తెలంగాణ

telangana

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు - ఉత్తర ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు

By ETV Bharat Telangana Team

Published : Dec 23, 2023, 10:24 AM IST

Updated : Dec 23, 2023, 11:15 AM IST

Vaikunta Ekadashi 2023 : తెలంగాణ వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేకువజామునుంచే ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. గోవింద నామస్మరణతో వైష్ణవ ఆలయాలు మారుమోగాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు.

Vaikuntha Ekadashi 2023
Vaikuntha Ekadashi 2023

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

Vaikunta Ekadashi 2023 :రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే వైష్ణవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. గోవింద నామస్మరణతో దేవాలయాలు మారుమోగాయి. దీంతో ఆ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక సందడి కనిపించింది. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తి స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు.

Mukkoti Ekadashi celebrations in Telangana : యాదాద్రిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భక్తులకు ఉత్తర ద్వారం (Vaikunta Ekadashi 2023) గుండా దర్శనమిచ్చారు. ఉదయం 6:42 గంటల నుంచి ఉదయం 8:00 గంటల వరకు స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. నరసింహ నామస్మరణతో ఆలయ తిరువీధులు మారుమోగాయి. స్వామి వారిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao), ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

తెలంగాణలో వైకుంఠ వైభవం.. పారవశ్యంలో భక్తజనం

భద్రాద్రిలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు :భద్రాద్రి రామయ్య సన్నిధిలో వైకుంఠ ఏకాదశి (Mukkoti Ekadashi ) వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీతాసమేతుడైన శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడితో కలిసి భక్తులకు దర్శనం ఇచ్చారు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలు, భక్తుల కోలాహల సందడి నడుమ ఉత్తర ద్వార దర్శనం వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని వరంగల్‌లోని వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తారు. గోవింద నామ స్మరణతో ఆలయాలు మారుమోగాయి.

గోవింద నామ స్మరణతో మారుమోగిన ఆలయాలు :వరంగల్‌ బాలనగర్ వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారం గుండా భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కాశీబుగ్గలోని రంగనాయక స్వామివారికి వివిధ సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని వివిధ రకాల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. నగరంలోని గీతా భవన్‌లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు.

భద్రాద్రిలో ఘనంగా వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ప్రారంభం

జగిత్యాల జిల్లాలోని ధర్మపురి లక్ష్మీనరసింహ ఆలయం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. తెల్లవారుజామున 2:30 గంటలకు స్వామివారి మూలవిరాట్లకు అర్చకులు మాహా క్షీరాభిషేకం చేశారు. కరీంనగర్ జిల్లాలోని చిన్న ముల్కనూరు శ్రీ వెంకటేశ్వర స్వామిని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

హైదరాబాద్‌లోనూ వైకుంఠ ఏకాదశి శోభ కనిపించింది. వనస్థలిపురంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహించారు. ఉత్తర ద్వార గుండా భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. కూకట్‌పల్లిలోని పలు వైష్ణవాలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. జియాగూడలోని ప్రసిద్ధ రంగనాథ స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. స్వామివారిని ఉత్తర ద్వారం గుండా భక్తులు దర్శనం చేసుకున్నారు. నల్గొండ జిల్లా రామగిరిలోని రామాలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. గోవింద నామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.

Vaikuntha Ekadashi: వైకుంఠ ఏకాదశి పర్వదినాన వైష్ణవ ఆలయాల్లో రద్దీ

Vaikuntha Ekadashi celebrations 2022 : తెలంగాణలో వైకుంఠ ఏకాదశి వైభోగం

Last Updated : Dec 23, 2023, 11:15 AM IST

ABOUT THE AUTHOR

...view details