తెలంగాణ

telangana

Revanth reddy on kcr: 'సాగు చట్టాల రద్దు కేసీఆర్ ఘనతగా చెప్పడం.. రైతులను అవమానించడమే'

By

Published : Nov 19, 2021, 12:23 PM IST

Updated : Nov 19, 2021, 12:52 PM IST

సాగు చట్టాల రద్దు ప్రకటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth on farm laws) స్పందించారు. ఇది రైతుల విజయమని కొనియాడారు. పార్లమెంట్‌లో సాగు చట్టాలకు అనుకూలంగా కేసీఆర్‌ ఓటేశారన్న రేవంత్... కేసీఆర్ ఘనతగా(Revanth reddy on kcr) చెప్పడం రైతులను అవమానించడమేనని ఆరోపించారు.

Revanth reddy on kcr, farm laws repeal announcement
సాగు చట్టాల రద్దుపై రేవంత్ రెడ్డి, సీఎం కేసీఆర్​పై రేవంత్ రెడ్డి

ఉత్తరప్రదేశ్ లో ఓడిపోతున్నామనే భయంతో సాగుచట్టాలను మోదీ సర్కార్ వెనక్కి తీసుకుందని...(three farm laws 2020) ఇదే పని ముందే చేస్తే వందలాది రైతులు ప్రాణాలు కోల్పోయేవారు కాదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి((Revanth on farm laws) ) తెలిపారు. అన్నదాతల మరణాలకు కారణమైన మోదీని ఎవరు క్షమించబోరని చెప్పారు. ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా రైతుల సంకల్పం ముందు తునాతునకలయ్యాయని రేవంత్ తెలిపారు. దీనిని తన గొప్పతనంగా కేసీఆర్ చెప్పుకోవటం రైతులను అవమానించటమేనన్నారు. దేశానికి వెన్నెముకైన రైతు కన్నెర్ర చేస్తే ఎంతటి నియంతైనా దిగిరాక తప్పదనేందుకు ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు. రైతుల పోరాట చరిత్రలో ఇదొక చారిత్రక విజయంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

ఆ భయంతోనే నల్లచట్టాలు వెనక్కి..

దేశంలో ఇతర ప్రజా సమస్యలపై పోరాటానికి రైతు ఉద్యమం స్ఫూర్తినిచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. మొదట నుంచి రైతు ఉద్యమాలకు మద్దతునిస్తూ... రైతులకు అండగా కాంగ్రెస్(congress on farm laws) నిలబడిందని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ శ్రేణుల అండతోనే ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు రైతులు నరేంద్ర మోదీ ప్రభుత్వంపై పోరాటం చేశారన్నారు. రాష్ట్రంలో తాను కూడా అచ్చంపేట నుంచి హైదరాబాద్‌ వరకు నల్లచట్టాలకు(Farm laws India Explained) వ్యతిరేకంగా పాదయాత్ర చేసి... రైతులకు అండగా నిలిచానని గుర్తు చేశారు.

కేంద్రం మెడలు వంచి..

దిల్లీ సరిహద్దుల్లో రైతులు అకుంఠిత దీక్షతో చేసిన పోరాటం.. ప్రభుత్వం మెడలు వంచి నల్లచట్టాలు వెనక్కి తీసుకునేలా చేసిందన్నారు. దేశ సరిహద్దుల్లో సైన్యం ఎలా పోరాటం చేస్తుందో...రైతులు కూడా అదే స్ఫూర్తితో ఉద్యమం చేశారని కొనియాడారు. పార్లమెంటులో చట్టానికి అనుకూలంగా సీఎం కేసీఆర్‌ ఓటేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శాసన సభలో చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసే ధైర్యం లేదన్నారు. కానీ క్రెడిట్ తనదని సీఎం కేసీఆర్(Revanth reddy on kcr) అంటుండడం...రైతులను అవమానించడమే అవుతుందని ధ్వజమెత్తారు. ఇందిరా గాంధీ పుట్టిన రోజునే(indira gandhi jayanti) నల్ల చట్టాలు రద్దుతో రైతులు విజయం సాధించారన్నారు. నల్లవ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవడంపై దేశ రైతులకు రేవంత్‌ రెడ్డి అభినందనలు తెలిపారు.

కాంగ్రెస్ నేతల హర్షం

నల్ల చట్టాల విషయంలో ప్రధాన మంత్రి మోదీ(pm modi news) దిగివచ్చి... రైతు చట్టాలను రద్దు చేయడం శుభపరిణామమని కాంగ్రెస్‌ నేతలు పేర్కొన్నారు. ఏ కారణంతో రైతు చట్టాలు రద్దు చేశారో తెలియదు కానీ ఆయన మంచి నిర్ణయం తీసుకున్నారని పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ చిన్నా రెడ్డి, పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లురవి అన్నారు. హరియాణా, యూపీ, పంజాబ్ రైతులు దాదాపు ఏడాది నుంచి ఆందోళనలు చేస్తున్నారని... కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ మొదటి నుంచి అన్నదాతలకు మద్దతుగా నిలబడ్డారన్నారు. అదానీ, అంబానీల కోసమే నల్ల చట్టాలు తీసుకొచ్చారని ఆరోపించిన నేతలు... రైతులకు ఎంత సాయం చేసిన తక్కువేనని వ్యాఖ్యానించారు. ఇందిరా గాంధీ పుట్టిన రోజునే...నల్ల చట్టాలు రద్దు కావడంతో ఎంతో సంతోషంగా ఉందన్నారు.

ఇందిరా గాంధీ జన్మదినం సందర్భంగా రైతుల పోరాటం విజయం సాధించడం వల్ల కాంగ్రెస్ పార్టీ దేశప్రజలందరికీ అభినందనలు తెలియజేస్తోంది. ప్రజాస్వామ్యంలో ఎవరూ బలవంతులు కారు. ప్రజలే బలవంతులు. బలవంతులం అని కుర్చీలో కూర్చొని విర్రవీగేవాళ్లకు ఈ దేశ రైతాంగం గుణపాఠం చెప్పింది. ఈ రైతు ఉద్యమాలకు అనుకూలంగా, ఈ రైతు ఉద్యమాలను మద్దతిస్తూ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడ్డది. కాంగ్రెస్ శ్రేణుల అండతోటి ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు రైతులు ఈ ప్రభుత్వం మీద పోరాటం చేశారు. ఉత్తరప్రదేశ్​లో అధికారం కోల్పోతామన్న దు:ఖం తోటి ఈ చట్టాలను వెనక్కు తీసుకున్నారు. ఇదే వెనక్కు తీసుకుంటే వందలాది మంది రైతుల ప్రాణాలు దక్కేవి. ఈ రైతు వ్యతిరేక నల్లచట్టాలను శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేయడం ద్వారా తిరస్కరించమని పదేపదే కేసీఆర్ మీద పోరాటం చేశాం. మా వాళ్లను ఎత్త బయటపడేసి... నరేంద్రమోదీకి అనుకూలంగా కేసీఆర్ వ్యవహరించారు.

-రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

నూతన సాగు చట్టాల రద్దుపై స్పందించిన రేవంత్‌రెడ్డి

ఇదీ చదవండి:KTR tweet today: పదవుల్లో ఉన్నవారి కంటే ప్రజల అధికారం గొప్పది: కేటీఆర్

Last Updated : Nov 19, 2021, 12:52 PM IST

ABOUT THE AUTHOR

...view details