తెలంగాణ

telangana

KTR On Sultanpur Medical Devices Park : 'మెడ్‌టెక్ రంగంలో మరో మైలురాయిని తెలంగాణ అధిగమించింది'

By

Published : Jul 4, 2023, 8:48 PM IST

KTR launched medical products : మెడ్‌టెక్ రంగంలో మరో మైలురాయిని తెలంగాణ అధిగమించిందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని సుల్తాన్‌పూర్ మెడికల్ డివైజెస్ పార్కులో తయారైన వినూత్న ఉత్పత్తులను మంత్రి ప్రారంభించారు. హూవెల్ లైఫ్ సైన్సెస్, ఈఎంపీఈ డయోగ్నస్టిక్స్, బ్లూసెమి కంపెనీల ఉత్పత్తులను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన మంత్రి.. సుల్తాన్‌పూర్‌లో తయారైన ఉత్పత్తులు దేశంలోనే, ప్రపంచంలోనే వినూత్నమైనవని కొనియాడారు.

KTR
KTR

KTR launched products at Sultanpur Medical Devices Park : హైదరాాదాద్‌లోని సుల్తాన్‌పూర్ మెడికల్ డివైజెస్ పార్కులో తయారైన వినూత్న ఉత్పత్తులను పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. హూవెల్ లైఫ్ సైన్సెస్, ఈఎంపీఈ డయోగ్నస్టిక్స్, బ్లూసెమి కంపెనీల ఉత్పత్తులను ప్రారంభించారు. ఉత్పత్తులను పరీక్షించేందుకు పార్కులోని ఆరు కంపెనీలతో మంత్రి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

న్యూక్లియర్ యాసిడ్ పరీక్షల ద్వారా వ్యాధులను నిర్ధరించే పామ్‌టాప్ మాలిక్యులర్ డివైస్ హూవెల్ యూనియాప్, రెండు నిమిషాల్లోనే ఫలితం వచ్చేలా ఏఐ ఆధారిత హెమోగ్లోబిన్ టెస్టింగ్ డివైస్‌లను హూవెల్ లైఫ్ సైన్సెస్ తయారు చేసింది. టీబీ బ్యాక్టీరియా, యాంటిబయాటిక్ రెసిస్టెన్స్‌ను కేవలం మూడు గంటల్లోనే ఖచ్చితంగా నిర్ధరించేలా టెస్ట్ కిట్‌ను ఈఎంపీఈ డయోగ్నస్టిక్స్ రూపొందించింది.

స్పర్శతో కేవలం నిమిషంలోపే ఆరు వైటల్ కాంపోనెంట్స్‌ను పరీక్షించే ఇవ్య గాడ్జెట్‌ను టీహబ్ నుంచి వచ్చిన బ్లూసెమి కంపెనీ తయారు చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్‌.. ఉత్పత్తుల ఆవిష్కరణ, కంపెనీలతో ఒప్పందం రాష్ట్ర మెడ్‌టెక్ రంగం వృద్ధికి నిదర్శమని పేర్కొన్నారు. తెలంగాణ మెడ్‌టెక్ రంగంలో మరో మైలురాయిని అధిగమించామని హర్షం వ్యక్తం చేశారు. సుల్తాన్‌పూర్‌లో తయారైన ఉత్పత్తులు దేశంలోనే, ప్రపంచంలోనే వినూత్నమైనవని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Origen Pharma company to invest in Hyderabad : మరోవైపు రాష్ట్రంలో ఆరిజెన్ ఫార్మా సంస్థ జీనోం వ్యాలీలోఅత్యున్నత ప్రమాణాలతో బయోమ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. 40 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ కేంద్రం ద్వారా 250 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన కంపెనీ ప్రతినిధులు.. పెట్టుబడి ప్రకటన చేశారు. ఆరిజెన్ ఫార్మా సంస్థ ప్రకటనను స్వాగతించిన మంత్రి.. కాంప్లెక్స్ మాన్యుఫ్యాక్చరింగ్‌ను ప్రోత్సహించడంలో గణనీయమైన పురోగతి కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Biomanufacturing Facility Center at Genome Valley : బయోలాజిక్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, తయారీ రంగాల్లో హైదరాబాద్‌లో అద్భుత ఎకో సిస్టం ఉందని పేర్కొన్నారు. భారతదేశంలోని బయోలాజిక్స్ మొత్తం కెపాసిటీలో 30 నుంచి 40 శాతం ఇక్కడే ఉందని కేటీఆర్‌ వెల్లడించారు. తాజా పెట్టుబడితో బయోఫార్మాస్యూటికల్ పరిశోధన, ఉత్పత్తికి మంచి స్థానంగా హైదరాబాద్ స్థితిని మరింత పెంచిందని మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా మారుతోందని కేటీఆర్ అన్నారు. తొమ్మిదేళ్ల క్రితం తెలంగాణను.. ఇప్పటి తెలంగాణ ఎంతగా మారిందో ఓసారి పరిశీలించాలని ఆయన విపక్షాలకు సూచించారు. తెలంగాణ అభివృద్ధి బీఆర్​ఎస్​తోనే సాధ్యమని అది ఇక్కడి ప్రజలు కూడా గుర్తించారని తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details