తెలంగాణ

telangana

తెరాస వల్లే రెవెన్యూ శాఖలో విచ్చలవిడి అవినీతి : కోదండరాం

By

Published : Sep 7, 2020, 10:32 PM IST

పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడే ఎల్ఆర్ఎస్ స్కీంను తక్షణమే సస్పెండ్ చేయాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. కరోనా సమయంలో ఈ స్కీం ప్రజలపై అధిక భారం మోపుతోందన్నారు. తెరాస రాజకీయ లాలుచీతనం వల్లే రెవెన్యూ వ్యవస్థ పాడైపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు విచ్చలవిడిగా రికార్డులను తారుమారు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెరాస వల్లే రెవెన్యూ అవినీతి విచ్చలవిడిగా పెరిగింది : కోదండరాం
తెరాస వల్లే రెవెన్యూ అవినీతి విచ్చలవిడిగా పెరిగింది : కోదండరాం

పేద, మధ్య తరగతి ప్రజలపై అధిక భారం మోపే భూ క్రమబద్ధీకరణ స్కీంను తక్షణమే సస్పెండ్ చేయాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. కరోనా విపత్తు సమయంలో ఎల్​ఆర్​ఎస్​ స్కీం ప్రజల నడ్డి విరుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ప్రజలు ఉపాధి లేక ఇబ్బందులు పడుతుంటే... ప్రభుత్వం వారిని దోచుకునేందుకు యత్నించడం హేయమన్నారు.

తెరాస వల్లే రెవెన్యూ అవినీతి విచ్చలవిడిగా పెరిగింది : కోదండరాం

ఆ వర్గాల హక్కులకు రక్షణ...

రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తూనే.. పేద వర్గాల హక్కులకు రక్షణ కల్పించాలని కోదండరాం కోరారు. పేదలకు పట్టా పాస్ పుస్తకం చేతికి వచ్చే వరకు పోరాటం వదిలే ప్రసక్తే లేదన్నారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయ నాయకుల వల్ల రెవెన్యూ వ్యవస్థ దుర్లబంగా తయారైందని ఎద్దేవా చేశారు. రాజకీయ నాయకుల జోక్యం వల్లే రెవెన్యూ వ్యవస్థ గందరగోళంగా మారిందన్నారు. రెవిన్యూ వ్యవస్థకు ఆ శాఖ ఉద్యోగులను బాధ్యులను చేయడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం తొందరపడి బిల్లు పాస్ చేయకుండా ముందు చర్చ పెట్టాలని సూచించారు. అందరి సూచనలను పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు. తెరాస రాజకీయ లాలుచీతనం వల్లే రెవెన్యూ వ్యవస్థ పాడైపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు విచ్చలవిడిగా రికార్డులను తారుమారు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వారి పట్టా పుస్తకాలు వచ్చేదాకా పోరాడతాం..

పేదలకు పట్టా పుస్తకం చేతికి వచ్చే వరకు వదిలే ప్రసక్తే లేదన్నారు. ఈ రోజు తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయ నాయకుల వల్లా రెవెన్యూ వ్యవస్థ ఈ విధంగా తయారైందని అన్నారు. రాజకీయ నాయకుల జోక్యం వల్లనే రెవెన్యూ వ్యవస్థ గందరగోళంగా అయిందని అన్నారు.

'అందుకు వారిని బాధ్యులుగా చేయకూడదు'

రెవిన్యూ వ్యవస్థ ప్రక్షాలనకు ఆ శాఖ ఉద్యోగులను, అధికారులను బాధ్యులను చేయడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం తొందరపడి బిల్లు పాస్ చేయకుండా చర్చ పెట్టాలని కోదండరాం డిమాండ్ చేశారు.అందరి సూచనలను పరిగణలోకి తీసుకోవాలన్నారు.

ఇవీ చూడండి : దుబ్బాక తహసీల్దార్​ కారుకు అడ్డంగా పడుకొని నిరసన..

ABOUT THE AUTHOR

...view details