తెలంగాణ

telangana

రాష్ట్రంలో ఆధార్‌ లేని విద్యార్థులు 5 లక్షలు

By

Published : Jan 24, 2023, 10:20 AM IST

Aadhaar Card

Telangana Students' Aadhaar Card : తెలంగాణ వ్యాప్తంగా ఈ ఏడాది(2022-23) చదువుతున్న విద్యార్థుల్లో 5 లక్షల మందికి ఆధార్ సంఖ్య లేదు. ఈ క్రమంలో వచ్చే విద్యాసంవత్సరంలో నూరుశాతం ఆధార్‌ నమోదు చేయాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఆధార్‌ సమర్పించని 5 లక్షల మంది విద్యార్థుల్లో ప్రభుత్వ పాఠశాలల్లోని వారు 2 లక్షల మంది, ప్రైవేట్‌ స్కూళ్లలో మరో 3 లక్షల మంది ఉన్నారని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

Telangana Students' Aadhaar Card : రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుత విద్యాసంవత్సరం(2022-23)లో చదువుతున్న విద్యార్థుల్లో 5 లక్షల మందికి ఆధార్‌ సంఖ్య లేదు. రాష్ట్రంలోని 43,043 ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ పాఠశాలలు ఉండగా.. అందులో సుమారు 58 లక్షల మంది చదువుతున్నారు. ఈ క్రమంలో వచ్చే విద్యాసంవత్సరంలో నూరుశాతం ఆధార్‌ నమోదు చేయాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

Telangana Students without Aadhaar card : ఏటా పదో తరగతి విద్యార్థులు చదువు పూర్తయి వెళ్లిపోతున్నారు. ఒకటో తరగతిలో ఎక్కువమంది కొత్తగా ప్రవేశాలు పొందుతుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నవారూ పాఠశాలల్లో చేరతారు. ప్రతి విద్యాసంవత్సరం పాఠశాల విద్యాశాఖ చైల్డ్‌ ఇన్ఫో పేరిట పాఠశాలల వారీగా పిల్లల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తుంది.

విద్యార్థులు ఒకచోట నుంచి మరోచోటకు మారినా ట్రాకింగ్‌ చేసేందుకు ఆధార్‌ సంఖ్యను సేకరిస్తున్నారు. ఆధార్‌ సమర్పించని 5 లక్షల మంది విద్యార్థుల్లో ప్రభుత్వ పాఠశాలల్లోని వారు 2 లక్షల మంది, ప్రైవేట్‌ స్కూళ్లలో మరో 3 లక్షల మంది ఉన్నారని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ప్రైవేట్‌లో కొందరు విద్యార్థులకు ఆధార్‌ సంఖ్య ఉన్నా వాటిని ఇవ్వడం లేదని ఓ అధికారి తెలిపారు.

విద్యార్థుల చెంతకే ఆధార్‌ నమోదు కిట్లు.. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివే 6-10 తరగతుల విద్యార్థుల్లో 50 వేల మందికి ఆధార్‌ లేదు. దానికితోడు ఏప్రిల్‌ తర్వాత పరీక్షలు పూర్తయి పదో తరగతి విద్యార్థులు బయటకు వెళ్లిపోతారు. వారందరికీ మార్చినాటికి ఆధార్‌ సంఖ్యను ఇవ్వాలన్నది పాఠశాల విద్యాశాఖ లక్ష్యం. అందుకే 100 ఆధార్‌ నమోదు కిట్లను క్షేత్రస్థాయికి పంపామని అధికారి ఒకరు చెప్పారు.

ఎంఈఓ కార్యాలయా(మండల రీసోర్స్‌సెంటర్‌)ల్లో వాటిని ఉంచుతారు. వేలిముద్రలను అప్‌డేట్‌ చేయడంతో పాటు ఆధార్‌ లేని వారికి దాన్ని ఇస్తారు. విద్యార్థులందరికీ 2017 సెప్టెంబరు నాటికే ఆధార్‌ ఉండాలన్నది కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం. దాన్ని సాధించేందుకు 2018లో పాఠశాల విద్యాశాఖ ఆధార్‌ పరికరాలను సమకూర్చుకుంది. 2020-21, 2021-22 విద్యా సంవత్సరాల్లో కరోనా కారణంగా ఆధార్‌ నమోదు ఆగిపోయింది. వచ్చే విద్యాసంవత్సరంలో నూరుశాతం మందికి ఆధార్‌ సంఖ్య సాధించాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

ABOUT THE AUTHOR

...view details