తెలంగాణ

telangana

Harish Rao Comments on Congress : జాకీ పెట్టి లేపినా తెలంగాణలో బీజేపీ లేవదు.. కాంగ్రెస్‌ అధికారంలోకి రాదు: మంత్రి హరీశ్​రావు

By ETV Bharat Telangana Team

Published : Oct 6, 2023, 4:19 PM IST

Harish Rao Comments on Congress : రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. తప్పుడు సర్వేలతో హస్తం పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. టికెట్ల పంపిణీ చేయలేక ఆ పార్టీ చతికిల పడిపోయిందని విమర్శించారు. బీఆర్ఎస్‌లో టికెట్లు రాని వారిని కాంగ్రెస్‌ చేర్చుకుంటోందని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.

Nizamabad district
Harish Rao

Harish Rao Comments on Congress in Nizamabad Tour : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంత్రి హరీశ్‌రావు (Harish Rao) పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. తొలుత కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. రూ.26 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విద్యార్థులకు గొడ్డు కారంతో అన్నం పెడుతుంటే.. తెలంగాణలో మాత్రం కేసీఆర్ సర్కార్‌ చిన్నారులకు మమకారంతో అల్పాహారం అందిస్తోందని హరీశ్‌రావు వెల్లడించారు.

కేంద్రం, మహారాష్ట్రలో బీజేపీ సర్కార్ ఉన్నా.. నాందేడ్‌ ఆసుపత్రిలో మందులు ఎందుకు లేవని హరీశ్‌రావు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో జాకీ పెట్టి లేపినా భారతీయ జనతా పార్టీ లేచే పరిస్థితి లేదని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని.. తప్పుడు సర్వేలతో హస్తం పార్టీ.. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. టికెట్ల పంపిణీ చేయలేకపోతున్న కాంగ్రెస్‌.. అధికారంలోకి వస్తే ఏం అభివృద్ధి చేస్తుందని హరీశ్‌రావు నిలదీశారు.

Harish Rao Launching Health Department Progress Report : 'త్వరలో ప్రతి నియోజకవర్గంలో డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు'

Harish Rao visit to Nizamabad District Today : అనంతరం హరీశ్‌రావు నిజామాబాద్ జిల్లా (Nizamabad District) దర్పల్లి మండల కేంద్రంలో రూ.30 కోట్లతో నిర్మించనున్న.. 100 పడకల ఆసుపత్రికి భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ పట్టుపట్టి 100 పడకల ఆసుపత్రిని ఈ ప్రాంతానికి మంజూరు చేయించారని ఆయన తెలిపారు. బాజిరెడ్డిని మరోసారి గెలిపించి హ్యాట్రిక్‌ ఇవ్వాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ పాలనలో ఆసుపత్రిలో సూది ఉంటే మందు లేని పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. బీడీ పరిశ్రమను దెబ్బతీయడానికే బీడీ కట్టపై జీఎస్టీ వేశారని.. మహిళా బీడీ కార్మికులకు ఫించన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.

Minister Harish Rao Reaction on Congress 6 Guarantees : కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు కాదు.. ఆర్నెళ్లకో సీఎం వస్తారు: మంత్రి హరీశ్​రావు

Interesting Comments Between Bajireddy Govardan and Prashanth Reddy : మంత్రి ప్రశాంత్‌ రెడ్డి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి తక్కువ నిధులు కేటాయించారని బాజిరెడ్డి గోవర్దన్ (Bajireddy Govardan) అన్నారు. బాల్కొండ నియోజకవర్గానికి ఎక్కువ నిధులు వచ్చాయని.. చిన్న వయస్సులోనే ఆయన పెద్ద పదవిలో ఉన్నారని చెప్పారు. తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని బాజిరెడ్డి గోవర్దన్ సూచించారు. దీనిపై స్పందించినమంత్రి ప్రశాంత్‌ రెడ్డి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పారు. ఎన్ని నిధులు ఇచ్చినా.. బాజిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. రూ.200 కోట్లతో రూరల్ నియోజకవర్గంలో రోడ్లు వేయించామని ప్రశాంత్‌ రెడ్డి (Prashanth Reddy) వెల్లడించారు.

"బాజిరెడ్డి పట్టుపట్టి 100 పడకల ఆస్పత్రి మంజూరు చేయించారు. బాజిరెడ్డిని మరోసారి గెలిపించి హ్యాట్రిక్‌ ఇవ్వాలి. కాంగ్రెస్ పాలనలో ఆస్పత్రిలో సూది ఉంటే మందు లేని పరిస్థితి. బీడీ పరిశ్రమను దెబ్బతీయడానికే బీడీ కట్టపై జీఎస్టీ వేశారు. మహిళా బీడీ కార్మికులకు ఫించన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ." - హరీశ్‌రావు, మంత్రి

Harish Rao Comments on Congress జాకీ పెట్టి లేపినా తెలంగాణలో బీజేపీ లేవదు కాంగ్రెస్‌ అధికారంలోకి రాదు మంత్రి హరీశ్​రావు

Harish Rao Inaugurates Arete Hospital : 'అంతర్జాతీయ మెడికల్‌ హబ్‌గా తెలంగాణ మారనుంది'

Harish Rao at Gajwel Ring Road Opening : 'మూడు గంటలు కరెంటు ఇచ్చే కాంగ్రెస్ కావాలా.. మూడు పంటలు ఇచ్చే కేసీఆర్‌ కావాలా..?'

ABOUT THE AUTHOR

...view details