ETV Bharat / politics

'14 ఎంపీ సీట్లే లక్ష్యంగా గెలిచి తీరాలి' - నేతలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం - Congress Focus on MP Elections

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 22, 2024, 10:10 PM IST

Congress Focus on MP Elections in Telangana : గత ఎంపీ ఎన్నికల్లో మల్కాజిగిరిలో అనుసరించిన వ్యూహాన్ని ఈ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గాల్లో అనుసరించాలని సీఎం రేవంత్​ కాంగ్రెస్​ నేతలను ఆదేశించారు. పార్లమెంట్ స్థాయి, అసెంబ్లీ, బూత్ స్థాయిల్లో మూడంచెలుగా పార్టీ సమన్వయ కమిటీలు కీలకమని, వాటిని అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

Congress Focus on MP Elections in Telangana
'రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లే లక్ష్యంగా గెలిచి తీరాలి' - ​ఎన్నికల వ్యూహంపై నేతలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం

Congress Focus on MP Elections in Telangana : గత పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజిగిరిలో అనుసరించిన వ్యూహాన్ని ఈ లోక్​సభ ఎన్నికల్లో అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో అనుసరించాలని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) నాయకులను ఆదేశించారు. అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మూడంచెలుగా సమన్వయ కమిటీలు, బూత్ కమిటీలు అయిదుగురు కీలకమని వెల్లడించారు. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లను గెలిచి తీరాలని, కాంగ్రెస్ పార్టీ లక్ష్యం పెట్టుకుందని, లోక్​సభ ఎన్నికలపై​ ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

CM Revanth Focus on MP Elections 2024 : ఎన్నికలయ్యేంత వరకు ముఖ్య నేతలందరూ కలిసికట్టుగా బాధ్యతలను పంచుకోవాలని సీఎం రేవంత్​ రెడ్డి స్పష్టం చేశారు. నాయకులు అందరూ కార్యకర్తలకు వెన్నంటి ఉండాలన్న ఆయన ఇప్పటికే దిశా నిర్దేశం చేశారు. అందులో భాగంగా ఒకటి రెండు రోజుల్లోనే అన్ని నియోజకవర్గాల్లోనే సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పార్లమెంట్ స్థాయి, అసెంబ్లీ, బూత్ స్థాయిల్లో మూడంచెలుగా పార్టీ సమన్వయ కమిటీలను నియమించాలన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కమిటీలో ఏఐసీసీ(AICC) పరిశీలకులతో పాటు అక్కడి పార్టీ ముఖ్యులు సభ్యులుగా ఉంటారని చెప్పారు.

ఈ ఎన్నికలకు వీరే సైనికులు : ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నందున, నియోజకవర్గ స్థాయి కమిటీలో ఎమ్మెల్యే లేదా పార్టీ నియోజకవర్గ ఇన్​ఛార్జీ, ప్రతి మండలం నుంచి ముఖ్య నేతలు ఉంటారని సీఎం రేవంత్​ వివరించారు. బూత్ స్థాయి కమిటీల్లో ఆ పరిధిలోని చురుకైన పార్టీ సభ్యులు అయిదుగురికి అవకాశం కల్పిస్తారని, వారు ఈసారి ఎన్నికల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. ఈ ఎన్నికలకు వీరే సైనికులుగా నిలబడుతారని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. పార్టీ అభ్యర్థికి ఆ బూత్‌లో వచ్చిన ఓట్ల సంఖ్య బూత్​ కమిటీ సభ్యుల పని తీరుకు ప్రాతిపదికగా నిలుస్తుందన్నారు.

CM Revanth about Indiramma Committee : బూత్ కమిటీల్లో ఉన్న సభ్యులకు భవిష్యత్తులో తగిన గుర్తింపునిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యనేతలతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. పనితీరు ఆధారంగా త్వరలో నియమించే ఇందిరమ్మ కమిటీల్లో వారికే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. గ్రామ స్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు, అర్హులైన లబ్ధిదారుల ఎంపికను పర్యవేక్షించే బాధ్యతలను నిర్వహించేందుకు ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తామని ఇప్పటికే సీఎం ప్రకటించారు.

మరో 2 లోక్​సభ స్థానాలకు బీఆర్​ఎస్​ అభ్యర్థుల ప్రకటన​ - మెదక్ బరిలో మాజీ ఐఏఎస్ - BRS Lok Sabha Candidates 2024

ఎమ్మెల్యే దానం నాగేందర్​కు హైకోర్టు నోటీసులు - HC Issued Notices To MLA Danam

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.