ETV Bharat / state

Ganesh Nimajjanam 2023 Hyderabad : జైజై గణేశా.. బైబై గణేశా.. భాగ్యనగరంలో కన్నులపండువగా గణనాథుడి మహా నిమజ్జనోత్సవం

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 28, 2023, 8:42 PM IST

Ganesh Nimajjanam
Ganesh Nimajjanam 2023 Hyderabad

Ganesh Nimajjanam 2023 Hyderabad : భాగ్యనగరంలో గణనాథుడి మహా నిమజ్జనోత్సవం కనులపండువగా సాగుతోంది. హుస్సేన్‌సాగర్‌లో జంటనగరాలతో పాటు ఉమ్మడి రంగారెడ్డి నుంచి వస్తున్న గణపతులను గంగమ్మ ఒడికి చేర్చుతున్నారు. విఘ్నేశ్వరుని శోభాయాత్రలో భక్తజనం కోలాహలం మిన్నంటుతోంది. బారులు తీరిన పార్వతీతనయ ప్రతిమలను చూసి నగరవాసులు మంత్రమగ్ధులయ్యారు. హైదరాబాద్‌లో అడుగడుగునా.. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. సాంస్కృతిక నృత్యాలు, డప్పుచప్పుళ్ల మధ్య విఘ్ననాయకులికి ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు.

Ganesh Nimajjanam 2023 Hyderabad జైజై గణేశా బైబై గణేశా భాగ్యనగరంలో కన్నులపండువగా గణనాథుడి మహా నిమజ్జనోత్సవం

Ganesh Nimajjanam 2023 Hyderabad : హైదరాబాద్‌లో నవరాత్రులు విశిష్ట పూజలందుకున్న బొజ్జగణపయ్యలు గంగమ్మ చెంతకు చేరుతున్నారు. హుసేన్‌సాగర్‌ పరిధిలోని ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్ మార్గ్‌, నెక్లెస్‌రోడ్‌ సహా దుర్గం చెరువు, హస్మత్‌పేట, సరూర్‌నగర్‌, మీరాలం ట్యాంక్‌, అల్వాల్‌, రాజన్నబౌలి, మెట్‌ చెరవుతో పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన వంద ప్రాంతాల్లో నిమజ్జన వేడుక(Ganesh Nimajjanam) సందడిగా సాగుతోంది. హుసేన్‌సాగర్‌ పరిసరాల్లో 25 క్రేన్ల ద్వారా పార్వతీతనయ ప్రతిమలు సాగర్‌ ఒడిలోకి చేరుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు చర్యలు చేపట్టారు. సీసీటీవీ కెమెరాలతో నిరంతరం ప్రత్యేక నిఘా ఉంచారు.

Ganesh Shobha Yatra in Hyderabad : గణేషుడి నిమజ్జన క్రతవు సజావుగా సాగేందుకు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌(Thalasani Srinivas Yadav), మహమూద్‌ అలీ పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. చార్మినార్, మొజంజాహి మార్కెట్, ఆబిడ్స్, లిబర్టీ, తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌ల వద్ద శోభాయాత్రగా వస్తున్న ప్రతిమలకు స్వాగతం పలికారు. హుస్సేన్​సాగర్‌లో బోట్‌లో తిరుగుతూ నిమజ్జనాన్ని పర్యవేక్షించారు.

బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో పోలీసు, బల్దియా ఉన్నతాధికారులతో కలిసి విహంగ వీక్షణం ద్వారా శోభాయాత్ర(Shobha Yatra), నిమజ్జనం(Ganesh Immersion) జరుగుతున్న తీరు పరిశీలించారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చినా.. ఎలాంటి ఇబ్బందులకు తావులేకుండా అన్ని ప్రభుత్వశాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశామని వివరించారు. శుక్రవారం ఉదయం వరకు నిమజ్జనాలు కొనసాగే అవకాశాలున్నాయని మంత్రి తలసాని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని చిన్న చెరువులు, కొలనుల వద్ద పలుచోట్ల నిమజ్జనం జీహెచ్​ఎంసీ, ఇతర శాఖల సమన్వయంతో ప్రశాంతంగా ముగిసిందని మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు.

Ganesh Nimajjanam at Saroor Nagar Lake : సరూర్​నగర్ చెరువు వద్ద నిమజ్జన కోలాహలం.. నెలకొన్న భక్తుల రద్దీ

Ganesh Nimajjanam 2023 Celebrations : 40 వేల మంది పోలీసు సిబ్బంది శోభాయాత్ర, నిమజ్జన క్రతువులో సేవలందించారు. బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ద్వారా ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించారు. బాలాపూర్‌(Balapur Ganesh) భారీ గణనాథుడు శోభాయాత్రకు కదలగానే.. పాతబస్తీలోని విగ్రహాలు అనుసరించాయి. బాలాపూర్‌ ఊరేగింపులో మంత్రి సబిత పాల్గొన్నారు. హుసేన్‌సాగర్‌ వద్ద పాతబస్తీకి చెందిన వ్యాపారి శ్రీధర్‌ భక్తులకు అన్నదానం చేశారు. నిమజ్జన ఉత్సవాన్ని చూసేందుకు తరలివచ్చిన జనం ఆకలి తీర్చుకున్నారు. శోభాయాత్ర ప్రాంతం భక్తులు హుషారెత్తే నృత్యాలతో జోష్‌ నింపారు. బేగంబాజర్‌కు చెందిన మార్వాడీలు లంబోదరుడి విగ్రహాల ఎదుట దాండి నృత్యాలు చేస్తూ భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.

Ganesh Immersion Hyderabad 2023 : పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారిని కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి దర్శించుకున్నారు. అనంతరం చార్మినార్‌ వద్ద శోభాయాత్రకు హాజరయ్యారు. గణనాథులపై పూలు చల్లుతూ భక్తజనాన్ని ఉత్సాహపరిచారు. భాగ్యనగరంలో జరుగుతున్న నిమజ్జన కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది నృత్యాలు చేశారు. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ వద్ద మధ్య మండలం అడిషనల్ డీసీపీ ఆనంద్, ఏసీపీలు సంజయ్, పూర్ణచందర్ రావుతో పాటు డప్పుచప్పుళ్లకు లయబద్దంగా ఆడుతూ హోరెత్తించారు.

గణేశ్ నిమజ్జనోత్సవం ఓటరు అవగాహనకు వేదికగా మారింది. శాసనసభ ఎన్నికలు సమీపించిన తరుణంలో ఓటరు జాబితా(Voter List)లో పేరు సరి చూసుకోవడం, ఓటు హక్కు ఆవశ్యకత, వినియోగంపై ఈసీ అవగాహన కల్పించింది. వాలంటీర్ల ద్వారా కరపత్రాలు పంపిణీ చేసి ఓటర్లలో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేశారు. శోభాయాత్రలు సాగే దారుల్లో సాధారణ వాహనాల రాకపోకలకపై ట్రాఫిక్‌ పోలీసులు ఆంక్షలు విధించారు. నిమజ్జనం వేళ అర్ధరాత్రి ఒంటి గంట వరకు రైళ్లు నడిపేలా హైదరాబాద్‌ మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటికప్పుడు చెత్త తొలగించేందుకు జీహెచ్​ఎంసీ పరిధిలో 10 వేల మంది పారిశుద్ధ్య సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు.

Balapur Ganesh Immersion Completed At Tank Bund : ముగిసిన బాలాపూర్ మహా గణపతి నిమజ్జనం

Ganesh Nimajjanam 2023 : జైజై గణేశా.. బైబై గణేశా.. భాగ్యనగరంలో నిమజ్జనం సందడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.