ETV Bharat / state

Father suicide After Daughter Death in Khairatabad: కుమార్తె మరణం తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 28, 2023, 8:11 PM IST

Updated : Aug 28, 2023, 10:39 PM IST

Father suicide Daughter Death Khairatabad: కూలీ నాలీ చేసుకుంటూ బతుకు బండిని వెళ్లదీస్తున్న తల్లిదండ్రులిద్దరికు ఆ పాపంటే పంచప్రాణాలు. ఎలాగోలా ఉన్నంతలో ఆనందంగా జీవిస్తున్న వారికి ఊపిరితిత్తుల సమస్యతో పాప ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టిందనే వార్త తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ బాధ తట్టుకోలేక ఆ తండ్రి ఏం చేశాడంటే..

Father commits suicide due to death of baby
father suicide due to daughter death in khairatabad

Baby Father commits Suicide Khairatabad: ఇంట్లో బుడిబుడి నడకలతో, ముద్దుముద్దు మాటలతో తమ కళ్లెదుటే మహాలక్ష్మిలా తిరుగుతుంటే ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు.. కానీ వారి ఆనందం ఎంతోకాలం నిలువలేదు. అనారోగ్యం రూపంలో వచ్చిన మాయావి ఆ పసిపాపను ఈలోకం నుంచి శాశ్వతంగా తీసుకుపోయింది. పాప మరణం ఆమె తండ్రిని తీవ్రంగా కలచివేసింది. కూతురు ఇకలేదని తెలుసుకొని ఓ తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్​లో జరిగింది.

పోలీసులు, స్థానికులు అందించిన సమాచారం ప్రకారం మృతుడు కిషోర్ ఖైరతాబాద్​లో నివాసం ఉంటున్నాడు. ఆయనకు ఆరాధ్య అనే ఓ ఐదేళ్ల పాప ఉంది. ఆ పసితల్లిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. బుడిబుడి అడుగులతో, తమ కుమార్తె వచ్చిరాని మాటలకు ఆ తల్లిదండ్రులు ఎంతో ఆనందపడ్డారు. కాని విధి ఆడిన ఆట వారికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఆరాధ్యకు ఊపిరితిత్తుల సమస్య వచ్చింది. రెండు నెలల నుంచి అనారోగ్యంతో ఇబ్బంది పడుతోంది. ఎన్నిఆసుపత్రులు తిప్పినా ఫలితం లేకపోయింది. అనారోగ్యంతో పోరాడుతూ ఆ పసిపాప రెండురోజుల క్రితం శాశ్వత నిద్రలోకి జారుకొంది.

Father killed his daughter at Chandanagar : భార్యపై కోపం.. సొంత కుమార్తెను బ్లేడ్​తో కోసి హత్య చేసిన తండ్రి

Father Commits Suicide due to Death of Baby : తమ గారాల పట్టి ఇక రాదని తెలుసుకొని ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. తన చేతుల్లో అల్లారుముద్దుగా పెరిగిన తన ప్రాణానికి ప్రాణంగా భావించే కన్న కూతురు మరణం ఆ తండ్రిని తీవ్రంగా మానసిక క్షోభకు గురిచేసింది. కూతురు మరణాన్ని జీర్ణించుకోలేని ఆ పసిపాప తండ్రి కిషోర్ ఖైరతాబాద్​లోని రైలు పట్టాలపై అదే రోజు రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఖైరతాబాద్​లోని ఆయన నివాసం వద్ద విషాద చాయలు అలుముకున్నాయి.

పసిపాప మరణంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉన్న అందరి గుండెలు బరువెక్కాయి. ఓవైపు కుమార్తెను, మరోవైపు భర్తను పోగొట్టుకున్న ఆ తల్లి గుండెలు విలపించేలా ఎంత ఏడ్చినా ఫలితం లేకపోయింది. రెక్కాడితే గానీ డొక్కాడని స్థితిలో ఉన్న తల్లిదండ్రలకు ఈ విధంగా కష్టం రావడం అందరినీ కలచివేస్తోంది. పాప మృతితో కాలనీవాసులు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కిషోర్ ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసుకున్న నాంపల్లి రైల్వే పోలీసులు... మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి పోస్ట్​మార్టం నిమిత్తం తరలించారు.

10th Class Girl Suicide in Nizamabad : పదో తరగతి బాలిక ఆత్మహత్య.. ప్రేమించి మోసపోయానంటూ సూసైడ్ నోట్

Father killed his daughter at Chandanagar : భార్యపై కోపం.. సొంత కుమార్తెను బ్లేడ్​తో కోసి హత్య చేసిన తండ్రి

Selfie Suicide Video : కుటుంబ కలహాలతో ఓ యువకుడు.. సెల్ఫీ తీసుకుని మరీ ఆత్మహత్య!

Last Updated :Aug 28, 2023, 10:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.