ETV Bharat / state

Harish Rao Launching Health Department Progress Report : 'త్వరలో ప్రతి నియోజకవర్గంలో డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు'

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 25, 2023, 3:56 PM IST

Harish Rao Launching Health Department Progress Report : రాష్ట్రంలో ఫార్మసీలను కూడా బలోపేతం చేస్తామని మంత్రి హరీశ్‌రావు ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో వైద్య, ఆరోగ్యశాఖ పదేళ్ల ప్రగతి నివేదికను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా 310 ఫార్మసీలకు ఉద్యోగ నియమక పత్రాలను అందజేశారు. త్వరలో ప్రతి నియోజకవర్గంలో డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేస్తామని... మరో 5204 స్టాఫ్‌ నర్సు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు హరీశ్‌రావు తెలిపారు.

Harish Rao Launching Health Department Progress Report
Harish Rao

Harish Rao Launching Health Department Progress Report పేదల పట్ల సీఎంకు ఉన్న ప్రేమకు ఇదే నిదర్శనం

Harish Rao Launching Health Department Progress Report : గడిచిన తొమ్మిదేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR).. ఒక్క ఆరోగ్య శాఖలోనే 22 వేల 600 ఉద్యోగాలు కల్పించారని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ పదేళ్ల ప్రగతి నివేదికను మంత్రి హరీశ్‌రావు(Minister Harish Rao).. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఎంఈ రమేశ్​ రెడ్డి, డీహెచ్ శ్రీనివాసరావు, టీఎస్ ఎంఐడీసీ ఛైర్మన్ ఎర్రొళ్ల శ్రీనివాస్ సహా పలువురు పాల్గొన్నారు.

World Pharmacist Day 2023 : వరల్డ్ ఫార్మసిస్ట్ డే(World Pharmacist Day) సందర్భంగా కొత్తగా విధుల్లోకి తీసుకున్న 310 ఫార్మసిస్ట్​లకు మంత్రి నియామక పత్రాలు అందించారు. అనంతరం ప్రగతి నివేదిక విడుదల చేసిన మంత్రి.. త్వరలో వైద్య ఆరోగ్యశాఖలో 7,291 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వైద్య ఆరోగ్య రంగంలో అత్యుత్తమ ఫలితాలు సాధించామన్నారు. నీతి అయోగ్ సూచికలో 11వ స్థానం నుంచి తెలంగాణ 3వ స్థానానికి చేరటం గర్వ కారణమని పేర్కొన్నారు.

Harish Rao Launch Health Department Progress Report in Ravindra Bharathi : ఒకప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 30 శాతమేనన్న మంత్రి.. ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 76 శాతానికి పెరిగిందన్నారు. అవయవమార్పిడి శస్త్రచికిత్సల్లో తెలంగాణ ముందుందని తెలిపారు.

Harish Rao Inaugurates Robotic Surgery Equipments : 'క్యాన్సర్‌కు చికిత్స అందించడంలో దేశంలోని అగ్రగామి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి'

'ఒకప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 30 శాతమే.. ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 76 శాతానికి పెరిగింది. అవయవమార్పిడి శస్త్రచికిత్సల్లో తెలంగాణ ముందుంది. నిమ్స్‌లో 6 నెలల్లో 100 అవయవమార్పిడి శస్త్రచికిత్సలు. రూ.30 లక్షలు ఖర్చయ్యే చికిత్సలు ఉచితంగా చేశారు. పీజీ వైద్య సీట్లలో దేశంలో రెండోస్థానానికి చేరాం. వైద్యంలో నీతి ఆయోగ్‌ ర్యాంకుల్లో మూడో స్థానానికి చేరాం. మందులు లేవు, ప్రైవేటులో కొనుక్కోండి అని చెప్పే పరిస్థితి లేదు. ఆరోగ్యశాఖకు రూ.12,364 కోట్లు కేటాయించారు. నిమ్స్‌ను 4 వేల పడకలకు పెంచుకున్నాం.' -హరీశ్‌రావు, వైద్యారోగ్యశాఖ మంత్రి

రాష్ట్రంలో మెడికల్‌ కళాశాలల సంఖ్య 56కు చేరిందని మంత్రి హరీశ్​రావు అన్నారు. 2014కు ముందు 3 డయాలసిస్‌ కేంద్రాలు మాత్రమే ఉండేవని.. ఇప్పుడు 82 డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయని వివరించారు. త్వరలో ప్రతి నియోజకవర్గానికి ఒక డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఒకప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూలు 5 మాత్రమే ఉండేవి.. ఇవాళ ఐసీయూల సంఖ్య 80కి చేరిందన్నారు.

పేదల పట్ల సీఎం కేసీఆర్​కు ఉన్న ప్రేమకు ఇదే నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో మాతా, శిశుమరణాలు గణనీయంగా తగ్గాయన్న ఆయన.. 108 అంబులెన్స్‌ల సంఖ్య 450కి పెంచామన్నారు. బడ్జెట్ పెంచుకోవటం సహా ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ సరఫరా, డయాలసిస్ కేంద్రాల వంటి అన్ని రకాల సౌకర్యాలను పెంపొందించుకుని ప్రజలకు మెరుగైన సేవ చేస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో 300 అమ్మఒడి వాహనాలు ఉన్నాయని వివరించారు.

Harish Rao Inaugurates Arete Hospital : 'అంతర్జాతీయ మెడికల్‌ హబ్‌గా తెలంగాణ మారనుంది'

HarishRao Health Department Review : ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల సంఖ్య గణనీయంగా పెరగడం పట్ల హరీశ్‌రావు హర్షం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.