తెలంగాణ

telangana

Corona cases in AP: ఏపీలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు

By

Published : Feb 7, 2022, 8:05 PM IST

Corona cases in AP: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 18,601 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 1,597 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ వల్ల నిన్న విశాఖపట్నంలో ఇద్దరు, చిత్తూరు, తూర్పుగోదావరి, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.
Corona cases in AP
ఏపీలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు

AP corona cases: ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 18,601 మందికి కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా 1,597కేసులు నమోదయ్యాయి. తాజాగా వైరస్ బారిన పడి మరో 8 మంది మృతిచెందారు. వైరస్ బారి నుంచి.. కొత్తగా 8,766 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 62,395 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

కొవిడ్‌ వల్ల నిన్న విశాఖపట్నంలో ఇద్దరు, చిత్తూరు, తూర్పుగోదావరి, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. అత్యధికంగా తూర్పుగోదావరిలో 478, కృష్ణాలో 220, గుంటూరులో 144, చిత్తూరులో 123, విజయనగరంలో 100 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఏపీలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు

Covid Cases in India: భారత్​లో కొవిడ్​ కేసులు క్రితం రోజుతో పోలిస్తే భారీగా తగ్గాయి. తొలిసారి లక్ష దిగువకు చేరుకున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు జరిపిన 11,56,363 పరీక్షల్లో 83,876 కొత్త కేసులు నమోదయ్యాయి. 895మంది మరణించారు. 1,99,054 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 7.25 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

యాక్టివ్​ కేసులు ప్రస్తుతం 2.62 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 96.19 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం మరణాలు: 5,02,874
  • యాక్టివ్ కేసులు: 11,08,938
  • మొత్తం కోలుకున్నవారు: 4,06,60,202

దేశంలో కొత్తగా 14,70,053 టీకా డోసులను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు మొత్తం 1,69,63,80,755 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

World Corona cases:ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ మహమ్మారి కాస్తా తగ్గుముఖం పట్టింది. కొత్తగా 18 లక్షల మందికి కరోనా సోకింది. 6 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 39.58 కోట్లు దాటింది. మరణాల సంఖ్య 57,58,393 కు పెరిగింది.

  • రష్యాలో కొత్తగా 1.80 లక్షల మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. 661 మంది మరణించారు.
  • ఫ్రాన్స్​లో కొవిడ్​ విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజే 1.55 లక్షలకు పైగా కొవిడ్​ కేసులు వెలుగు చూశాయి. మరో 129 మంది చనిపోయారు.
  • జర్మనీలో కొత్తగా 1.14 లక్షల మందికి వైరస్​ సోకగా.. 34 మంది చనిపోయారు.
  • జపాన్​లో తాజాగా 1.05 లక్షలకు పైగా కరోనా కేసులు బయటపడగా.. 126 మంది బలయ్యారు.
  • నెదర్లాండ్స్​లో ఒక్కరోజే దాదాపు 94 వేల మందికి వైరస్ సోకింది. మరో 9 మంది మృతి చెందారు.

ఇదీ చదవండి:

AP CM Jagan on Sambamurthy: 'సమతామూర్తి.. భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తి'

ABOUT THE AUTHOR

...view details