తెలంగాణ

telangana

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక - పార్టీ వాణి బలంగా వినిపించే వారికే బీఆర్ఎస్ ఛాన్స్!

By ETV Bharat Telangana Team

Published : Jan 5, 2024, 8:54 AM IST

BRS on MLA Quota MLC Elections 2024 : పెద్దలసభ అవకాశం ఎవరికి దక్కుతుందనేది బీఆర్‌ఎస్‌లో చర్చనీయాంశమైంది. శాసనసభ సభ్యుల కోటాలో పార్టీకి దక్కేఅవకాశం ఉన్న, ఒక స్థానానికి ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. గతంలో వివిధ కారణాలతో అవకాశం కోల్పోయిన వారితోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న సిట్టింగ్‌లు సహా పలువురు ఇతర నేతలపేర్లు ప్రచారంలో ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్న తరుణంలో, పార్టీ వాణి బలంగా వినిపించే వారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వవచ్చని భావిస్తున్నారు.

Brs
Brs

ఎమ్మెల్సీ అవకాశంపై బీఆర్ఎస్‌లో చర్చ

BRS on MLA Quota MLC Elections 2024 : శాసనసభ కోటా ఎమ్మెల్సీగా (Telangana MLC Election Schedule 2024)బీఆర్ఎస్‌ ఎవరికి అవకాశం కల్పిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కడియం శ్రీహరి, పాడికౌశిక్‌రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రెండు మండలి స్థానాలకు, ఈనెల 29న పోలింగ్ జరగనుంది. ప్రస్తుత బలాబలాల ప్రకారం భారత్ రాష్ట్ర సమితి ఒక స్థానం దక్కే అవకాశం ఉండటంతో ఎవరిని ఎంపిక చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను నామినేటెడ్ ఎమ్మెల్సీగా గతంలో మంత్రివర్గం సిఫార్సు చేస్తే గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తిరస్కరించగా వారు ఇటీవలే కోర్టును ఆశ్రయించారు.

MLA Quota MLC Elections Telangana 2024 :ప్రస్తుతం అధికారం కోల్పోయినందున దాసోజు శ్రవణ్‌కు (Dasoju Shravan) అసెంబ్లీ కోటాలో, మండలికి పంపే అవకాశం లేకపోలేదంటున్నారు. గతంలో పాడికౌశిక్ రెడ్డి పేరును గవర్నర్ తిరస్కరించినపుడు అదే తరహాలో శాసనసభ్యుల కోటా నుంచి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. ఎరుకల సామాజికవర్గానికి చెందిన కుర్రా సత్యనారాయణని పరిగణలోకి తీసుకోవచ్చు. సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉండి ఇటీవలి ఎన్నికల్లో టికెట్ నిరాకరించిన, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రాజయ్య, మదన్‌రెడ్డి పేర్లు పరిశీలనకు వచ్చే అవకాశంఉంది.

ప్రజాతీర్పును గౌరవిద్దాం - ఎన్నికల ఫలితాలపై త్వరలో సమీక్ష ఉంటుందన్న కేసీఆర్

మదన్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం :వాస్తవానికి మదన్‌రెడ్డికి మెదక్ లోక్‌సభ టికెట్‌ ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయించింది. అయితే మారిన పరిస్థితిలో, మెదక్ నుంచి కేసీఆర్ లోక్‌సభకు పోటీ చేసే ఆలోచన ఉంటే మదన్‌రెడ్డికి మండలి అవకాశం ఇచ్చే ఉందని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన సీనియర్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, రావుల చంద్రశేఖర్‌రెడ్డితో పాటు తులఉమ, గాలి అనిల్ కుమార్, జిట్టా బాలకృష్ణారెడ్డి పేర్లు పరిగణలోకి వచ్చే అవకాశంఉంది.

దేశానికి టార్చ్ బేరర్​గా మారిన తెలంగాణ జ్యోతిని ఆరిపోనివ్వం : కేటీఆర్‌

Telangana MLC Election Schedule 2024 : ఆత్రం సక్కు లేదా నగేశ్‌లలో ఒకరిని ఎమ్మెల్సీని పంపే అవకాశం లేకపోలేదు. ఆసిఫాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆత్రం సక్కుకు టికెట్ ఇవ్వనందున ఎంపీగా అవకాశమిస్తామని నాయకత్వం హామీ ఇచ్చినట్లు సమాచారం. అదే జరిగితే గతంలో ఆదిలాబాద్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన నగేశ్‌ని మండలికి పంపవచ్చు. ఒకవేళ నగేశ్‌కే ఎంపీ టికెట్ ఇచ్చే ఆలోచన ఉంటే, సక్కుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వవచ్చు.

మండలిలో పార్టీ వాణిని బలంగా వినిపించే వారికే : కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్‌సింగ్‌ని పరిశీలనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఈసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చే విషయంలో పార్టీ చాలా ఆచితూచి వ్యవహరించే పరిస్థితి ఉంది. విపక్షంలో ఉన్నందున మండలిలో పార్టీ వాణిని బలంగా వినిపించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొనే వారికి అవకాశం కల్పించవచ్చు.

లోక్‌సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ - పోటీకి సిట్టింగ్, మాజీ ఎంపీలు, మాజీ మంత్రుల ఆసక్తి

'ఫలితాలను చూసి నిరాశపడొద్దు - బీఆర్‌ఎస్‌కు ఇది తాత్కాలిక స్పీడ్ బ్రేక్ మాత్రమే'

ABOUT THE AUTHOR

...view details