ETV Bharat / bharat

రూ.60కే మీల్స్ హోమ్ డెలివరీ- డ్వాక్రా మహిళల 'లంచ్ బాక్స్​' సూపర్ హిట్! - Lunch Bell Kudumbashree

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 26, 2024, 6:53 PM IST

Kudumbashree Lunch Bell in Kerala
Kudumbashree Lunch Bell in Kerala

Lunch Bell Kudumbashree : మొబైల్​లో ఆర్డర్​ చేస్తే చాలు- మన వద్దకే లంచ్ బాక్స్! ఇటీవల ప్రారంభమైన ఈ కుటుంబశ్రీ లంచ్ బెల్ ప్రాజెక్ట్ సూపర్ హిట్ అయింది. కేవలం 16 రోజుల్లో 2000కుపైగా ఆర్డర్లు అందుకుంది. ఒకసారి ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం రండి.

డ్వాక్రా మహిళల 'లంచ్ బెల్' ప్రాజెక్ట్ హిట్- అతి తక్కువ ధరకే ఇంటి భోజనం
  • రూ.60కు వెజ్ మీల్స్- రూ.90కు నాన్​ వెజ్ మీల్స్!
  • మొబైల్​లో ఆర్డర్​ చేస్తే ఇంటికి డోర్ డెలివరీ!
  • క్వాలిటీ, టేస్ట్​లో అస్సలు నో కాంప్రమైజ్!
  • వండేది, డెలివరీ చేసేది డ్వాక్రా మహిళలే!

Lunch Bell Kudumbashree : ఇదే కుటుంబశ్రీ లంచ్ బెల్ ప్రాజెక్ట్ మెయిన్ ధీమ్. అసలు ఈ కుటుంబశ్రీ ఏంటని మీకు డౌట్ రాలేదా?.. సాధారణంగా చాలా రాష్ట్రాల్లో డ్వాక్రా సంఘాలు ఉంటాయి. కానీ కేరళలోని డ్వాక్రా మహిళంతా కుటుంబశ్రీ పేరుతో స్వయం ఉపాధి పొందుతున్నారు. ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టిన వీరు, ఇటీవల ఆహార రంగంలోకి కూడా ప్రవేశించారు.

మొబైల్​లో ఆర్డర్ చేస్తే చాలు ఇంటికి లంచ్ బాక్స్​లో క్వాలిటీ, టేస్టీ ఫుడ్​ను డెలివరీ చేస్తున్నారు. ఇటీవల మొదలైన ఈ లంచ్ బెల్ ప్రాజెక్ట్ మంచి ఆదరణ దక్కించుకుంటోంది. మార్చి 5న కేరళ తిరువనంతపురంలో రాష్ట్ర వ్యవహారాల శాఖ మంత్రి ఎంబీ రాజేశ్​ ఈ లంచ్ బెల్ ప్రాజెక్ట్​ను ప్రారంభించారు. మార్చి 6న సేవలు మొదలవ్వగా, ఇప్పటివరకు 2000 మందికి పైగా ఆర్డర్లు వచ్చాయి.

Kudumbashree Lunch Bell in Kerala
డెలివరీ కోసం రెడీ చేస్తున్న లంచ్ బాక్స్​ లు

'కుటుంబశ్రీ ప్రాజెక్ట్ అందరి దృష్టిలో మంచి పేరు సంపాదించుకుంది. ఇక్కడ చాలా మంది మహిళలు పని చేస్తున్నారు. ఈ విషయం నాకు ఎంతో నచ్చింది. చాలా సౌకర్యంగా అనిపిస్తుంది. ఇంట్లో ఎలా అయితే చేస్తారో అలానే అనిపిస్తుంది. ఆ లంచ్ బాక్స్ తయారు చేసే విధానం కూడా అలానే ఉంటుంది.'

-కుటుంబశ్రీ సంస్థ ఉద్యోగి

ఈ ప్రాజెక్టు కింద భోజనాన్ని తయారు చేసేందుకు 11 మంది, ఆహారాన్ని డెలివరీ చేసేందుకు 8 మంది ఉద్యోగులు ఉన్నారు. ఆదివారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో వెజ్, నాన్​ వెజ్​ ఫుడ్ అందుబాటులో ఉంటుంది. మార్చి 5న ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్​కు కేవలం 16 రోజుల్లో 2000కు పైగా ఆర్డర్స్​ వచ్చాయని చెప్పారు ప్రాజెక్ట్ మేనేజర్ జాన్​.

Kudumbashree Lunch Bell in Kerala
లంచ్​ బెల్​ ప్రాజెక్ట్​లో పని చేస్తున్న మహిళలు

'ఇందులో చేయాల్సి పని చాలా​ ఉంటుంది. త్వరలో టెక్ పార్క్​కు కూడా డెలివరీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. వీక్లీ, మంత్లీ ఇలా అన్ని రకాల సర్వీస్ ఉంటుంది. ఆన్​లైన్​లో ఆర్డర్ చేయొచ్చు లేకుంటే నేరుగా ఫోన్ చేసి మాకు ఆర్డర్ ఇవ్వచ్చు. మేం పార్టీలకు, ఫంక్షన్లకు కూడా ఫుడ్ సరఫరా చేస్తాం'

- జాన్ , ప్రాజెక్టు మేనేజర్

పాకెట్ మార్ట్ మొబైల్ యాప్​ ద్వారా ఉదయం 6 గంటల నుంచి లంచ్ బాక్స్ ఆర్డర్ చేయవచ్చు. సాయంత్రం 6 గంటల తర్వాత మరుసటి రోజు కోసం ఆర్డర్​ చేయవచ్చు. ఉదయం 11 గంటల నుంచే లంచ్​ బాక్స్​లను డెలివరీ చేస్తుంటారు. మళ్లీ మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి ఖాళీ బాక్స్​ను తీసుకుంటారు. శాకాహార భోజనానికి 60 రూపాయలు, మంసాహారానికి 90 రూపాయలు వసూలు చేస్తున్నారు. లంచ్​ బెల్​ ప్రాజెక్టులో స్థానిక వంటకాలకు మాత్రమే ప్రాధాన్యమిస్తున్నట్లు గిరిజ తెలిపారు.

Kudumbashree Lunch Bell in Kerala
డెలివరీ చేస్తున్న మహిళలు

'కాలేజీలోని టీచర్లు నాకు ఫోన్ చేసి అభినందించారు. ఈ సంస్థకు పీఆర్​గా ఉన్న పార్వతి మేడమ్​ కూడా ఎంతో అండగా నిలిచారు. ముందు రోజు నుంచే మేము సిద్ధం చేస్తాము. నాకు ముందు రోజే సుమారుగా ఎన్ని బాక్సులు కావాలని చెప్పేస్తే నేను దానికి తగ్గట్లు రెడీ చేస్తాను. ఉదయం కల్లా వాటిని డెలివరీ చేసేందుకు ప్లాన్ చేస్తాం'

- గిరిజ, లంచ్​ బెల్ ప్రాజెక్ట్ వర్కర్

ప్రస్తుతం ఐదు ఏరియాలకు మాత్రమే ఈ లంచ్ బెల్ ప్రాజెక్ట్ అందుబాటులో ఉందని ప్రాజెక్టు మేనేజర్ తెలిపారు. ఈ నెలలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు చెప్పారు.

Kudumbashree Lunch Bell in Kerala
వంట గది

కొడుకుతో కలిసి పదో తరగతి పరీక్షలకు తల్లి- 32ఏళ్లకు టెన్త్​ క్లాస్​ - Mother And Her Son Write 10th Exams

జోడీ కావాలంటూ పెళ్లి కాని ప్రసాదుల పూజలు- ఆ లిస్ట్​తో దేవుడికి లేఖ! - Boys Special Pooja For Marriage

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.