ETV Bharat / politics

కేటీఆర్​ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే బీఆర్​ఎస్​కు మూడు సీట్లు కూడా రాకపోయేవి : బండ్ల గణేశ్​

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 27, 2024, 3:49 PM IST

Updated : Feb 27, 2024, 5:17 PM IST

Bandla Ganesh Comments on KTR
కేటీఆర్​ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే బీఆర్​ఎస్​కు మూడు సీట్లు కూడా రాకపోయేవి : బండ్ల గణేశ్​

Bandla Ganesh Comments on KTR : బీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ విమర్శనాస్త్రాలు సంధించారు. కేటీఆర్​ తన తండ్రి పేరు అడ్డుపెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చారే తప్ప అయనకు ఎలాంటి గుర్తింపులేదని విమర్శించారు. కేటీఆర్ చుట్టూ వైఫై లాగా ఇగో ఉంటుందని అన్నారు.

Bandla Ganesh Comments on KTR : కేటీఆర్‌ తన తండ్రి పేరు అడ్డుపెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చారే తప్ప అయనకు ఎలాంటి గుర్తింపులేదని కాంగ్రెస్​ నేత బండ్ల గణేశ్​ విమర్శించారు. రేవంత్ రెడ్డి పోరాట యోధుడని, బీఆర్​ఎస్​(BRS) పెట్టిన చిత్రహింసలు మానసిక క్షోభనధిగమించి ఆయన ముఖ్యమంత్రి అయ్యారని కితాబిచ్చారు. రేవంత్ రెడ్డి సీఎం కావడంతో కేటీఆర్ బాధపడుతున్నారని, ఆయన రాజకీయపరంగా డిజాస్టర్‌ అన్నారు. కేటీఆర్‌ను సీఎంగా ప్రకటిస్తే ఆ పార్టీకి మూడు సీట్లు కూడా రాకపోయేవని ఎద్దేవా చేశారు.

బీఆర్​ఎస్​ నేతలు వందల యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి సీఎం రేవంత్​ను(CM Revanth) తిట్టిస్తున్నారని బండ్ల గణేశ్​ ఆరోపించారు. కేటీఆర్​ కాల్ చేస్తే బీఆర్​ఎస్​ పార్టీ అభ్యర్థులు సైతం పారిపోతున్నారని విమర్శించారు. కాంగ్రెస్​ ఆరు గ్యారెంటీలతో పాటు స్వేచ్ఛ అనే 7వ గ్యారెంటీ కూడా ఇచ్చిందని చెప్పారు. బీఆర్​ఎస్​ హయాంలో ముఖ్యమంత్రికి చెప్పు చూపిస్తే ఎన్​కౌంటర్ చేయించే వాళ్లని, రాళ్లతో కొట్టి చంపించే వాళ్లని అన్నారు. అమెరికాలో ఇల్లు కొనుక్కోవడానికి కేటీఆర్ అమెరికా వెళ్లారని, ఆయన హయాంలో పని చేసిన ఆఫీసర్ల దగ్గర కోట్లాది రూపాయల నల్లధనం ఉందని ఆరోపించారు.

Bandla Ganesh Comments on Roja : ఈ క్రమంలో సీఎం రేవంత్​రెడ్డిపై ఏపీ మంత్రి రోజా చేసిన విమర్శలను తిప్పికొడుతూ, ఆమె డైమండ్​ రాణి అని బండ్ల గణేశ్​ వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్​ ఫైటర్ అని, ఆయన యాక్సిడెంటల్​గా ముఖ్యమంత్రి కాలేదని, ఏపీ సీఎం జగన్(CM Jagan)​ అయ్యారని అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ దగ్గరకు వెళ్లి బీఆర్​ఎస్​ నాయకుల ఏం చేస్తారని ప్రశ్నించారు. మేడిగడ్డ ఎలా నాశనం చేశారో చూసి వస్తారా అని ఎద్దేవా చేశారు. ఆ ప్రాజెక్టు కూలిపోతే తమదే బాధ్యత అని బీఆర్​ఎస్​ చెప్పాలని డిమాండ్​ చేశారు. దెబ్బతిన్న మూడు పిల్లర్లు ముప్పై పిల్లర్లు కాకుండా ప్రభుత్వం కాపాడుతోందని అన్నారు. ​

'కేటీఆర్​ మీరు రాజకీయంగా డిజాస్టర్​ అయ్యారు. మొన్న అసెంబ్లీలో కూడా మీరు సైలెంట్​గా కూర్చుంటే హరీశ్​రావు మాట్లాడారు. మా వాళ్లు సమాధానాలు చెప్పారు. మీరు అమెరికాలో ఇల్లు కొనుకోవడానికి వెళ్లి వచ్చారు. మంచిగా సెటిల్​ అవ్వండి. మీరు చేసిన తప్పులన్నింటికీ జవాబులు చెప్పాలి. ఒకవేళ తప్పులు చేస్తే చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. మీ హయాంలో పని చేసిన అధికారులే తప్పులన్నింటికీ మీ పేరు చెబుతున్నారు.'- బండ్ల గణేష్, కాంగ్రెస్ నేత

కేటీఆర్​ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే బీఆర్​ఎస్​కు మూడు సీట్లు కూడా రాకపోయేవి : బండ్ల గణేశ్​

పొన్నం ప్రభాకర్​పై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు - ప్రజాహిత యాత్రలో టెన్షన్, టెన్షన్

కాళేశ్వరంపై సీఎం కుట్ర చేస్తున్నారు - మార్చి 1 నుంచి బీఆర్ఎస్ చలో మేడిగడ్డ : కేటీఆర్

Last Updated :Feb 27, 2024, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.