తెలంగాణ

telangana

కాలినడకన అమ్మాపురం టు శబరిమల

By

Published : Nov 20, 2019, 12:33 PM IST

గత మూడేళ్లుగా కాలినడకన శబరిమల వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటున్నాడో భక్తుడు. ఈ ఏడు కూడా నడకమార్గంలో శబరియాత్ర కొనసాగిస్తున్నారు.

కాలినడకన అమ్మాపురం టు శబరిమల

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన మహబూబ్ రెడ్డి.. అయ్యప్ప స్వామి మాల ధరించి శబరిమలకు చేపట్టిన పాద యాత్ర మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. గత మూడేళ్లుగా మహబూబ్​ రెడ్డి పాదయాత్ర చేసుకుంటూ శబరిమలకు వెళ్తున్నాడు.

కాలినడకనే శబరిమల కొండకు చేరి అయ్యప్పస్వామిని దర్శించుకుంటానని, ఇంటి దగ్గర నుంచి స్వామి చెంతకు చేరడానికి సుమారు 80 రోజులు పడుతుందని మహబూబ్ రెడ్డి తెలిపారు. యాత్రలో తనకవసరమయ్యే వస్తువులను, సరుకులను తీసుకెళ్లేందుకు సైకిల్​ను ఏర్పాటు చేసుకునంటానని పేర్కొన్నారు.

తొర్రూరు నుంచి మహబూబాబాద్, భద్రాచలం, విజయవాడ, తిరుపతి, చెన్నై, మధురై, ఎర్నాకులం మీదుగా ఏరుమేలి చేరుకుని అయ్యప్ప స్వామిని దర్శించుకుంటానన్నారు. మహబూబాబాద్ చేరుకున్న మహబూబ్ రెడ్డికి అయ్యప్ప స్వాములు ఘన స్వాగతం పలికారు.

కాలినడకన అమ్మాపురం టు శబరిమల

ఇవీ చూడండి: ఆర్టీసీ ఐకాస నేతల అత్యవసర భేటీ...

Intro:Body:Conclusion:

ABOUT THE AUTHOR

...view details