ETV Bharat / bharat

'బటర్‌ చికెన్‌ను కనిపెట్టింది మేమే'- కోర్టుకు చేరిన రెస్టారెంట్ల పంచాయితీ - Butter Chicken Origin Issue

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 27, 2024, 8:22 AM IST

Butter Chicken Origin Issue In India
Butter Chicken Origin Issue In India

Butter Chicken Origin Issue In India : బటర్ చికెన్ ఎవరు కనుగొన్నారనే విషయం న్యాయస్థానానికి చేరింది. మోతీ మహల్ చేసిన పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలపై దర్యాగంజ్ రెస్టారెంట్​ యజమానులు దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

Butter Chicken Origin Issue In India : దేశంలో ప్రసిద్ధి గాంచిన 'బటర్‌ చికెన్‌', 'దాల్‌ మఖానీ' వంటకాలను ఎవరు కనుగొన్నారన్న అంశంపై మొదలైన న్యాయవివాదం మరింత ముదురుతోంది. దిల్లీకి చెందిన మోతీ మహల్‌, దర్యాగంజ్‌ రెస్టారెంట్ల యజమానుల మధ్య తాజాగా పరువునష్టం వ్యాఖ్యలు వివాదం సృష్టిస్తున్నాయి. ఓ వార్తాపత్రికలో బటర్ చికెన్​ను ఎవరు కనుగొన్నారు అనే విషయంపై మోతీ మహల్ యజమానులు చేసిన వ్యాఖ్యలపై దర్యాగంజ్ దిల్లీ హైకోర్టును అశ్రయించింది దర్యాగంజ్. ఆ ఇంటర్వ్యూలోని వ్యాఖ్యలు వివిధ వెబ్‌సైట్లలోనూ దర్శనమిచ్చాయని పేర్కొన్నారు. దీని వల్ల తమ రెస్టారెంట్‌ గౌరవానికి భంగం కలిగిందని వివరించారు.

'బటర్​ చికెన్​ను కనుగొన్నది మా వాళ్లే'
మరోవైపు ఆ ఇంటర్వ్యూలో వచ్చిన అంశం సంపాదకీయ దృక్పథమని, దానిని తమకు ఆపాదించరాదని మోతీ మహల్‌ యజమానులు వివరించారు. అయితే ఇందుకు సంబంధించి ఓ అఫిడవిట్‌ను దాఖలు చేయాలంటూ మోతీ మహల్‌ యజమానులను జస్టిస్‌ సంజీవ్‌ నరులా ఆదేశించారు. తమ పూర్వీకుడైన దివంగత కుందన్‌ లాల్‌ గుజ్రాల్‌ 'బటర్‌ చికెన్‌', 'దాల్‌ మఖానీ' వంటకాలను కనుగొన్నారని, అయితే ఆ రెండు వంటకాలపై దర్యాగంజ్ తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మోతీ మహల్‌ యజమానులు జవరిలోనే కోర్టును అశ్రయించారు. ఇక అప్పటి నుంచే ఈ అంశంలో వివాదం మొదలైంది.

సోషల్​మీడియాలో తొలగించిన ట్యాగ్​లైన్
అయితే ఈ విషయంపై బటర్ చికెన్, దాల్ మఖానీ మేమే కనిపెట్టాం అనే ట్యాగ్​లైన్​ను ఉపయోగించకూడదు అని దర్యాగంజ్​కు దిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. అలాగే వెబ్​సైట్, ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్, లింకెడిన్, ఎక్స్​ ఇలా అన్ని సోషల్​ మీడియాల నుంచి ఆ ట్యాగ్​లైన్​ను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. మోతీ మహల్ యజమానులు వేసిన దావాపై ప్రతిస్పందనగా లిఖితపూర్వక ప్రకటనను దాఖలు చేయాలని కోరింది. మోతీ మహల్ యజమానులు కోర్టులో వేసిన దావాలో తమ పూర్వీకుడు కుందన్ లాల్​ గుజ్రాల్ మొదటి తందూరీ చికెన్​ను చేశారని పేర్కొన్నారు. ఆ తర్వాత బటర్ చికెన్, దాల్​ మఖానీని తయారు చేసినట్లు తెలిపారు. దేశ విభజన అనంతరం భారతదేశానికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. దీనిపై దర్యాగంజ్ యజమానులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు.

రూ.60కే మీల్స్ హోమ్ డెలివరీ- డ్వాక్రా మహిళల 'లంచ్ బాక్స్​' సూపర్ హిట్! - Lunch Bell Kudumbashree

పోలీసులుగా 'సెవెన్​ సిస్టర్స్'- ఎంతో కష్టపడి చదివి​- ఇప్పుడు మంచి పొజిషన్​లో సెటిలై! - Seven Police Sisters In Bihar

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.