తెలంగాణ

telangana

Ganesh Nimajjanam Hyderabad 2023 : డీజే చప్పుళ్లు ​.. అదిరిపోయే స్టెప్పులు.. దంచికొట్టిన వర్షంలో గణనాథుల నిమజ్జనం

By ETV Bharat Telangana Team

Published : Sep 29, 2023, 7:08 AM IST

Ganesh Nimajjanam Hyderabad 2023: హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం కోలాహాలంగా కొనసాగుతోంది. నగరంలో గురువారం ఉదయం ప్రారంభమైన వినాయక శోభాయాత్ర.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 11 రోజులపాటు పూజలందుకున్న గణపతి విగ్రహాలను నగరవ్యాప్తంగా హుస్సేన్‌సాగర్‌ సహా 100 చోట్ల ఏర్పాటు చేసిన కేంద్రాల్లో నిమజ్జనం చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం వరకు గణేశ్‌ యాత్ర, నిమజ్జనాలు జరిగే అవకాశం ఉన్నాయి. బండ్లగూడలో గణేశుడి లడ్డూ కోటి 25లక్షలు పలుకగా.. బాలాపూర్‌ లడ్డూ ఈ సారి రూ.27 లక్షలు పలికింది.

Vinayaka Immersion Celebrations 2023
Hyderabad Ganesh Nimajjanam Celebrations

Ganesh Nimajjanam 2023 జైజై గణేశా.. బైబై గణేశా

Ganesh Nimajjanam Hyderabad 2023 : భక్తి పారవశ్యం మధ్య హైదరాబాద్‌లో గణనాయకుల శోభాయాత్ర.. నిమజ్జనోత్సవం అత్యంత కోలాహలంగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 11 రోజులపాటు ఘనంగా పూజలందుకున్న గణపతులు గంగమ్మ ఒడికిచేరుకుంటున్నారు. హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్‌ సహా 100 చోట్ల ఏర్పాటు చేసిన కేంద్రాల్లో నిమజ్జనం కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాలు మొదలైనప్పటి నుంచీ గురువారం సాయంత్రం వరకు లక్ష విగ్రహాల నిమజ్జనం పూర్తయింది.

Hyderabad Ganesh Nimajjanam 2023 :గురువారం ఉదయం నుంచే విగ్రహాలు తరలిరావడంతో హుస్సేన్‌సాగర్‌ వద్ద కోలాహలం మొదలైంది. ఎన్టీఆర్​ మార్గ్‌, ట్యాంక్‌బండ్‌, పీవీమార్గ్‌లోని కేంద్రాల వద్దకు గణనాథులు బారులు తీరారు. ఉదయం ఆరు గంటలకు ఖైరతాబాద్‌ గణేశుడి(Khairatabad Ganesh) శోభాయాత్ర మొదలవగా, సుమారు అయిదున్నర గంటల ఊరేగింపు తర్వాత ఎన్టీఆర్‌ మార్గ్‌లోని బాహుబలి క్రేన్‌ వద్దకు చేరుకుంది. మధ్యాహ్నం ఒకటిన్నరకు నిమజ్జనం పూర్తయింది. మహాగణపతి గంగ ఒడికి చేరే దృశ్యాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.

Telangana Police Dance At Ganesh Immersion : గణేశ్‌ నిమజ్జనంలో స్టెప్పులు వేసిన పోలీసులు.. వీడియో వైరల్‌

Hyderabad Ganesh Immersion 2023: బషీర్‌బాగ్‌లో వర్షం కురుస్తుండగా.. గంగమ్మ ఒడిని చేరేందుకు గణనాథులు వరుస కట్టిన దృశ్యాలు ఆకట్టుకున్నాయి. కుత్బుల్లాపూర్‌లో స్కేటింగ్ చేస్తూ వినాయకుడ్ని నిమజ్జనానికి తీసుకెళ్లిన దృశ్యాలు ఆకట్టుకున్నాయి. శేరిలింగంపల్లి ప్రాంతంలోని చందానగర్ గంగారం చెరువు, మాదాపుర్ దుర్గం చెరువు, రాయదుర్గం మల్కం చెరువుల వద్ద కోలాహాలంగా నిమజ్జనం సాగుతున్నాయి.

ఆర్​కేపురం పరిధిలోని చిత్రలేఅవుట్‌లో 16ఏళ్లుగా ఏర్పాటు చేస్తున్న మట్టి గణపతి ఈ సారి కూడా ఆకట్టుకుంది. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ.. అపార్ట్‌మెంటు వాసులంతా ఆటాపాటలతో గణపయ్యను ఘనంగా సాగనంపారు. హైదరాబాద్‌లో గణేశ్‌ శోభాయాత్రను మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌(Talasani Srinivas Yadav), మహమూద్‌ అలీ, డీజీపీ అంజనీకుమార్‌, జీహెచ్​ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ హెలికాప్టర్‌ ద్వారా పరిశీలించారు.

Balapur Ganesh Immersion Completed At Tank Bund : ముగిసిన బాలాపూర్ మహా గణపతి నిమజ్జనం

Vinayaka Nimajjanam at Hussain Sagar : సాయంత్రానికి సాగర్‌ పరిసరాలతో పాటు నగరవ్యాప్తంగా ఉన్న వందకుపైగా నిమజ్జన కేంద్రాల్లో భక్తుల రద్దీ మరింత పెరిగింది. 40 వేల మంది పోలీసులు, పలు ప్రత్యేక భద్రతా దళాలతో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. రహదారులు, నిమజ్జన ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన 20 వేల సీసీటీవీ కెమెరాలను పోలీసులు కంట్రోలు రూమ్‌నుంచి వీక్షిస్తూ శాంతి భద్రతలను పర్యవేక్షించారు. కాప్రా, సఫిల్‌గూడ చెర్వుల వద్ద పరిస్థితిని రాచకొండ సీపీ చౌహాన్‌ పరిశీలించారు. సూరారం లింగంచెరువు వద్ద నిమజ్జన కార్యక్రమాన్ని సైబరాబాద్ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర పరిశీలించారు.

Balapur Laddu Ganesh Auction 2023: జీహెచ్​ఎంసీ 10 వేల మంది సిబ్బందిని నియమించి, పారిశుద్ధ్య చర్యలు చేపట్టింది. భాగ్యనగర్‌ ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు నిమజ్జన ఉత్సవాల్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని వివిధ గణేశ్‌ మండపాల వద్ద నిర్వహించిన లడ్డూ వేలంలో భక్తులు పోటీపడ్డారు. గండిపేట మండలం బండ్లగూడ జాగీర్‌లోని కీర్తి రిచ్‌మండ్‌ గేటెడ్‌ కమ్యూనిటీ విల్లాస్‌లోని మండపం వద్ద జరిగిన వేలం పాటలో కమ్యూనిటీ గ్రూప్‌నకు చెందిన ఆర్వీ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 150మందికి పైగా దాతలు కలిసి, కోటి 25లక్షల రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు. మరోవైపు.. బాలాపూర్‌ లడ్డూ ఎప్పటిలాగే భారీ ధర పలికింది. దాసరి దయానంద్‌రెడ్డి రూ.27లక్షలకు ఇక్కడ లడ్డూను దక్కించుకున్నారు.

Ganesh Nimajjanam 2023 Hyderabad : జైజై గణేశా.. బైబై గణేశా.. భాగ్యనగరంలో కన్నులపండువగా గణనాథుడి మహా నిమజ్జనోత్సవం

Marwadi People Dance in Ganesh Nimajjanam 2023 : గణేశుని నిమజ్జన వేడుకల్లో స్టెప్పులతో అలరించిన మార్వాడీలు

ABOUT THE AUTHOR

...view details