తెలంగాణ

telangana

'అసత్య ఆరోపణలతో ప్రధాని మోదీ రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీశారు'

By

Published : Nov 13, 2022, 4:17 PM IST

Balka Suman comments on PM Modi: దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందన్న అక్కసుతో ప్రధాని మోదీ.. సీఎం కేసీఆర్​పై విషం కక్కుతున్నారని ప్రభుత్వ విప్​, ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. రామగుండంలో అసత్య ఆరోపణలు చేసి రాష్ట్ర ప్రజల మనోభావాలను ప్రధాని దెబ్బతీశారని మండిపడ్డారు.

Balka Suman comments on Modi
Balka Suman comments on Modi

Balka Suman comments on PM Modi: సింగరేణిని ప్రైవేటుపరం చేసే ఆలోచన కేంద్రానికి లేదని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పందించారు. అయితే దేశంలోని బొగ్గు పరిశ్రమలతో పాటు, సింగరేణిలోని బొగ్గు బ్లాక్​లను వేలం వేయాలన్న ఆలోచన.. కేంద్రానికి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. లాభాలలో ఉన్న సింగరేణిని కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు మోదీ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రాణాలను పణంగా పెట్టి శ్రమిస్తున్న సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని.. పార్లమెంట్​లో ఎన్నోసార్లు అడిగామని గుర్తుచేశారు. ఈ విషయంపై ప్రధాని ఇప్పటి వరకూ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందన్న అక్కసుతో ప్రధాని మోదీ.. సీఎం కేసీఆర్​పై విషం కక్కుతున్నారని ఆరోపించారు. 11వ వేజ్ బోర్డును పునఃసమీక్షించి సింగరేణి కార్మికులు, కార్మిక సంఘాలు కోరుకున్నట్లు సవరణ చేయాలని డిమాండ్ చేశారు. రామగుండంలో అసత్య ఆరోపణలు చేసి.. రాష్ట్ర ప్రజల మనోభావాలను ప్రధాని మోదీ దెబ్బతీశారని బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details