తెలంగాణ

telangana

Suspicious Death in Jagtial District : అక్క అనుమానాస్పద మృతి.. చెల్లి అదృశ్యం.. జగిత్యాల జిల్లాలో మిస్టరీ

By ETV Bharat Telangana Team

Published : Aug 30, 2023, 9:33 AM IST

Updated : Aug 30, 2023, 10:26 AM IST

Suspicious Death in Jagtial District : జగిత్యాల జిల్లాలో మిస్టరీ వ్యవహారం చోటుచేసుకుంది. తల్లిదండ్రులు లేని సమయంలో ఇంట్లో ఉన్న ఇద్దరు కుమార్తెల్లో ఒకరు మరణించారు. మరొకరు అదృశ్యమయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కనిపించకుండా పోయిన అమ్మాయిని వెతికే పనిలో ఉన్నారు. ఆమె దొరికితే కానీ అసలు ఏం జరిగిందో తెలియదు.

Suspicious Death
Suspicious Death in Jagtial District

Suspicious Death in Jagtial District :జగిత్యాల జిల్లాలో మిస్టరీ ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో తమ ఇద్దరు కుమార్తెల్లో ఒకరు మరణించగా.. మరొకరు అదృశ్యమయ్యారు. కోరుట్ల పట్టణంలోని భీమునిదుబ్బ ప్రాంతంలో సాఫ్ట్​వేర్ ఇంజినీరైన ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాగా ఆమె చెల్లెలు కనిపించకుండా పోవడంతో కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భీమునిదుబ్బ ప్రాంతంలో బంక శ్రీనివాస్​, మాధవి దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు దీప్తి (24), చందన, ఒక కుమారుడు సాయి. దీప్తి హైదరాబాద్​లో ఒక కంపెనీలో సాఫ్ట్​వేర్​​ ఉద్యోగినిగా ఏడాదిన్నర క్రితం చేరారు. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్​ హోం చేస్తున్నారు. చందన బీటెక్​ పూర్తి చేసి.. ఇంటి దగ్గరే ఉంటున్నారు. కుమారుడు సాయి బెంగళూరులో డిగ్రీ చదువుతున్నాడు. హైదరాబాద్​లో వాళ్ల బంధువుల గృహప్రవేశం ఉండడంతో శ్రీనివాస్​ రెడ్డి, మాధవి అక్కడికి వెళ్లారు.

Mystery Death in Jagtial District :సోమవారం రాత్రి 10 గంటలకు తల్లిదండ్రులిద్దరూ దీప్తి, చందనతో మాట్లాడారు. మంగళవారం మధ్యాహ్నం పెద్ద కుమార్తె దీప్తికి కాల్​ చేయగా లిఫ్ట్​ చేయలేదు. చందనకు ఫోన్​ చేస్తే స్విచ్​ ఆఫ్​ వచ్చింది. వెంటనే ఇంటి ముందున్న వారికి సమాచారనిచ్చారు. వారొచ్చి చూడగా దీప్తి మృతి చెంది ఉండడాన్నిగమనించారు. వెంటనే దీప్తి తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారమిచ్చారు. డీఎస్పీ రవీందర్‌రెడ్డి, కోరుట్ల, మెట్‌పల్లి సీఐలు ప్రవీణ్‌కుమార్‌, లక్ష్మీనారాయణ, ఎస్సై కిరణ్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతం చుట్టుపక్కలా అంత పరిశీలించారు.

Father suicide After Daughter Death in Khairatabad: కుమార్తె మరణం తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య

సీసీటీవీలో చిక్కిన దృశ్యాలు: దీప్తి మృతదేహం సోఫాలో పడి ఉంది. వంట గదిలో రెండు మద్యం సీసాలు, కూల్​డ్రింక్ బాటిల్​లు, తినుబండరాల ప్రాకెట్లు ఉన్నాయి. చందన ఎటు పోయింది అని పరిశీలించగా తను ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని తెలిసింది. తన ఆచూకీ కోసం పోలీసులు బస్టాండ్​లోని సీసీ కెమెరాలను పరిశీలించగా ఆమె, ఓ యువకుడు కలిసి ఉదయం 5.12 గంటల నుంచి 5.16 గంటల వరకు బస్​స్టేషన్​లో కాసేపు కూర్చుని, తర్వాత నిజామాబాద్​ బస్సులో ఎక్కినట్లు రికార్డు అయ్యింది. తండ్రి ఫిర్యాదు మేరకు దీప్తిది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. చందన, తనతో పాటు ఉన్న యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. ఇంట్లోకి మద్యం సీసాలు ఎలా వచ్చాయి..? ఎవరు తీసుకువచ్చారు..? ఇంకెవరైనా మద్యం తాగారా..? చందన ఎందుకు పారిపోయిందనే దానికి కారణాలు ఏంటీ అన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Suspicious Death in Jagtial District అక్క అనుమానాస్పద మృతి.. చెల్లి అదృశ్యం.. జగిత్యాల జిల్లాలో మిస్టరీ

'నీవు లేని లోకంలో ఉండలేను.. నీవెంటే నేను'.. ప్రియుడి మరణం తట్టుకోలేక..

ప్రేయసితో కలిసి హోటల్​కు వెళ్లిన యువకుడి అనుమానాస్పద మృతి

Last Updated :Aug 30, 2023, 10:26 AM IST

ABOUT THE AUTHOR

...view details