తెలంగాణ

telangana

'సికింద్రాబాద్‌ విధ్వంసం కేసులో పోలీసుల అదుపులో మరో ఏడుగురు'

By

Published : Jun 25, 2022, 7:20 AM IST

Secunderabad riots case update: అగ్నిపథ్‌ ప్రకటనకు నిరసనగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జూన్‌ 17న జరిగిన విధ్వంసం కేసులో సూత్రధారిగా వ్యవహరించిన ఆవుల సుబ్బారావు అరెస్టు ఆలస్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ కేసులో మరో ఏడుగురు నిందితులను ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.

Secunderabad riots case update
Secunderabad riots case update

Secunderabad riots case update: అగ్నిపథ్‌ ప్రకటనకు నిరసనగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జూన్‌ 17న జరిగిన విధ్వంసం కేసులో సూత్రధారిగా వ్యవహరించిన ఆవుల సుబ్బారావు అరెస్టు ఆలస్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ కేసులో మరో ఏడుగురు నిందితులను ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం రైల్వే పోలీసులకు అప్పగించారు. ఈ ఏడుగురు సుబ్బారావు అనుచరులేనని రైల్వే పోలీసులు ఆధారాలు సేకరించారు. అంతకుముందు సుబ్బారావుతో సహా ఎనిమిది మందిని గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించి రైల్వే పోలీస్​స్టేషన్​కు తరలించారు. తాజాగా ఆదుపులోకి తీసుకున్న వారిని కూడా విచారించిన తర్వాత సుబ్బారావును న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

సుబ్బారావు నేరం చేశాడన్న ఆధారాల్లేవు.. న్యాయవాది: సికింద్రాబాద్‌ విధ్వంసం కేసులో ఆవుల సుబ్బారావు ప్రత్యక్షంగా పాల్గొన్నాడనే ఆధారాల్లేవని ఆయన తరఫు న్యాయవాది అన్నారు. శాంతియుతంగా నిరసన తెలపాలనే ఆయన ఆర్మీ అభ్యర్థులకు సూచించాడని తెలిపారు. 17వతేదీ సుబ్బారావు సికింద్రాబాద్‌లో లేడని, బోడుప్పల్‌లోని సాయి డిఫెన్స్‌ అకాడమీలో ఉన్నాడని చెప్పారు. సుబ్బారావు నేరానికి పాల్పడినట్టు ఆధారాలు లేకపోవడం వల్లనే పోలీసులు ఇన్ని రోజులు అదుపులో ఉంచుకున్నారన్నారు.

ABOUT THE AUTHOR

...view details