ETV Bharat / politics

జగన్‌ కోసం దేనికైనా 'సిద్ధం' - కుట్రల అమల్లో వెనక్కి తగ్గని సీఎస్‌ జవహర్‌రెడ్డి - CS Jawahar Reddy Support To Jagan

author img

By ETV Bharat Telangana Team

Published : May 7, 2024, 11:10 AM IST

Updated : May 7, 2024, 12:25 PM IST

CS Jawahar Reddy Support To Jagan : ''నువ్వు ఇంతకంటే దిగజారవనుకునే ప్రతిసారీ నా నమ్మకం తప్పని నిరూపిస్తున్నావు'' అంటూ జెర్సీ సినిమాలో ఓ డైలాగ్‌ ఉంటుంది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డికి అది అతికినట్టుగా సరిపోతుంది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా అధికార వైఎస్సార్సీపీపై మితిమీరిన స్వామిభక్తిని ప్రదర్శిస్తున్న ఆయన తన ప్రతి నిర్ణయాన్ని, ప్రతి అడుగునూ ఆ పార్టీకి ఎన్నికల్లో లబ్ధి కలిగించటమే లక్ష్యంగా వేయడంలో ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. ఎన్నికల సమయంలోనైనా తటస్థంగా, నిష్పాక్షికంగా వ్యవహరిస్తారేమోననుకుంటే ‘‘లేదు లేదు అధికార పార్టీతో అంటకాగుతూ ఇంకా అథఃపాతాళానికి దిగజారుతూనే ఉంటా'' అని తన చేతల ద్వారా పదే పదే నిరూపించుకుంటున్నారు.

AP Elections 2024
CS Jawahar Reddy Support To Jagan (ETV Bharat)

జగన్‌ కోసం దేనికైనా 'సిద్ధం' - కుట్రల అమలులో వెనక్కి తగ్గని సీఎస్‌ జవహర్‌రెడ్డి (ETV Bharat)

CS Jawahar Reddy Support To Jagan : ఏపీలోని అధికార వైఎస్సార్సీపీకి కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలతో ఇప్పటికే కొంత మంది అధికారులపై ఈసీ బదిలీ వేటు వేసింది. అయినా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి మాత్రం తన పంథా మార్చుకోవడం లేదు. జగన్‌ ప్రభుత్వానికి మేలు చేసేందుకు ఉవ్విళ్లూరుతూనే ఉన్నారు. ఇంటి వద్దకే పింఛన్లు అందించే అవకాశమున్నా వృద్ధుల్ని మండుటెండల్లో గ్రామ, వార్డు సచివాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరిగేలా చేసి సీఎస్ జవహర్‌రెడ్డి వారిని ముప్పుతిప్పలు పెట్టారు.

ఆ నెపం విపక్షాలపై నెట్టేందుకు జగన్‌ మోహన్ రెడ్డి పన్నిన దుష్టపన్నాగంలో అన్నీ తానై వ్యవహరించారు. ఇలా జగన్‌ కుట్రలను యథేచ్ఛగా అమలుచేస్తున్న ఆయన తాజాగా రైతులకు పెట్టుబడి రాయితీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపుల వ్యవహారంలో మరో కుతంత్రానికి తెరలేపారు. ఈ దురుద్దేశాన్ని గుర్తించే ఎన్నికల సంఘం వాటి విడుదలకు అనుమతి నిరాకరించి అడ్డుకట్ట వేసింది.

అవినాష్‌ రెడ్డి మాదిరి గొడ్డలి రాజకీయాలు నాకు తెలియదు: షర్మిల - YS Sharmila fires on jagan

AP CS Jawahar Reddy : 2023 ఖరీఫ్‌ సీజన్​లో కరవు వల్ల పంటలు దెబ్బతిని అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. ఆ పెట్టుబడి రాయితీని బాధిత రైతులకు వెంటనే చెల్లించలేదు. 847 కోట్ల రూపాయల పెట్టుబడి రాయితీ చెల్లింపు కోసం మార్చి 6న, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ 610 కోట్ల కోసం మార్చి 1న బటన్‌ నొక్కారు. సాధారణంగా ఆ వెంటనే మొత్తం సొమ్ము రైతులు, విద్యార్థుల ఖాతాల్లో జమకావాలి. మహా అయితే ఓ వారం పట్టొచ్చు. కానీ ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే అవకాశముందని తెలిసినా అప్పట్లో వారి ఖాతాల్లో సొమ్ములు జమచేయకుండా దురుద్దేశపూర్వక జాప్యం చేశారు. తీరా మార్చి 16న ఎన్నికల షెడ్యూలు విడుదలైపోయింది. కొన్ని రోజుల తర్వాత తీరిగ్గా ఆ సొమ్ము విడుదలకు అనుమతివ్వాలంటూ స్క్రీనింగ్‌ కమిటీ ముందు ప్రతిపాదనలు పెట్టారు.

దానికి అధ్యక్షుడిగా ఉన్న సీఎస్‌ జవహర్‌రెడ్డి ఆఘమేఘాలపై స్పందించి నిధుల విడుదలకు అనుమతివ్వాలంటూ ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపించారు. పోలింగ్‌కు కొద్దిరోజుల ముందు ఆ సొమ్ము రైతులు, విద్యార్థుల ఖాతాల్లో జమచేసి ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అనుచిత ప్రయోజనం కలిగించాలనే కుతంత్రం దీని వెనక ఉంది. ఒకవేళ ఎన్నికల సంఘం స్క్రీనింగ్‌ కమిటీ ప్రతిపాదనలను తిరస్కరించి, నిధులు విడుదలకు అనుమతించకపోతే విపక్షాలు అడ్డుకోవటం వల్లే పెట్టుబడి రాయితీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపులు చేయలేకపోయామంటూ విషప్రచారం చేయాలనే దురుద్దేశంతో ఇలా వ్యవహరించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపుల వ్యవహారం : ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో తమకు కావాల్సిన కాంట్రాక్టర్లకు దాదాపు 13వేల కోట్ల మేర బిల్లులు చెల్లించి దోచిపెట్టారు. అప్పుడు జగన్‌కు, జవహర్‌రెడ్డికి రైతులకు చెల్లించాల్సిన పెట్టుబడి రాయితీ, విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ గుర్తుకురాలేదా? వేలకోట్ల రూపాయల నిధులు అందుబాటులో ఉన్నా అప్పుడు ఎందుకు చెల్లించలేదు? వారం, పది రోజుల్లో సొమ్ము జమచేస్తామని చెప్పి ఎందుకు జాప్యం చేశారు?

అప్పుడు కుట్రపూరితంగా తాత్సారం చేసి ఇప్పుడు ఎన్నికల సంఘానికి నిధుల విడుదల కోసం నివేదించటం ఏంటి? వారు అనుమతిస్తే పోలింగ్‌కు కొద్దిరోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమయ్యేలా చేసి తద్వారా ప్రభుత్వ నిధులతో ఓట్లు కొనాలనే కుట్ర కాదా ఇది? ఎవరి మెప్పు కోసం, ఎవరి కళ్లలో ఆనందం కోసం, ఎవరికి అనుచిత ప్రయోజనాలు కోసం జవహర్‌రెడ్డి ఇదంతా చేశారనేది ప్రశ్నించుకుంటే జగన్, వైఎస్సార్సీపీ కోసమే ఆయన ఈ కుట్రను అమలు చేశారనేది తేటతెల్లమవుతుంది. ఎలక్షన్ కమిషన్ ఈ కుట్రను పసిగట్టే వాటి విడుదలకు అనుమతి నిరాకరించింది.

జగన్ నిరాశావాదం - ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం సన్నగిల్లుతుందన్న ఏపీ సీఎం - JAGAN IN COMPLETE PANIC MODE

జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా ప్రమాదకరం - నేనూ బాధితుడినే : విశ్రాంత ఐఏఎస్ అధికారి - EX IAS on Land Titling Act

Last Updated :May 7, 2024, 12:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.