తెలంగాణ

telangana

జీవో నంబర్ 317 సవరణకు ఉపాధ్యాయుల డిమాండ్.. ప్రగతి భవన్ ముట్టడి ఉద్రిక్తం

By

Published : Jan 22, 2023, 5:12 PM IST

Teachers protest
Teachers protest

Teachers Protest in Pragathi Bhavan: హైదరాబాద్‌లో ప్రగతి భవన్ ముట్టడికి ఉపాధ్యాయులు యత్నించారు. టీచర్లుగా పని చేస్తున్న భార్యాభర్తలిద్దరినీ ఒకే జిల్లాకు బదిలీ చేయాలంటూ ధర్నా చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిగణలోకి తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్టేషన్‌కు తరలించారు.

ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన ఉపాధ్యాయులు.. పలువురి అరెస్ట్

Teachers Protest in Pragathi Bhavan: భార్యాభర్తల బదిలీలపై ఉపాధ్యాయులు మరోమారు రోడ్డెక్కారు. జీవో నంబర్ 317ను సవరించి.. ఎవరి స్థానిక జిల్లాకు వారిని కేటాయించాలని డిమాండ్ చేస్తూ చిన్నారులతో కలిసి ప్రగతిభవన్ ముట్టడికి యత్నించారు. దీంతో ట్రాఫిక్ జామ్ కావడంతో పాటు.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఫలితంగా ఉపాధ్యాయ దంపతులను పోలీసులు.. అదుపులోకి తీసుకొని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

జీవో 317 వల్ల నరకం అనుభవిస్తున్నాం: గోషామహల్ మైదానంలో బాధిత ఉపాధ్యాయులు చిన్నారులతో కలిసి ఆందోళన కొనసాగిస్తున్నారు. జీవో వల్ల పడుతున్న బాధను ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పుకునేందుకు ప్రగతి భవన్​కు వెళితే.. పోలీసులు తమను, తమ పిల్లలను కూడా చూడకుండా దౌర్జన్యంగా అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో317 వల్ల నరకం అనుభవిస్తున్నామని వాపోయారు. ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు స్థానికత చూశారని... కానీ ఇప్పుడెందుకు చూడటం లేదని ప్రశ్నించారు.

టీచర్లల యూనియన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది: తాము చదివింది ఒక జిల్లా.. ఉద్యోగం వందల కిలోమీటర్ల దూరమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ప్రతి రోజు అంత దూరం ప్రయాణం చేయడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నామని వివరించారు. ఈ చీకటి జీవోను వెంటనే రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై టీచర్ల యూనియన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సీనియర్లను ఓ విధంగా.. జూనియర్లను మరో విధంగా చూస్తున్నారని మండిపడ్డారు. తాము చదివింది, నివసిస్తుంది ఒక​ జిల్లాలో.. మరొక జిల్లాకు బదిలీ చేస్తే స్థానికతను కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్థానికత ఆధారంగా బదిలీలు చేయాలని సీఎం కేసీఆర్​ను కోరారు.

"317 జీవోను రద్దు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు వెళ్లి ఎలా ఉద్యోగం చేయగలం. స్థానికత ఆధారంగా బదిలీలు చేయాలి. ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు స్థానికత చూశారు. కానీ ఇప్పుడెందుకు చూడటం లేదు. మేం చదివింది, నివసిస్తుంది ఒక​ జిల్లాలో.. మరొక జిల్లాకు బదిలీ చేస్తే మేం స్థానికతను కోల్పోతాం. ప్రభుత్వ​ నిర్ణయంతో మేం మానసిక వేదనకు గురవతున్నాం." - ఉపాధ్యాయులు

ఉపాధ్యాయ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటి నుంచి ఆందోళనలు పెరుగుతున్నాయి. నిన్న భార్య భర్తలు ఒకే చోట పని చేసేలా బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. ఉపాద్యాయ దంపతులు చేపట్టారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు చేపట్టిన ఈ ఆందోళన కూడా రణరంగంగా మారింది. మౌన దీక్ష చేపట్టిన ఉపాధ్యాయ స్పౌస్ ఫోరమ్ ఉపాధ్యాయులను, వారి పిల్లలను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇవీ చదవండి:భార్యాభర్తలు ఒకే చోట పని చేసేలా బదిలీలకు డిమాండ్ రణరంగంగా మారిన ఆందోళన

మీ వివాహ బంధాన్ని హ్యాపీగా ఉంచాలనుకుంటున్నారా.. అయితే ఓకోర్సు ఉంది.!

సీఎంకు రాత్రి 2 గంటలకు స్టార్ హీరో ఫోన్​.. షారుక్​ ఎవరో తెలియదన్న కొద్ది గంటలకే..

ABOUT THE AUTHOR

...view details