Minister Ponnam Prabhakar Counter To Bandi Sanjay : అయోధ్య రాముడిపై బీజేపీ ఎంపీ బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయోధ్య రాముడి విషయంపై కాంగ్రెస్ నేతలపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని బండి స్పష్టం చేయగా, దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా స్పందిస్తూ బీజేపీ ఎంపీపై విరుచుకుపడ్డారు. బండి సంజయ్ రాజకీయ డ్రామాకు తెర లేపారని మండిపడ్డారు.
5 సంవత్సరాల పదవి కాలంలో బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు ఏం చేశారని తాను ప్రశ్నించానని, శ్రీరాముని పేరు మీద ఓట్ల అడగటం కాదు, నిజంగా నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా డ్రామాలు చేస్తూ యాత్రను కొనసాగిస్తున్నాడని విమర్శించారు. అతని యాత్రకు ప్రచారం రావాలని అడ్డుకున్నట్టు కొత్త డ్రామాలకు తెరలేపారని ఆరోపించారు. యాత్రలు అడ్డుకోవడం లేదని, ప్రజాస్వామ్యంలో యాత్ర చేసే హక్కు అందరికీ ఉందని తెలిపారు.
కరీంనగర్ పరిధిలో ఏం అభివృద్ధి చేశారో బండి సంజయ్ చెప్పాలి : పొన్నం ప్రభాకర్
"రాముడి పుట్టుక, అక్షింతల గురించి మాట్లాడి, నా తల్లి జన్మకు సంబంధించిన మాటలు బండి మాట్లాడుతున్నారు. రాముడి జన్మంపై నేను ఎన్నడూ మాట్లాడలేదు. నేను అనని మాటను నేను అన్నానంటూ తల్లి జన్మపై మాట్లాడటం దుర్మార్గం. తల్లి ఎవరికైనా తల్లే. అలాంటి మాటలు తప్పు. బండి మాటలను మీరు సమర్థిస్తున్నారా అని నేను బీజేపీ అధ్యక్షుడిని అడుగుతున్నా. నేను అడిగిన ప్రశ్న అభివృద్ధికి సంబంధించినదైతే, అతడు మాట్లాడిన మాట నా తల్లి జన్మ గురించి. రాజకీయంగా డ్రామాలు చేస్తూ యాత్రను కొనసాగిస్తున్నాడు. " -పొన్నం ప్రభాకర్, మంత్రి
Minister Ponnam Prabhakar Counter : తాము బీజేపీ యాత్రలు అడ్డుకోవడం లేదని, ప్రజా స్వామ్యంలో యాత్ర చేసే హక్కు ఉందన్నారు. తన తల్లి జన్మ గురించి మాట్లాడుతున్న అతని పట్ల ఒకసారి ఆలోచన చేయాలని పొన్నం ప్రజలకు తెలిపారు. బండి సంజయ్ తనపై చేసిన ఆరోపణలను బీజేపీ కేంద్ర నాయకత్వం ఆలోచించాలని అన్నారు. గతంలో తాను ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేశానో ప్రజలు గమనించాలని అన్నారు. మీరు నియోజకవర్గంలో ఏం చేయలేదని ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని భయంతో కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారన్నారు.
ఈ క్రమంలోనే గతంలో కేసీఆర్ అన్న మాటలనూ సంజయ్ ఇలాగే వక్రీకరించి రాజకీయంగా వాడుకున్నారని, ఇప్పుడు అమ్మ గురించి సంజయ్ మాట్లాడిన మాటలతో ఆయన రాజకీయ జీవితం అంతరించిపోతుందని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రాబోయే ఎన్నిక్లలో బుద్ది చెబుతారని అన్నారు.
వీఐపీల వద్ద పనిచేసే డ్రైవర్లకు ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహిస్తాం : మంత్రి పొన్నం
మేడారం లాంటి పెద్ద జాతరకు 'ఉచిత ప్రయాణం' సాహసోపేత నిర్ణయం : మంత్రి పొన్నం