Prashanth Reddy on MP Arvind Allegations : డబుల్‌ బిల్లుల వివాదం.. CBI విచారణకైనా సిద్ధమంటూ మంత్రి సవాల్

By

Published : Jul 17, 2023, 7:37 PM IST

thumbnail

Minister Prashanth Reddy double bills controversy : నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ చేసిన ఆరోపణలను మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఖండించారు. తాను ఏ పనికి రెండుసార్లు బిల్లు తీసుకోలేదని స్పష్టం చేశారు. అలాంటి ఆస్కారమే ఉండదని వివరణ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ అసిస్టెన్స్‌ కింద రాష్ట్రానికి రూ.3000 కోట్లు కేటాయిస్తే.. తాను ప్రాతినిథ్యం వహించే రోడ్లు, భవనాల శాఖకు రూ.300 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. ఈ డబ్బులతోనే బ్రిడ్జిల నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. మంత్రిగా తాను పనులు మంజూరు చేస్తే.. కాంట్రక్టర్‌ పనులు పూర్తి చేస్తారని ఆయన వివరించారు. దీనిపై సీబీఐ విచారణకైనా సిద్ధమని మంత్రి ప్రంశాత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద ఉచిత విద్యుత్‌పై కాంగ్రెస్‌ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రేవంత్‌రెడ్డి విధానాలతో రైతులకు తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆరోపించారు. రైతులకు మూడు గంటల కరెంట్‌ ఇచ్చే ప్రభుత్వం కావాలో.. 24 గంటల కరెంట్‌ ఇచ్చే ప్రభుత్వం కావాలో తేల్చుకోవాలని సూచించారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.