ETV Bharat / state

ప్రధాని.. ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడటం సరికాదు: గంగుల కమలాకర్‌

author img

By

Published : Nov 13, 2022, 3:35 PM IST

Gangula Kamalakar Fires On Central Government: రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఎంత మభ్యపెట్టినా.. తెలంగాణ ప్రజలు వేరే వ్యక్తుల పాలనను కోరుకోవడం లేదని మంత్రి గంగుల కమలాకర్‌ వెల్లడించారు. రాష్ట్ర పర్యటన చేసిన ప్రధాని మోదీ ప్రతిపక్షనేతగా మాట్లాడటం సరికాదని విమర్శించారు. దేశ సంపదను అన్ని రాష్ట్రాలకు సమానంగా పంచాలని మంత్రి గంగుల డిమాండ్‌ చేశారు.

Gangula Kamalkar Fires On Central Government
Gangula Kamalkar Fires On Central Government

Gangula Kamalakar Fires On Central Government: దిల్లీ పాలకులు ఎంత విషం చిమ్మినా.. తెలంగాణ అభివృద్ధి ఆగదని మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో కరీంనగర్‌ను అద్భుతంగా అభివృద్ధి చేశామని తెలిపారు. కరీంనగర్​కు పర్యాటకులు వచ్చేలా కేబుల్ బ్రిడ్జ్, మానేరు రివర్ ఫ్రంట్ నిర్మిస్తున్నామని చెప్పారు. ఆంధ్రా పార్టీలు తెలంగాణకు అవసరమా అని ప్రశ్నించారు. పాదయాత్రల పేరుతో కొందరు.. కోతి వేషాలతో కేఏ పాల్ లాంటి వారు తెలంగాణకు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సమైక్య పాలన ఇదివరకే చూశామని.. మళ్లీ మీ పాలన తమకు అవసరం లేదని గంగుల కమలాకర్‌ విమర్శించారు. దేశానికి ప్రధానిగా ఉన్న మోదీ ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడటం సరికాదని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్​కు ప్రధాని కార్యాలయం నుంచి ఆహ్వానం అందలేదని.. ఇదేనా భాజపా సంస్కృతి అని మండిపడ్డారు. జీఎస్టీ తాము కడితే.. ఫలాలు మాత్రం గుజరాత్​కా అని ధ్వజమెత్తారు. ప్రధాని రామగుండంలో కొత్తగా ఏమైనా కర్మాగారాలు ప్రకటిస్తారని అనుకుంటే.. కేవలం రాజకీయాలే మాట్లాడారని ఆరోపించారు. దిల్లీ పాలకులకు తెలంగాణపై వివక్ష ఎందుకు అని ప్రశ్నించారు. దేశానికి ప్రధానిగా ఉన్న వ్యక్తి అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి.. సంపద అందరికీ పంచాలని గంగుల కమలాకర్‌ డిమాండ్ చేశారు.

"ఇప్పటికే పాదయాత్ర పేరు మీద తెలంగాణ గడ్డపై కొంత మంది ఆంధ్ర పాలకులు తిరుగుతున్నారు.కేఏ పాల్ లాంటి వారు కోతి వేషాలు వేస్తున్నారు. ప్రధానిగా ఉన్న మోదీ ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడడం సరికాదు. పన్నులు కట్టేది మేము.. పంచేది గుజరాత్​కా. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి. సంపద అందరికీ పంచాలి." - గంగుల కమలాకర్‌, మంత్రి

ప్రధాని.. ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడటం సరికాదు: గంగుల కమలాకర్‌

ఇవీ చదవండి: తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయి: ప్రధాని మోదీ

'మునుగోడులో ఓటమి అక్కసుతోనే సీఎం కేసీఆర్​పై మోదీ విషం చిమ్మారు'

నిరుద్యోగులకు గుడ్​న్యూస్.. గ్రూపు 4, పోలీస్ ఉద్యోగాలపై హరీశ్‌రావు కీలక ప్రకటన

తాను చనిపోయి మరో ఇద్దరిని బతికించిన 18 నెలల చిన్నారి.. చిన్న వయసులోనే అవయవదానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.