ప్రజాతీర్పును గౌరవిద్దాం - ఎన్నికల ఫలితాలపై త్వరలో సమీక్ష ఉంటుందన్న కేసీఆర్

By ETV Bharat Telangana Team

Published : Dec 4, 2023, 8:06 PM IST

Updated : Dec 4, 2023, 9:17 PM IST

thumbnail

BRS MLA's Met Former CM KCR at FarmHouse : కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని ఎన్నికైన బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు, నేతలకు ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. ఎన్నికల ఫలితాలపై సమీక్షించేందుకు త్వరలో తెలంగాణ భవన్​లో పార్టీ సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ నేతలకు తెలిపారు. శాసనసభ పక్ష నేతను కూడా త్వరలో ఎన్నుకుందామని ఎమ్మెల్యేలతో పేర్కొన్నారు. ఇవాళ బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు సిద్దిపేట జిల్లా మార్కుక్​ మండలంలోని ఎర్రవల్లిలో కేసీఆర్​ ఫామ్​ హౌస్​కు వెళ్లి ఆయనను కలిశారు. కేసీఆర్​ను కలిసిన వారిలో హరీష్ రావు, కేటీఆర్​లతో పాటు ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, కడియం శ్రీహరి, జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డితో పాటు... మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.

ఈ క్రమంలో గజ్వేల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా కేసీఆర్ ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని పార్టీ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి అందచేశారు. నిన్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్​ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్​ తమిళిసై సౌందర్యరాజన్​కు పంపి అక్కడి నుంచి ఫామ్​ హౌస్​కు బయల్దేరారు. 

Last Updated : Dec 4, 2023, 9:17 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.