మేడారం లాంటి పెద్ద జాతరకు 'ఉచిత ప్రయాణం' సాహసోపేత నిర్ణయం : మంత్రి పొన్నం

By ETV Bharat Telangana Team

Published : Feb 23, 2024, 1:19 PM IST

thumbnail

Minister Ponnam Visited Husnabad Bus Stand : మేడారం లాంటి పెద్ద జాతరకు కూడా మహిళలకు ఉచిత ప్రయాణం అందించడమనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్​ను పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రోజువారి ప్రయాణికులతో పాటు, మేడారం వెళ్తున్న ప్రయాణికులతో కాసేపు మాట్లాడారు. 

ప్రయాణికులు, ఆర్టీసీ ఉద్యోగులతో మాట్లాడి సంస్థ నుంచి అందుతున్న సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. మేడారానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు దాతలు అందిస్తున్న అల్పాహారాన్ని పంపిణీ చేశారు. అక్కడే ఉన్న ఆటో డ్రైవర్లతో మాట్లాడి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వారి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. మాజీ మంత్రి హరీశ్​రావు ఆటో డ్రైవర్లకు నెలకు రూ.15 వేలు ఇవ్వాలని అర్థంపర్థం లేని డిమాండ్ చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలోనే వాహనాల ఇంజిన్లపై ట్యాక్స్​ను రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచారని మంత్రి ఎదుట ఆటో డ్రైవర్లు వాపోయారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.