ETV Bharat / state

రైతు రుణమాఫీపై సర్కార్ కసరత్తు - నిధుల సమీకరణకు మార్గాల అన్వేషణ - TS Crop Loan Waiver Scheme 2024

author img

By ETV Bharat Telangana Team

Published : May 23, 2024, 7:14 AM IST

Rythu Runa Mafi in Telangana 2024 Updates : రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు కొనసాగుతోంది. ఎన్నికల హామీకి అనుగుణంగా రెండు లక్షల వరకు రైతుల రుణాలను మాఫీ చేసి తీరతామని సర్కార్ అంటోంది. రూ.30,000ల కోట్లకు పైగా అవసరమయ్యే ఈ ప్రక్రియ పూర్తికి తెలంగాణ ప్రభుత్వం వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. రైతు సంక్షేమ కార్పొరేషన్‌కు అన్నదాతల రుణాలను బదిలీ చేసుకోవాలన్నది ప్రధాన ఆలోచన. ఆ దిశగా ఇబ్బందులు ఎదురైతే అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా సర్కార్ దృష్టి సారించింది.

Rythu Runa Mafi in Telangana 2024 Updates
Rythu Runa Mafi in Telangana 2024 Updates (ETV Bharat)

రైతు రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు (ETV Bharat)

Telangana Govt Exercise for Crop Loan Waiver Scheme 2024 : తెలంగాణలోని రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి విముక్తి చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఆగస్ట్ 15 లోపు కర్షకుల రుణాలన్నీ మాఫీ చేస్తామని లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు.

2 Lakh Rythu Runa Mafi in Telangana 2024 : రాష్ట్రంలోని రైతులదంరికీ రెండు లక్షలల్లోపు రుణాలను మాఫీ చేయాలంటే రూ.30,000ల కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని అంచనా. ఈ దిశగా బ్యాంకర్లతో వ్యవసాయ, ఆర్థికశాఖ ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అంత పెద్ద మొత్తంలో ఒకేసారి నిధులు సమకూర్చడం తెలంగాణ సర్కార్‌కు చాలా క్లిష్టమైన పని. రైతు రుణమాఫీ కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక ఆలోచన.

రుణమాఫీకి ప్రత్యేక కార్పొరేషన్‌ : రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి రైతుల అప్పులను బదలాయించాలని భావిస్తున్నారు. రాష్ట్ర ఖజానాకు వివిధ రూపాల్లో ప్రతి నెలా వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని ఆ కార్పొరేషన్‌కు జమచేసి బ్యాంకులకు చెల్లింపులు చేయాలన్నది ప్రతిపాదన. అయితే ప్రస్తుత రిజర్వ్‌ బ్యాంకు నిబంధనలు అందుకు అంగీకరించకపోవచ్చన్న చర్చ జరుగుతోంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం మూలధనం కోసం ఖర్చు చేసి దానిపై ఆదాయం వచ్చే అవకాశం ఉంటేనే కార్పొరేషన్‌కు బ్యాంకులు పెద్దమొత్తం రుణం ఇచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఒకవేళ కార్పొరేషన్ల కింద తీసుకునే రుణాలను కూడా రుణపరిమితికి లోబడి తీసుకునే అప్పు కిందే కేంద్రం పరిగణిస్తోంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ సర్కార్ ఏం చేస్తుందన్నది చూడాలి.

ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం ఫోకస్‌ : కార్పొరేషన్ ద్వారా అవకాశం లేనట్లైతే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి అయినా సరే రుణమాఫీ అమలు చేయాలని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం వివిధ విధానాలను పరీశీలిస్తున్నట్లు తెలిసింది. అదనపు ఆదాయ వనరుల అన్వేషణపై రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే దృష్టి సారించింది. లీకేజీలను అరికట్టడంతో పాటు వివిధ మార్గాల ద్వారా ఖజానాకు ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై కసరత్తు చేస్తోంది. ఆ దిశగా పలు చర్యలను కూడా తీసుకుంటోంది.

వాటితో పాటు ఎల్ఆర్ఎస్‌ అమలు, భూముల అమ్మకం సహా ఇతరత్రా మార్గాల్లో కూడా ఆదాయాన్ని పెంచుకునే ప్రణాళికలను అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అవసరమైతే ఎఫ్ఆర్‌బీఎం పరిధికి లోబడి తీసుకునే రుణాలను వీలైనంత ఎక్కువగా తీసుకొని రుణమాఫీ చేసే అంశం కూడా ఒక ప్రత్యామ్నాయంగా ఉందని అంటున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రుణపరిమితికి లోబడి రూ.59,000ల కోట్లు అప్పుగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించింది.

Telangana Rythu Runa Mafi 2024 Updates : కేంద్ర ప్రభుత్వం అందులో మొదటి తొమ్మిది నెలల మొత్తంలో తీసుకునే రుణానికి సంబంధించి ఇప్పటికే అనుమతి ఇచ్చింది. ఆ మొత్తం రూ.33,000ల కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. అందులో ఇప్పటి వరకు తెలంగాణ సర్కార్ రూ.8000ల కోట్లు అప్పుగా తీసుకుంది. మిగిలిన రూ.25,000ల కోట్లలో కొంత మొత్తం లేదా పూర్తి మొత్తాన్నిదశల వారీగా తీసుకొవచ్చని అంటున్నారు. అదే జరిగితే ప్రభుత్వ ఇతర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు కొంత ఆటంకం కలుగుతుంది. అవసరమైతే గుత్తేదార్లు, ఇతర బిల్లుల చెల్లింపులను కొన్నాళ్ల పాటు ఆపి రైతు రుణమాఫీ చేసే ఆలోచన కూడా లేకపోలేదని చెప్తున్నారు.

రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందే : ఎట్టి పరిస్థితుల్లోనైనా రుణమాఫీ చేసి తీరాల్సిందేనన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయం మేరకు సర్కార్ వివిధ ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది. లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రుణమాఫీ విషయమై ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు చేసి విధానపర నిర్ణయానికి రానుంది.

అన్నదాతలకు గుడ్​న్యూస్ - రుణమాఫీపై కదలిక - అర్హుల జాబితా రూపకల్పనలో అధికారుల నిమగ్నం - 2 Lakh Rythu Runa Mafi

రూ.35 వేల కోట్లు ఎలా సమకూర్చుదాం - రుణమాఫీకి నిధుల సేకరణ కోసం మార్గాల అన్వేషణ - TS Crop Loan Waiver Scheme 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.