ETV Bharat / entertainment

రాజకీయంలోకి తెలుగు హీరోయిన్స్​ - అందంతో కాదు నటనతో!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 3, 2024, 9:27 PM IST

Heroines as Politicians In Movies : దేశంలో ఎన్నికల ఫీవల్​ మొదలైంది. రాబోయే రెండు నెలల్లో ఎక్కడ చూసినా ఎన్నికల మాటలే వినపించనున్నాయి. ఈ నేపథ్యంలో వెండితెరపై రాజకీయ రంగు వేసుకున్న, అదే పొలిటీషియన్లుగా నటించిన హీరోయిన్లు ఎవరో ఓ సారి చూసేద్దాం.

రాజకీయంలోకి తెలుగు హీరోయిన్స్​ - అందంతో కాదు నటనతో!
రాజకీయంలోకి తెలుగు హీరోయిన్స్​ - అందంతో కాదు నటనతో!

Heroines as Politicians In Movies : సినీ ఇండస్ట్రీకి రాజకీయాలకు చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. చాలా మంది సినీ తారలు పాలిటిక్స్​లోకి వెళ్లి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నవారే. వారిలో కొంతమంది సక్సెస్ అయితే మరికొంతమంది మాత్రం బోల్తా పడ్డారు. అయితే ఇప్పుడు దేశంలో ఎన్నికల ఫీవల్​ మొదలైంది. రాబోయే రెండు నెలల్లో ఎక్కడ చూసినా ఎన్నికల మాటలే వినపించనున్నాయి. ఈ నేపథ్యంలో వెండితెరపై రాజకీయ రంగు వేసుకున్న, అదే పొలిటీషియన్లుగా నటించిన హీరోయిన్లు ఎవరో ఓ లుక్కేద్దాం.

  • కంగనా రనౌత్ - తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత బయోపిక్ ఆధారంగా వచ్చిన చిత్రాల్లో తలైవి కూడా ఒకటి. ఇందులో కంగనా రనౌత్​ అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలను దక్కించుకుంది.
  • అనసూయ - విలక్షన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అనసూయ పెదకాపు 1 చిత్రంలో పొలిటీషియన్​గా నటించి మెప్పించింది.
  • త్రిష- ధనుశ్​ నటించిన ధర్మయోగి చిత్రంలో ప్రతినాయక ఛాయలున్న పొలిటీషియన్​గా కనిపించింది.
  • నయనతార - చిరంజీవి గాడ్​ ఫాదర్​లోనూ నయనతార రాజకీయ నాయకురాలిగా కనిపించింది.
  • కేథరిన్ - సరైనోడు చిత్రంలో యూ ఆర్​ మై ఎమ్మెల్యే అంటూ గ్లామర్ పొలిటీషియన్​గా కేథరిన్​ మంచి క్రేజ్​ దక్కించుకుంది.
  • ప్రియమణి - నాగచైతన్య నటించిన కస్టడీ చిత్రంలో సీఎంగా గెలవాలని కుట్రలు చేసే రాజకీయ నాయకురాలిగా ప్రియమణి నటించి ఆకట్టుకుంది.
  • కృతిశెట్టి - చైతన్య బంగార్రాజు చిత్రంలో సర్వంచ నాగలక్ష్మీగా కనిపించి ఆకట్టుకుంది.
  • వరలక్ష్మీ శరత్ కుమార్ - విజయ్ దళపతి సర్కార్ సినిమాలో విలన్​గా, రాజకీయ నాయకురాలిగా కనిపించింది.
  • రమ్యకృష్ణ - ఈమె మూడు చిత్రాల్లో రాజకీయ నాయకురాలిగా కనిపించింది. సాయి ధరమ్ తేజ్​ రిపబ్లిక్, తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత బయోపిక్​ క్వీన్ వెబ్ సిరీస్, మహేశ్ బాబు గుంటూరు కారంలో న్యాయ శాఖమంత్రిగా కనిపించింది.
  • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • రోజా- రియల్ లైఫ్​లోనూ రాజకీయనాయకురాలైన ఈమె మొగుడు చిత్రంలో నటించింది. కృష్ణవంశీ దీనికి దర్శకుడు.
  • రవీనా టాండన్ - కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన కేజీయఫ్ 2లో ఈమె ప్రధాన మంత్రి పాత్ర పోషించి ఆకట్టుకుంది. ఈ చిత్రం ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది.
  • శ్రియా - పవిత్ర సినిమాలో పొలిటీషియన్​గా కనిపించి ఆకట్టుకుంది.

OTTలో ఆత్మలతో ఇన్వెస్టిగేషన్ - ఒక్కో ఎపిసోడ్​ సీట్ ఎడ్జ్​ థ్రిల్​తో!

మార్చి నెల అందమైన భామలు - థియేటర్లలో సందడి చేసే ఒయ్యారి నడకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.