తెలంగాణ

telangana

PM Modi Telangana Tour Today : నేడు పాలమూరు జిల్లాకు ప్రధాని మోదీ.. 'ప్రజా గర్జన' వేదికగా ఎన్నికల శంఖారావం..

By ETV Bharat Telangana Team

Published : Oct 1, 2023, 7:15 AM IST

PM Modi Telangana Tour Today : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి బీజేపీ ఇవాళ శ్రీకారం చుట్టనుంది. మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో నిర్వహించే పాలమూరు ప్రజా గర్జన బహిరంగ సభ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. సీఎం కేసీఆర్​ పాలనా వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టడం, పదేళ్ల మోదీ హయాంలో బీజేపీ తెలంగాణకు ఏం చేసిందో, అధికారంలోకి వస్తే ఏం చేయబోతోందో ప్రస్తావించే అవకాశం ఉంది. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రూ.13 వేల 500 కోట్ల వివిధ అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

BJP Palamuru Praja Garjana meeting
PM Modi Mahabubnagar Tour

PM Modi Telangana Tour Today : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించేందుకు ప్రధాని మోదీ నేడు పాలమూరు(Modi Palamuru Tour) జిల్లాకు రానున్నారు. కేంద్రం చేపట్టిన రూ.13 వేల 500 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితమివ్వనున్నారు. మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న మోదీ.. అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరు పురపాలిక పరిధిలో అమిస్తాపూర్ శివారులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ నిర్వహించే పాలమూరు ప్రజాగర్జన సభలో మోదీ పాల్గొననున్నారు. అంతకుముందు రూ.13 వేల 545 కోట్లతో చేపట్టనున్న పలు అధికారిక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు. సభ ముగిసిన తర్వాత శంషాబాద్ విమానాశ్రయం చేరుకొని దిల్లీకి తిరుగు పయనమవుతారు.

Kishan Reddy Comments on CM KCR : 'ప్రధాని మోదీ తెలంగాణకు వస్తుంటే.. కేసీఆర్ ఇంట్లో కూర్చొని కుట్రలు చేస్తున్నారు'

BJP Palamuru Praja Garjana Public Meeting :పాలమూరులో నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లోపలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతో పాటు ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేయనున్నారు. వరంగల్ - ఖమ్మం, ఖమ్మం - విజయవాడ నాలుగు వరుసల రహదారి పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. రూ.1,932 కోట్లలతో కృష్ణపట్నం - హైదరాబాద్‌ మధ్య మల్టీ ప్రోడక్ట్‌ పైప్‌లైన్‌కు శంకుస్థాపన చేస్తారు. రూ.2 వేల 457 కోట్లతో నిర్మించిన సూర్యాపేట - ఖమ్మం నాలుగు వరుసల రహదారిని మహబూబ్‌నగర్ నుంచే ప్రారంభిస్తారు. రూ.505 కోట్లతో నిర్మించిన జక్లేర్‌- కృష్ణా కొత్త రైల్వే మార్గాన్ని ప్రధాని జాతికి అంకితం చేస్తారు. కృష్ణా స్టేషన్‌ నుంచి కాచిగూడ డెమూను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభిస్తారు. రూ.2 వేల 661 కోట్ల విలువైన హసన్‌- చర్లపల్లి హెచ్​పీసీఎల్​, ఎల్​పీజీ పైప్‌లైన్‌ను జాతికి అంకితమిస్తారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ(Hyderabad Central University)లో రూ.81.27 కోట్లతో నిర్మించిన భవనాల్ని వర్చువల్‌గా ప్రారంభిస్తారు.

మోదీ తెలంగాణ పర్యటనలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉన్నాయి. అన్నింటికీ సిద్ధం చేశాం. వచ్చే ఎన్నికల్లో కేంద్రం, రాష్ట్రంలోనూ బీజేపీ వస్తుంది. రాష్ట్రంలో బీజేపీ వస్తేనే అభివృద్ధి వేగంగా జరుగుతుంది. పాలమూరు ప్రజలు ఈ సభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నా. - డీకే అరుణ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు

PM Modi Telangana Tour పాలమూరు ప్రజాగర్జన బహిరంగ సభ


BJP Praja Garjana Sabha Arrangements : మహబూబ్‌నగర్ జిల్లాలోని భూత్పూర్‌ బహిరంగ సభకు ఉమ్మడి పాలమూరు జిల్లా ఒక్కో నియోజకవర్గం నుంచి 20 వేలకు తగ్గకుండా తరలించాలని కమలం నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణకు ఏం చేయబోతున్నారో మోదీ ప్రజలకు వివరించే అవకాశం ఉంది. ప్రధాని రాకసందర్భంగా మూడంచెల భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఏడుగురు ఎస్పీలు, 8 మంది అదనపు ఎస్పీలు, 18 మంది డీఎస్పీలు, సహా 2 వేల మందిని సిబ్బందిని మోహరించనున్నారు. ప్రధాని రాక దృష్ట్యా మహబూబ్‌నగర్ - భూత్పూరు రహదారిపై ట్రాఫిక్ అంక్షలు విధించారు.

PM Modi Telangana Tour Schedule : అక్టోబర్ 1న తెలంగాణకు ప్రధాని మోదీ.. మహబూబ్​నగర్ వేదికగా ఎన్నికల శంఖారావం

Kishan Reddy on PM Modi Telangana Tour : 'నిజామాబాద్‌ సభలోనే తెలంగాణలో మోదీ ఎన్నికల శంఖారావం'

PM Modi Inaugurated Kacheguda Yeswantapur Vande Bharat Train : 'బీజేపీ ప్రభుత్వం.. రైల్వేలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది'

ABOUT THE AUTHOR

...view details