తెలంగాణ

telangana

బాలయ్య ఫ్లెక్సీలో వైసీపీ ఎమ్మెల్యే.. జనం షాక్​

By

Published : Jan 12, 2023, 10:43 PM IST

MLA VASANTHA KRISHNA PRASAD FLEXI : ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఏపీలోని మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. జి.కొండూరు మండలం వెలగరేలులో బాలకృష్ణ అభిమానుల పేరుతో ఫ్లెక్సీలు కట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఫ్లెక్సీలో సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, వసంత కృష్ణప్రసాద్ ఫొటోలు మాత్రమే ఉన్నాయి. ఎక్కడా వైసీపీ రంగు కానీ, సీఎం జగన్ ఫొటో లేకపోవడంతో దుమారం రేగుతోంది. బాలకృష్ణ-వసంత ఫొటోల ఫ్లెక్సీలతో వైసీపీలో అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

FLEXI
FLEXI

MLA VASANTHA KRISHNA PRASAD FLEXI : సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్​లోని ఎన్టీఆర్​ జిల్లా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఉన్న ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎమ్మెల్యే వసంత ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ వీరసింహారెడ్డి సినిమా విడుదల సందర్భంగా వెలగలేరులో బాలకృష్ణ అభిమానుల పేరుతో ఫ్లెక్సీలు కట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఫ్లెక్సీలో సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, వసంత కృష్ణప్రసాద్ ఫొటోలు మాత్రమే ఉన్నాయి. ఎక్కడా వైసీపీ రంగు కానీ, సీఎం జగన్ ఫొటో లేకపోవడంతో దుమారం రేగుతోంది. బాలకృష్ణ-వసంత ఫొటోల ఫ్లెక్సీలతో వైసీపీలో అంతర్గతంగా ఆసక్తికర చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

ఇటీవల సొంత పార్టీపై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వ్యవహారంతో వసంత ఎటు వెళ్లనున్నారో చెప్పకనే చెపుతున్నట్లు సమాచారం. అయితే ఫ్లెక్సీల ఏర్పాటుతో వసంత సొంత పార్టీని వీడనున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవలే మైలవరం మండలం చంద్రాల సొసైటీ శంకుస్థాపన సభలో కృష్ణప్రసాద్ చేసిన వ్యాఖ్యలు.. ఈ ఫ్లెక్సీల ఏర్పాటు అంశానికి బలం చేకూరినట్లైంది.

తాను ఇంకా పాత తరం నాయకుడిగానే ఉన్నట్లు చెప్పిన వసంత.. పది మంది రౌడీలను వెంటేసుకుని తిరగడం చేతకాకనే ఇలా ఉన్నట్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ కుటుంబం గత 55 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉందన్న వసంత.. అప్పటి, ఇప్పటి రాజకీయాల్లో చాలా మార్పులు జరిగాయని పేర్కొన్నారు. ఒక్కోసారి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా అని బాధపడుతున్నానని చెప్పడం కూడా పలు రూమర్లకు తావిస్తోంది. అయితే వసంత చేసిన అసంతృప్తి వ్యాఖ్యలతో వైసీపీ అధిష్ఠానం అప్రమత్తమైనట్లు సమాచారం.

ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తో పలువురు వైసీపీ నేతలు సమావేశమైనట్లు తెలుస్తోంది. ఆ సమావేశంలో మైలవరంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ మైలవరం ఎమ్మెల్యే వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితోనే ఉన్నట్లు సమాచారం. అయితే కొన్ని రోజుల క్రితం ఎమ్మెల్యే వసంత తండ్రి, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు సైతం వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తి వెళ్లగక్కారు. ఎన్టీఆర్​ హెల్త్​ యూనివర్శిటీ పేరు మార్పు ఆయన తప్పుబట్టారు.

అయితే తండ్రి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్యే.. ఆ వ్యాఖ్యలకు తనకు ఎలాంటి సంబంధం లేదని కుండబద్ధలు కొట్టారు. కానీ అలా చేసిన కొన్ని రోజులకే తన సొంత ప్రభుత్వంపై అసంతృప్తి వ్యాఖ్యలు చేయడంతో.. ఈ కొన్ని రోజుల వ్యవధిలో ఏం జరిగిందనే అంశం కూడా చర్చనీయాంశం అవుతోంది. అయితే ఫ్లెక్సీల ఏర్పాటు అంశంపై ఎమ్మెల్యే వసంత స్పందించేంత వరకు దీనిపై చర్చలు జరుగుతూనే ఉంటాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details