఉండటం వల్ల కేలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయట. ఒక వ్యక్తి నిమిషం పాటు నిలబడి ఉండటం వల్ల 0.15 కేలరీలను బర్న్ చేయగలుగుతాడు. దీంతో పాటు ఎక్కువ సేపు నిలబడి ఉండటం వల్ల కలిగే లాభాలేంటంటే:
రోజంతా కూర్చుని ఉండటం వల్ల అధిక బరువు పెగరడం సహా ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయని మనందరికీ తెలుసు. కాబట్టి వీలైనంత వరకు నిలబడి ఉండటం, లేదా అటు ఇటు తిరుగుతూ ఉండటం వల్ల కేలరీలను ఎల్లప్పుడూ ఖర్చు చేసినట్టు అవుతుంది. ఇది ఆరోగ్యకరమైన జీవక్రియకు సహాయపడుతుంది. నిలబడి ఉండటం వల్ల కేవలం బరువు తగ్గడమే కాకుండా శరీర భంగిమ ఆకర్షణీయంగా మారుతుంది. కండరాల స్థిరత్వం పెరిగి వెన్నెముక, నడుము, తొడలు వంటి ప్రాంతాల చుట్టూ కొవ్వు కరిగిపోవడమే కాకుండా బలంగా మారతాయి. మెడనొప్పిని తగ్గించడానికి, వెన్నెముక నొప్పిని నయం చేయడానికి నిలబడి ఉండటం బాగా సహాపడుతుంది. నిలబడి ఉన్నప్పడు వెన్నెముకపై ఒత్తిడి పడి శక్తిమంతంగా తయారవుతుంది. రక్త ప్రసరణ పెరగడమే కాకుండా కండరాల సంకోచానికి దోహదపడుతుంది. గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.
మొత్తం మీద కూర్చుని పని చేయడం లేదా అటు ఇటు తిరగడం వంటి వాటితో పోలిస్తే నిలబడి ఉండటం వల్ల శరీరం ఎక్కువ కేలరీలను ఖర్చు చేస్తుంది. నిలబడి ఉండేందుకు కండరాలు ఎక్కువ శక్తిని వినియోగించాల్సి ఉంటుంది. ఈ సమయంలో శరీరం రక్త ప్రసరణ మెరుగ్గా జరగడం సహా మానసికంగా, శారీరకంగా శక్తి, ఓర్పు పెరుగుతాయి. గుండె స్పందన పెరిగి హృదయనాళ వ్యవస్థకు ఇది సవాలుగా నిలుస్తుంది. వ్యాయామంతో సమానమైన ఇతర ఫలితాలన్నీ ఎక్కువ సేపు నిలబడి ఉండటం వల్ల కలుగుతాయి.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.