ETV Bharat / bharat

ప్రేయసితో కలిసి హోటల్​కు వెళ్లిన యువకుడి అనుమానాస్పద మృతి

author img

By

Published : Dec 29, 2022, 1:39 PM IST

దిల్లీలోని ఓ హోటల్​ గదిలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ప్రాథమిక విచారణలో ఇది ఆత్మహత్యగా తేలినప్పటికి అతను మృతి చెందిన విధానం పలు అనుమానాలకు దారి తీస్తోందని పోలీసులు తెలిపారు. మరోవైపు పోలీస్​ స్టేషన్​లో కంప్లైంట్​ ఇచ్చారని ఓ కుటుంబాన్ని గ్రామస్థులు వెలివేశారు.

suspicious-death-of-young-man-in delhi
death

దిల్లీలోని ఓ హోటల్​లో ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మంగళవారం సాయంత్రం అతడి మృతదేహాన్ని గుర్తించిన హోటల్​ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్న పోలీసులు హోటల్​ సిబ్బందిని విచారించారు. శవ పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు.

అసలు ఏం జరిగిందంటే: దిల్లీ సాహిబాబాద్​లోని ఓ హోటల్​ సిబ్బందికి మంగళవారం ఓ యువకుడి మృతదేహం కనిపించింది. షాకయిన యాజమాన్యం ఈ సమాచారాన్ని పోలీసుకు తెలియజేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుడి వివరాలను సేకరించారు. ప్రాథమిక విచారణలో ఇది ఆత్మహత్యగా పోలీసులు అనుమానిస్తున్నప్పటికీ మరింత సమాచారం శవ పరీక్ష నివేదిక​ వచ్చాకే తెలుస్తుందని అన్నారు. ఈ వ్యక్తిని దిల్లీకి చెందిన కైలాశ్​గా పోలీసులు గుర్తించారు.

మంగళవారం ఓ మహిళను హోటల్​కు వెంటబెట్టుకు వచ్చాడని.. కొద్దిసేపటికి వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని.. సాయంత్రానికి కైలాశ్​ మృతదేహం గదిలో కనిపించిందని విచారణలో తేలింది. కైలాశ్​తో పాటు వచ్చిన ఆ మహిళను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు పోలీసులు.​​ ఇదే తరహా ఘటన మురాద్​ నగర్​లో సోమవారం జరిగింది. ఇక్కడ కూడా ఓ వ్యక్తి తన ప్రేయసిని హోటల్​ రూమ్​కు తీసుకుని వచ్చాడు. అయితే వారిద్దరి మధ్య జరిగిన వాగ్వాదంలో ఆ వ్యక్తి తన ప్రేయసి గొంతు నులుమి హత్య చేశాడు.

ఫిర్యాదు చేశారని గ్రామ బహిష్కరణ..
మహారాష్ట్ర ముంబయిలోని బోరివలి షింపోలీ గ్రామంలో ఓ కుటుంబాన్ని ఊరు నుంచి బహిష్కరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులకు ఇచ్చిన ఓ ఫిర్యాదును ఆ కుటుంబసభ్యులు వెనక్కి తీసుకోనందున ఆ ఊరిలోని పెద్దలు ఈ తీర్మానాన్ని చేసినట్లు బాధితులు వాపోతున్నారు. అయితే ఇది చట్టవిరుద్ధమని.. తీర్మానం ఇచ్చిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. షింపోలి గ్రామానికి చెందిన ఓ మహిళ అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై వేధింపులతో పాటు ఇతర ఆరోపణల విషయమై ఏప్రిల్ 16న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఏప్రిల్ 22న ఊరి పెద్దలందరూ కలసి ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఫిర్యాదు ఉపసంహరించుకోవాలని బాధితురాలి కుటంబసభ్యులపై ఒత్తిడి తెచ్చారు. వారు ఎట్టి పరిస్థితిలో కేసు వాపసు తీసుకునేది లేదని తేల్చి చెప్పారు.

ఆగ్రహించిన గ్రామ పెద్దలు మే నెలలో వారిని బహిష్కరించేందుకు ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు. ఈ విషయాన్ని కుటుంబానికి ఓ లేఖ ద్వారా తెలియజేశారు. అప్పటి నుంచి ఊరిలో ఎటువంటి ఉత్సవాలు జరిగినా వారిని రానిచ్చేవారు కాదు. ఇలా అన్నింటిలోనూ వారిని దూరం పెట్టడాన్ని చట్ట విరుద్దమని భావించిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

క్యాబ్​ ఎక్కిన యువతిపై సాముహిక అత్యాచారం..
ఇంటికి వెళ్లేందుకు క్యాబ్​ ఎక్కిన ఓ యువతిపై ఆ క్యాబ్​ డ్రైవర్ దారుణానికి ఒడిగట్టాడు. తనతో పాటు మరో ​ఇద్దరు వ్యక్తులును వెంటబెట్టుకొచ్చి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని నొయిడాలో వెలుగు చూసింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు.

నొయిడా నుంచి ఔరాయియాలోని తన ఇంటికి వెళ్లడం కోసం ఓ యువతి బుధవారం రాత్రి సుమారు 8:30 సమయంలో ఓ షేర్​ క్యాబ్​ ఎక్కింది. క్యాబ్​లోని ఇతర ప్యాసింజర్లను దింపిన ట్యాక్సీ డ్రైవర్​ ఇక ఆ యువతి ఒంటరిగా ఉంటుందని నిర్ధరించుకుని తన స్నేహితులతో పాటు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమె తప్పించుకుంటుందని భావించి ఇత్మద్​పుర్​ వద్ద ఫిరోజాబాద్​కు వెళ్లే మరో ఆటోలో ఎక్కించారు. వారి చెర నుంచి ఎలాగోలా తప్పించుకున్న యువతి పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు యువతి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.