భద్రాద్రిలో ఘనంగా వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ప్రారంభం

By ETV Bharat Telangana Team

Published : Dec 13, 2023, 4:41 PM IST

thumbnail

Bhadrachalam Vaikunta Ekadasi 2023 : భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామివారు రోజుకొక అవతారంలో వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ మొదటి రోజు స్వామివారు మత్స్యావతారం భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ అవతారంలో ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. శ్రీమహావిష్ణువు ధరించిన అవతారాలలో మొట్టమొదటి అవతారం మత్స్యావతారం. కాగా ఈ అవతారానికి సంబంధించి రెండు గాథలు పురాణాల్లో ఉన్నాయి.

Vaikunta Ekadasi celebrations At Bhadrachalam 2023 :  ఒకటి జ్ఞాననిధులైన వేదాలను బ్రహ్మా నుంచి అపహరించి సముద్రంలో దాగి ఉన్న సోమకాసురుని సంహరించడానికై మత్స్యావతారం ధరించి వేదాలను రక్షించాడని, రెండోది జలప్రళయం నుండి నావలో ఉన్న వైవస్వత మునువును, సప్త ఋషులను మరియు సృష్టికి అవసరమైన సకల జీవరాశులను మత్స్య అవతారంలో శ్రీమహావిష్ణువు రక్షించాడని ఆలయ పురోహితులు తెలిపారు. ఈ అవతారంలో స్వామివారిని పూజించుటం వలన కేతు గ్రహ బాధలు తొలగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఉదయం బేడ మండపం వద్ద ఉన్న భక్తులకు దర్శనం ఇచ్చిన స్వామివారు మహా నివేదన అనంతరం తిరువీధులలో ఊరేగింపుగా బయలుదేరారు. కోలాటం నృత్యాలు మంగళ వాయిద్యాలు వేదమంత్రాలు నడుమ తిరువీధులలో విహరించిన స్వామి వారు అనంతరం మిథిలా స్టేడియం వద్ద ఉన్న భక్తులకు దర్శనం ఇస్తారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.