సినీ ప్రముఖులతో నటించే అవకాశం కల్పిస్తామంటూ భారీ మోసం

author img

By

Published : Jan 24, 2023, 9:10 AM IST

cine frad

బాలీవుడ్ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించి విఫలమైన ఇద్దరు వ్యక్తులు.. సరికొత్త నేరాలకు తెరలేపారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రధాన నగరాల్లోని షాపింగ్ మాళ్లకు తల్లిదండ్రులతో వచ్చే చిన్నారులతో ర్యాంప్ వాక్‌లు చేయించి.. ప్రముఖ బ్రాండ్ల ప్రకటనల్లో అవకాశం ఇప్పిస్తామంటూ డబ్బులు కొల్లగొడుతున్నారు. ఈ దంపతుల్లి సైబరాబాద్​ క్రైమ్​ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామని చెప్పి మోసం

సినీనటులు, క్రికెటర్లతో ప్రకటనల్లో నటించే అవకాశం కల్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి దాదాపు రూ.15లక్షల60వేలు, నాలుగు స్మార్ట్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని పుణెకు చెందిన అపూర్వ అశ్విన్ దావా.. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో మాస్టర్స్ పూర్తి చేశాడు. దర్శకత్వం, నటనపై ఇష్టంతో 20 ఏళ్ల పాటు మోడలింగ్‌లో కొనసాగాడు. ప్రముఖనటులు, క్రికెటర్ల ప్రకటనల్లో నటించే అవకాశాలిప్పిస్తామంటూ భారీగా డబ్బు వసూలు చేస్తున్న దంపతుల్ని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

రెండు బాలీవుడ్ చిత్రాల్లోనూ నటించాడు. విలాస జీవితానికి అలవాటుపడి అప్పులు చేసినా సినిమాల్లో అవకాశాలు రాలేదు. అప్పుడే చిన్నారులకు మోడలింగ్ అవకాశాలు పేరుతో మోసాలను పాల్పడాలని నిర్ణయించుకున్నాడు. తనతోపాటు మోడలింగ్ రంగంలో ఉన్న నటాషా కపూర్ ను వివాహం చేసుకున్నాడు. ఇతనికి ఆమె అనేక నేరాల్లో సహాయం చేసింది. తన మోసాల కోసం కాస్మోపాలిటన్మోడల్ పేరుతో వెబ్‌సైట్‌ రూపొందించాడు. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఎక్కువ రద్దీగా ఉండే మాల్స్ మేనేజర్లతో మాట్లాడి చిన్నారులకు ర్యాంప్ వాక్‌లు నిర్వహించేవాడు. ఇలా చిన్నారులతో సహా షాపింగ్‌ మాల్‌కు వచ్చే తల్లిదండ్రులకు వల వేసి వీరిద్దరూ డబ్బులు దండుకునేవారు.

తల్లిదండ్రులకు వారం రోజుల తర్వాత నిందితురాలు నటాషా కపూర్ వాట్సాప్‌లో సంప్రదించి చిన్నారి యాడ్ ఫిల్మ్‌కు ఎంపికైందని, సినీనటులు, క్రికెటర్లతో నటించే అవకాశం వచ్చిందని చెబుతారు. ఆ తర్వాత అశ్విన్ మాట్లాడి ప్యాకేజీ ఛార్జీలు, దుస్తులు, మేకప్ సహా అనేక పేర్లతో డబ్బు వసూలు చేసి ఫోన్ స్విఛాప్ చేస్తాడు. ఇదే తరహాలో నగరంలోని మదీనగూడకు చెందిన చెందిన గోపాలకృష్ణన్ తన కూతురు జన్మదినం సందర్భంగా.. కొండాపూర్లో ఓ షాపింగ్ మాల్‌కు కుటుంబంతో కలిసి వెళ్లారు.

సినీనటి రష్మక మందనతో ఓ యాడ్‌లో నటించే అవకాశం కల్పిస్తామని అశ్విన్‌ నమ్మబలికాడు. ఇందుకోసం కాస్ట్యూమ్స్ పేరుతో రూ.3,25,000 డిపాజిట్ చేయించుకున్నాడు. ఆరు రోజుల్లో ఫోటో షూట్ ఉంటుందని చెప్పి దాదాపు రూ.15లక్షలు వేర్వేరు బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకున్నాడు. ఇదంతా మోసమని తెలుసుకున్న బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశారు. బాధితుల నుంచి వసూలు చేసే డబ్బును జమ చేసేందుకు నిందితుడు అశ్విన్ నగదు బదిలీ చేసే వ్యాపారుల సాయం తీసుకున్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. చిన్నారుల మోడలింగ్‌ పేరుతో భారీ ఎత్తున మోసాలకు పాల్పడి పట్టుబడకుండా తరచూ పేర్లు మార్చేవాడని తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.