ETV Bharat / entertainment

వచ్చే ఏడాదే స్టార్ హీరోయిన్​తో టిల్లుగాడి పెళ్లి!- క్లారిటీ ఇచ్చిన చైతన్య జొన్నలగడ్డ

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 11, 2024, 9:31 PM IST

Updated : Mar 11, 2024, 9:41 PM IST

Siddhu Jonnalagadda Brother Chaitanya Comments On His Brothers Marriage
Siddhu Jonnalagadda Brother Chaitanya Comments On His Brothers Marriage

Siddu Jonnalagadda Marriage : డీజే టిల్లు ఫేమ్​ సిద్ధు జొన్నలగడ్డ పెళ్లిపై ఇంట్రెస్టింగ్​ కామెంట్స్​ చేశారు ఆయన సోదరుడు చైతన్య జొన్నలగడ్డ. ఓ యూట్యూబ్​ ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధు వివాహానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ విశేషాలు.

Siddu Jonnalagadda Marriage : డీజే టిల్లులో సిద్ధు జొన్నలగడ్డ- రాధికల మధ్య వచ్చే సీన్స్​ను ఇప్పటికీ మరిచిపోలేరు చాలామంది ఆడియెన్స్​. అంతలా ప్రేక్షకుల​ మదిలో నిలిచిపోయింది ఆ సినిమా. దీనికి ప్రధాన కారణం సినిమాను అంత డెడికేషన్​తో చేశారు సిద్ధు జొన్నలగడ్డ అని చెబుతారు చాలామంది. అందుకేనేమో సినిమా కూడా సూపర్​ డూపర్​ హిట్​ అయ్యింది. ఇక దీనికి సీక్వెల్​గా మరికొన్ని రోజుల్లో టిల్లు స్క్వేర్​ కూడా రాబోతోంది.

ఇదిలాఉంటే ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ పెళ్లి విషయం​ సోషల్​ మీడియాలో హాట్​ టాపిక్​గా మారింది. ఎందుకంటే సిద్ధు పెళ్లి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ఆయన సోదరుడు చైతన్య జొన్నలగడ్డ. ఓ యూట్యూబ్​ ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధు వివాహంపై పలు ఇంట్రెస్టింగ్​ కామెంట్స్ చేశారు.

'అన్ని సెట్​ అయితే అప్పుడే పెళ్లి'
'మీ తమ్ముడు సిద్ధు ఎవరో స్టార్​ హీరోయిన్​తో ప్రేమలో ఉన్నారట, త్వరలో వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారట. దీనికి సంబంధించి వార్తలు కూడా వస్తున్నాయి' అని యాంకర్​ చైతన్యను అడిగారు. దీనికి స్పందించిన ఆయన స్టార్​ హీరోయిన్​ను పెళ్లి చేసుకుంటే ప్రాబ్లమ్​ లేదు కానీ, స్టార్​ హీరోను చేసుకుంటేనే ప్రాబ్లమ్​ కదా అంటూ ఫన్నీగా ఆన్సర్​ ఇచ్చారు. అయితే పెళ్లి ప్రతిపాదన వాస్తవమే అయినా, పార్ట్​నర్​ మాత్రం స్టార్​ హీరోయిన్​ ఆ కాదా అనేది తనకు తెలియదని చెప్పారు. సిద్ధుకు కూడా వివాహంపై ఆసక్తి ఉందని, అన్ని కుదిరితే వచ్చే ఏడాదే తన తమ్ముడి పెళ్లి జరిగిపోవచ్చని మాత్రం క్లారిటీ ఇచ్చారు సిద్ధు​ అన్న చైతన్య జొన్నలగడ్డ.

29న టిల్లు స్క్వేర్​!
ఇక చైతన్య జొన్నలగడ్డ కూడా రీసెంట్‌గా 'బబుల్​ గం' సినిమాలో నటించారు. అందులో తన యాక్టింగ్​కు మంచి మార్కులే పడ్డాయి. ఇక అంతకుముందు పలు సినిమాల్లో ఎన్నో రోల్స్​ చేసిన సిద్ధు జొన్నలగడ్డకు 'డీజే టిల్లు' మూవీ బ్రేక్​ ఇచ్చిందనే చెప్పాలి. ఈ సినిమాతో ఆయన కెరీర్​ గ్రాఫ్​ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం 'టిల్లు స్క్వేర్'​తో బిజీగా ఉన్నారు. ఈనెల 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్​గా నటించింది.

2024 ఆస్కార్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్​- 'ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌'ను వరించిన అవార్డ్

2024 ఆస్కార్ అవార్డ్స్​- బెస్ట్​ పిక్చర్​గా ఓపెన్​హైమర్- ఉత్తమ డైరెక్టర్​గా క్రిస్టోఫర్‌ నోలన్‌

Last Updated :Mar 11, 2024, 9:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.